
చిత్తూరు అర్బన్: పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ మోజులో పడిన 21 ఏళ్ల యువకుడు కన్న తండ్రిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరచా డు. తాను కొడుతున్న దృశ్యాన్ని ప్రియురాలికి వీడియోకాల్ చేసి తండ్రిని చితకబాదాడు. చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి టూటౌన్ ఎస్‌ఐ మల్లికార్జున, బాధితుడి కథనం మేరకు.. ఢిల్లీబాబు అనే వ్యక్తి గాంధీరోడ్డులో కాపురముంటూ హోంగార్డుగా పనిచేస్తున్నాడు.
ఇతని కొడుకు భరత్ (21) ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్న 39 ఏళ్ల ఓ మహిళతో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. ఇది నచ్చకపోవడంతో కుమారుడిని పలు మార్లు ఢిల్లీబాబు హెచ్చరించాడు. ఈవిషయమై తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలున్నాయి.
ఆదివారం ఇంట్లో భోజనం చేస్తున్న తండ్రి వద్దకు వచ్చిన భరత్.. మహిళకు వీడియోకాల్ చేసి తన తండ్రిని కొడుతున్న దృశ్యం చూడమంటూ ఫోన్ ఆన్‌లోనే ఉంచి దాడి చేశాడు. చింతకట్టెతో తలపై తీవ్రంగా కొ ట్టడంతో ఢిల్లీబాబుకు రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ ఢిల్లీబాబును కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment