directions
-
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి బాబు పథకం
-
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శాఖల వారీగా శ్వేత పత్రం
-
తండ్రి కోసం కోడుకు..బయటనుండి లోకేష్ డైరెక్షన్స్...
-
విద్యార్థుల చదువులపై మరింత దృష్టి సారించండి
-
అకాల వర్షాలు..క్రియాశీలంగా స్పందిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం
-
సుకుమార్ మాస్టర్ ప్లాన్ అక్కడి వరకే..
-
జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల వేతనం నుంచి టీడీఎస్ మినహాయించే ముందు పాత, కొత్త పన్ను విధానాల్లో వారికి ఏది సమ్మతమో సంస్థలు తెలుసుకోవాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న పన్ను విధానం పరిధిలోనే టీడీఎస్ వసూలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులు ఏ ఆప్షన్ చెప్పకపోతే, అప్పుడు నూతన పన్ను విధానం కింద టీడీఎస్ మినహాయించాలని కోరింది. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్! -
ప్రపంచ పరిణామాలు దారి చూపుతాయ్
ముంబై: దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్టాక్ సూచీలకు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి డెరివేటివ్స్ ఎక్స్పైరీ(గురువారం) ముగింపు ఉండటంతో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఆస్కారం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిపై దృష్టి సారించవచ్చు. ఇదే వారంలో వెలువడనున్న ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఆశాజన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు కలిసిరావడంతో గతవారంలో సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సూచీలు అరశాతం బలపడినా.., కఠిన ద్రవ్య విధాన అమలు భయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు ప్రభావంతో సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనవచ్చు. ‘‘ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. మార్కెట్ వ్యాల్యుయేషన్లు సహేతుకంగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి కనబరుస్తున్నారు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 18000 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే 17650 – 17500 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 18200 – 18250 పాయింట్ల పరిధిని చేధించాల్సి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు ఈ గురువారం(ఫిబ్రవరి 23న) నిఫ్టీకి చెందిన ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,800–18,200 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ప్రపంచ పరిణామాలు యూరోజోన్‌తో పాటు అమెరికా దేశాల తయారీ, గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల అవుతుంది. బుధవారం యూరోజోన్ నాన్ మానటరీ పాలసీ సమావేశం ఉంది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ మినిట్స్ గురువారం వెల్లడి కానున్నాయి. అదే రోజున అమెరికా నాలుగో క్వార్టర్ జీడీపీ విడుదల కానున్నాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ ఆర్థిక వ్యవస్థ నుంచి సానుకూల సంకేతాలు వెలువడితే దేశీయ మార్కెట్ ముందడుగు వేస్తుంది. ఇందుకు విరుద్ధంగా బలమైన ఆర్థిక గణాంకాల నమోదు, ద్రవ్యోల్బణ తగ్గుదల కనిపిస్తే ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో మార్కెట్లు పతనాన్ని చవిచూస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలకు పాల్పడిన విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలో రూ.7,600 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఈ ఏడాదిలో ఇప్పటికి వరకు రూ.9,000 కోట్లు ఈక్విటీ షేర్లను కొన్నారు. ‘‘అదానీ సంక్షోభం నుంచి మార్కెట్ తేరుకోవడం ప్రారంభించిన తర్వాత ఎఫ్ఐఐల కొనుగోళ్లు మెరుగయ్యాయి. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారు ఆసక్తి కనబరుస్తారనే విషయాన్ని సూచిస్తుంది. అయితే గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం లేకపోలేదు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి ఆర్బీఐ ఈ ఫిబ్రవరి 6–8 తేదీల మధ్య నిర్వహించిన ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(బుధవారం) వెల్లడి కానున్నాయి. పాలసీ విధాన వైఖరిని మరింత లోతుగా విశ్లేషించేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అంచనాలకు తగ్గట్టే ఫిబ్రవరిలో ఆర్బీఐ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి కమిటీ అప్రమత్తంగానే ఉంటుందని, అవసరమైతే కఠిన పాలసీ వైఖరి విధానాన్ని కొనసాగిస్తామని గవర్నర్ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. -
ట్రాఫిక్ని బట్టి సెట్ చేసుకునే డివైడర్: వీడియో వైరల్
మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు గురించి అందరికి తెలిసిందే. ఏదైన పండుగలకు లేదా ప్రత్యేకమైన రోజుల్లో సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లామా! అంతే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతాం. అసలు ఆ ట్రాఫిక్ నుంచి బయటపడితే ఏదో సాధించనంత ఫీలింగ్ వస్తుంది. ఐతే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెడుతూ చైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. చైనీయులు ఈ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఒక సరికొత్త విధానాన్ని కూడా అనుసరిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని వినియోగదారులతో పంచుకుంటూ... ఒక వీడియోను పోస్ట్ చేశారు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్. ఆ వీడియోలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడూ క్లియర్ చేసేందుకు ఒక రివర్సబుల్ లేన్ పని తీరు చూపిస్తుంది. ఇది ఏంటంటే...రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్ చేసుకుంటూ ట్రాఫిక్ని తగ్గించడం. చైనా వాసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉదయం ఒక దిశలోనూ సాయంత్రం సమయాల్లో వ్యతిరేక దిశలో వెళ్తారు. అందుకోసం ఆయా దిశల్లో వెళ్లేలా డివైడర్ లైన్‌ని సెట్ చేసేకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ వీడియోలో ఆ డివైడర్ లైన్‌ని ట్రాఫిక్ కోసం జిప్ మాదిరిగా రెండు వాహనాల సాయంతో దగ్గరగా చేయడం కనిపిస్తుంది. వీటిని రివర్సబుల్ ట్రాఫిక్ లైన్లు అంటారు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తాయి. ఐతే నెటిజన్లు దీన్ని సరికొత్త సాంకేతిక ఆవిష్కరణగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇదేమీ కొత్త ఆవిష్కరణ కాదని అమెరికా 1960లలోనే ఈ మౌలిక సదుపాయాల ఆవిష్కరణను ప్రవేశపెట్టినట్లు సమాచారం. #ChinaInfrastructure: How does Beijing relieve traffic jams? By changing the direction of traffic. Here's how they do it. The traffic authority selects a lane to go one direction in the morning and the opposite direction in the evening to release peak pressure. pic.twitter.com/OaaxycwDJQ — Hua Chunying 华春莹 (@SpokespersonCHN) August 31, 2022 (చదవండి: స్నేహితుడి కోసం ఎంతలా తపించిందో ఆ కంగారు: వీడియో వైరల్) -
వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్ ను పునరుద్దరించాలని సీఎం జగన్ ఆదేశం
-
కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఎక్కడ కేసులు ఎక్కువ ఉంటే వాటిని మైక్రో కంటోన్మెంట్ జోన్స్ కింద ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తెలంగాణకు వచ్చే ప్రతి ప్రయాణికుడి నుంచి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ హాల్స్ వద్ద ఎక్కువమంది గుమికూడితే అలాంటివారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారో చెప్పాలని ప్రభుతాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా వ్యాక్సిన్ ఎంత వచ్చింది? ఎంత వేస్టేజ్ అయిందో చెప్పాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో మళ్లీ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: కోవిడ్ టీకాల కోసం పరుగులు.. మీరు క్యూలో ఉన్నారు! బేగంబజార్‌లో కరోనా కలకలం -
ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం హాజరు కావాలని పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు హాజరుకావాలని ప్రభుత్వం వెల్లడించింది. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లల్లో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి వీరు అనర్హులు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) విధి విధానాలను కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6వేలు సాయంగా అందించేందుకు ఉద్దేశించిన పీఎం–కిసాన్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పని చేస్తున్న/రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత/మాజీ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మునిసిపల్ మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు ఈ పథకానికి అర్హులు కారు. గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా అనర్హులుగా ప్రకటించింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్నా కూడా.. కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వృత్తి నిపుణులు (వైద్యులు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు)ఉన్నా అర్హులు కారని తెలిపింది. ఈ పథకం కింద కేంద్రం రూ.75వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. -
హైకోర్టు విభజనపై సుప్రీం తాజా ఉత్తర్వులు
-
హైకోర్టు విభజనపై సుప్రీం తాజా ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక వసతులు సిద్ధమైతే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ అనంతరం ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వహించడం ప్రారంభమవుతుంది. ఏపీ హైకోర్టు కొత్త భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. పరిశీలన కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీకి వెళ్లే హైకోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఏపీ తెలిపింది. అమరావతిలో జస్టిస్ సిటీ పేరుతో పెద్ద కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని, అందులోనే హైకోర్టు, సబార్డినేట్ కోర్టు జడ్జీల వసతి సదుపాయాలు, నివాస గృహాలు ఏర్పాటు చేస్తారని సుప్రీంకు ఏపీ నివేదించింది. అప్పటివరకూ తాత్కాలిక భవనాల్లో హైకోర్టు కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు ఏపీలో హైకోర్టు కార్యకలాపాలకు అవసరమైనవన్నీ సిద్ధమైతే నోటిఫికేషన్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. -
ప్రాణబంధం
లోకానికి నాలుగు దిక్కులు ఉన్నట్లే, పిల్లలకు నలువైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆ నలువైపులా పిల్లలకు కాపలాగా నిలబడవలసింది తల్లిదండ్రులే. బిడ్డకు ఏదైనా అయితే, బిడ్డ ఏమైనా అయితే తల్లి దుఃఖం ఏ దేవుడూ తీర్చలేనిది! చేతుల్లోని బిడ్డను జారవిడుచుకున్నప్పుడైతే ఇక ఆ తల్లి దేవుణ్ని చేతులు జోడించి వేడుకునే అర్హతను కూడా కోల్పోయినట్లుగా కుమిలిపోతోంది. ఫెమిదీ షేక్‌కు 23 ఏళ్లు. బిడ్డను ఒడుపుగా ఎత్తుకోవడం కూడా రాని వయసు. ఉల్హాస్నగర్ (మహారాష్ట్ర)లోని ధోభీఘాట్‌లో ఉంటారు వాళ్లు. అక్కడికి దగ్గర్లోని కల్యాణ్ ప్రాంతంలో పెళ్లికని ఆదివారం నాడు బిడ్డను ఎత్తుకుని, భర్తతో కలిసి వెళ్లింది. బిడ్డ నడిచేవాడైతే నడిపించేది. ఆర్నెల్లు వాడికి. చంకన వేసుకుని పెళ్లి పందిరి అంతా సందడిగా తిరిగింది. పెళ్లయ్యాక తిరిగి వచ్చేటప్పుడు ఊహించని విధంగా ఆమె హైహీల్స్ బ్యాలెన్స్ తప్పి, చేతిలోని బిడ్డ జారి, నేలపై పడిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. దురదృష్టం! బిడ్డ బతకలేదు. ఫెమిదీ దుఃఖం కట్టలు తెగింది. భర్త ఆమెను ఆపలేకపోయాడు. ఆమె గృహిణి. ఆమె భర్త ఉల్హాస్‌నగర్‌లోని ఒక దుకాణంలో హెల్పర్‌గా చేస్తాడు. ఇద్దరూ ఇప్పుడు బిడ్డలేని అనాథలయ్యారు. ఘజియాబాద్ (యు.పి.) లోని ఇందిరాపురంలో గత ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో తల్లి లేదు. ఇంట్లోనే ఉండే పిన్నమ్మ లేదు. తండ్రి ఇంట్లో ఉండడు. నాలుగేళ్ల చిన్నారి ఒక్కటే ఉంది. బేబీ చెయిర్లో తనను తను లాక్కుంటూ బాల్కనీలోకి వెళ్లింది. చెయిర్లో లేచి నిలబడింది. చెయిర్ చక్రాలు స్లిప్ అయ్యాయి. అంతే! పదో అంతస్థులోని ఆ బాల్కనీలోంచి నేలపై పడిపోయి, చనిపోయింది! ఆ కుటుంబం విలవిల్లాడిపోయింది. పోలీసులను బతిమాలుకుని పోస్ట్‌మార్టం చేయనివ్వకుండా, యమునా ఉపనది హిండన్‌లో ఆ పాప అస్థికలు కలిపారు. వాళ్లు కలిపింది అస్థికల్ని కాదు. పాపపై పెట్టుకున్న తమ పంచ ప్రాణాలను! బిడ్డల్ని ఇంత ప్రాణపదంగా ప్రేమించేవారు.. తమ వల్ల వారికి జరగబోయే ప్రమాదాన్ని ముందే ఎందుకు ఆలోచించలేరు అనిపిస్తుంది! ప్రేమ.. ప్రమాదాన్ని శంకించనివ్వదా?! హైహీల్స్ స్లిప్ అవుతాయేమోనని ఫెమిదీ ముందే శంకించి ఉంటే, ఇంట్లో ఎవరూ లేకుండాపోతే పాప ఎలా అని ఇందిరాపురంలోని ఆ కుటుంబం ముందే శంకించి ఉంటే ఇంత విషాదం మిగిలి ఉండేదా! లోకానికి నాలుగు దిక్కులు ఉన్నట్లే, పిల్లలకు నలువైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆ నాలుగు దిక్కులలోనూ పిల్లలకు కాపలాగా నిలబడవలసింది తల్లిదండ్రులే. కంటిపాపలా చూసుకుంటే సరిపోతుందనుకుంటాం. కంటి రెప్పల్నుంచి కూడా కాపలా కాయాలేమోనన్న ఆలోచన రాకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏదో ఒక అజాగ్రత్త వల్ల నెత్తి మీద పిడుగు పడుతుంది. పిడుగులు ఆకాశం నుంచే పడతాయనేం లేదు. మన అలక్ష్యం నుంచీ పడతాయి. – మాధవ్ శింగరాజు -
ఆ ఈవీఎంలను ఎవరికీ అమ్మొద్దు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అమ్మకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లకు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. తమ కోసం రూపొందించిన ఈవీఎంలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు (ఎస్ఈసీ) కానీ, విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు కానీ తమ అనుమతి లేకుండా అమ్మకూడదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు సంస్థలకు 2017, మే 27న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ‘మా సాంకేతిక నిపుణుల కమిటీ ఆమోదించిన ఈవీఎంలను మా అనుమతి లేకుండా వేరే ఎవరికీ అమ్మకూడదం’టూ ఆ సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, విదేశీ సంస్థల కోసం అవసరమైతే వేరే డిజైన్ ఈవీఎంలను రూపొందించాలంది. అయితే, ఈ ఆదేశాలపై గత నవంబర్‌లో జరిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల జాతీయ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఒక సమాచార హక్కు విజ్ఞాపన ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈసీతో చర్చించాలని చివరకు నిర్ణయించారు. ఈసీఐ, ఎస్ఈసీ.. రెండూ కూడా ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థల నుంచే ఈవీఎంలను కొనుగోలు చేస్తాయి. -
దిక్పాలకుల గురించిన విశేష సమాచారం
