
సాక్షి, హైదరాబాద్ : చెస్ట్ ఆస్పత్రిలో యువకుడు రవికుమార్ మృతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్ అందకే రవికుమార్ మృతిచెందాడని గురువారం పిటిషనర్ వాదనలు వినిపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రవికుమార్ చనిపోలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ హైకోర్టుకు స్పష్టం చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయాడన్నది అవాస్తవమని కోర్టుకు వివరించారు. (చదవండి : సురేష్‌పై ఎందుకంత ప్రేమ? : హైకోర్టు)
యువకుడికి ఆక్సిజన్ అందకనే మృతిచెందాడన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. యువకుడి మృతిపై పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment