Coronavirus Effect: Telangana High Court Issued Key Orders To Government - Sakshi
Sakshi News home page

కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Published Thu, Apr 8 2021 1:05 PM | Last Updated on Thu, Apr 8 2021 3:27 PM

TS High Court Has Issued Key Directions To Government On Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఎక్కడ కేసులు ఎక్కువ ఉంటే వాటిని మైక్రో కంటోన్మెంట్‌ జోన్స్ కింద ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తెలంగాణకు వచ్చే ప్రతి ప్రయాణికుడి నుంచి తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్ సర్టిఫికెట్ తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఫంక్షన్‌ హాల్స్‌, మ్యారేజ్ హాల్స్‌ వద్ద ఎక్కువమంది గుమికూడితే అలాంటివారిపై క్రిమినల్ యాక్షన్‌ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారో చెప్పాలని ప్రభుతాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా వ్యాక్సిన్ ఎంత వచ్చింది? ఎంత వేస్టేజ్ అయిందో చెప్పాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో మళ్లీ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.
చదవండి:
కోవిడ్‌ టీకాల కోసం పరుగులు.. మీరు క్యూలో ఉన్నారు!
బేగంబజార్‌లో కరోనా కలకలం‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement