
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. అయితే, తనకు ఊపిరి ఆడటం లేదని, వెంటిలేటర్ పెట్టమని బతిమలాడినా సిబ్బంది పట్టించుకోలేదని అతను చనిపోయేముందు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిసింది. నగరంలోని జవహర్ నగర్‌కు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో చెస్ట్ ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి ఆడటం లేదని, ప్రాణం పోయేలా ఉందని కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టిన వెంటిలేటర్‌ను తొలగించారని ఆరోపించాడు. మూడు గంటల నుంచి బతిమాలుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. చివరి క్షణంలో అందరికీ వీడ్కోలు చెప్తూ దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వీడియో రికార్డింగ్ బయటకు రావడంతో డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, యువకుడి అంత్యక్రియల్లో 30 మంది బంధువులు పాల్గొన్నట్టు సమాచారం. అంత్యక్రియల అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
(చదవండి: అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్ : కేసీఆర్)