మనం ఏ నోము నోచుకున్నా, ఏ వ్రతం చేయాలనుకున్నా ముందుగా గణపతికి, తర్వాత నవగ్రహాలకు, ఆ తర్వాత అష్టదిక్పాలకులకూ పూజ చేసిన తర్వాతనే అసలు దైవాన్ని పూజిస్తాం. అయితే దిక్కులు ఎన్ని? అంటే దిక్కులు చూసే రోజులివి. మూలలు ఏమిటి? అంటే మూలమూలలు వెతికే కాలమిది. ఏ మూల ఎటుంటుంది అంటే పెద్దలు కూడా సరిగ్గా చెప్పలేక గుటకలు మింగే పరిస్థితులివి. ఇటువంటి గడ్డు కాలంలో ‘అష్టదిక్పాలక వైభవం’ అంటూ మనస్విని– ఆత్రేయ పురస్కార గ్రహీత వక్కంతం సూర్యనారాయణరావ్ ఏకంగా ఒక గ్రంథాన్నే రచించారు. ఒక వారపత్రికలో ధారావాహికగా వెలువడ్డ ‘అష్టదిక్పాలకవైభవం’ ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిన రచన. ఇంద్రుడు తూర్పుదిక్కుకు అధిపతి. యముడు దక్షిణ దిక్కుకు, ఉత్తరదిక్కుకు కుబేరుడు అధిపతి. పడమరకు వరుణుడు అధినేత. అలాగే నాలుగు మూలలకూ నలుగురు అధిపతులున్నారు. వారెవరు? వారి తల్లిదండ్రులెవరు? సతీసుతులెవరు? ఆయా దిక్కులకు, మూలలకు వారు ఏవిధంగా అధిపతులయ్యారు? వారిని పూజిస్తే కలిగే ఫలితాలేమిటి? పూజించకపోతే తలెత్తే ఇబ్బందులేమిటి.. వంటి అంశాలన్నింటినీ ఎంతో సాకల్యంగా... సోదాహరణంగా వివరించిన ఈ పొత్తం ప్రతి ఇంటా ఉండవలసినది. గతంలో నవగ్రహ పురాణమనే అద్భుత గ్రంథాన్ని అందించిన వక్కంతం వారు ఇప్పుడు ఈ పుస్తకాన్ని కూడా అంతే అలవోకగా రచించారు. అక్కడక్కడా అక్షరదోషాలను మినహాయిస్తే తప్పక చదవ వలసిన పుస్తకం. ఖరీదు కాస్త ఎక్కువే అనిపించినప్పటికీ, చదివిన తర్వాత మాత్రం, ‘మరేం ఫర్వాలేదు, ఇంత మంచి పుస్తకానికి ఆ మాత్రం ఫర్వాలే’దనిపిస్తుంది. అష్టదిక్పాలక వైభవం రచన: వక్కంతం సూర్యనారాయణరావ్ పుటలు: 450; వెల రూ. 395 ప్రతులకు: ప్రిజం బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్; 1–1–728/ఎ, స్ట్రీట్ నంబర్ 10, గాంధీనగర్, హైదరాబాద్– 80. ఫోన్: 04027612928 -
'బాత్రూంలోకి వారిని కూడా అనుమతించండి'
వాషింగ్టన్: ఇక నుంచి లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్స్) చేసుకున్నవారిపట్ల వివక్ష చూపడానికి వీల్లేదంటే అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఇలాంటివి జరగొద్దని నొక్కి చెప్పింది. లింగమార్పిడి చేసుకున్నవారికి ఆయా పాఠశాలల్లో, కాలేజీల్లోని బాత్రూంలలోకి అనుమతించడం లేదని, ఈ సమస్య ఉత్తర కరోలినాలో అధికంగా ఉందని, దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆదేశించింది. త్వరలోనే అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రత్యేక మార్గదర్శకాలు పంపించనుంది. అయితే, ఏ చట్టం ప్రకారం ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారనే విషయం స్పష్టం చేయకుండా కేవలం విద్యాశాఖ అధికారుల సంతకాలతో ఈ లేఖలను ఆయా విద్యాసంస్థలకు పంపిచనున్నారు. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకు బాత్రూంలలోకి అనుమతి లేకుండా నార్త్ కరోలినా ఒక చట్టాన్ని చేసింది. అయితే, ఈ చట్టం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేలా ఉందని, దీనిని మార్చాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా నార్త్ కరోలినాకు ఫెడరల్ గవర్న మెంట్ కు మధ్య తీవ్ర వైరుధ్యాలు కూడా వచ్చాయి. దీంతో అమెరికా విద్య, న్యాయశాఖలు ఈ అంశంలో జోక్యం చేసుకుని తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. లింగమార్పిడి చేసుకున్నవారికి వారి వారి గుర్తింపు ప్రకారం బాత్ రూంలలోకి అనుమతించాలంటూ అందులో పేర్కొననుంది. -
ఇక ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆ తర్వాత ఇతర కనెక్షన్లుకు విస్తరించే యోచన మార్చి 31లోగా బిగించాలని ఆదేశాలు జారీ ఇంట్లో కరెంటు పోయిందా.. రీచార్జ్ చేసుకోలేదేమో.. కరెంటుకు రీచార్జేంటి అనుకుంటున్నారా.. త్వరలో ఈ విధానం నగరంలో అమలుకాబోతోంది. మొబైల్ రీచార్జ్ చేసుకున్నట్లు కరెంటుకు కూడా రీచార్జ్ చేసుకోవాలి భవిష్యత్తులో.. సిటీబ్యూరో: విద్యుత్ దుబారాను అరికట్టడంతో పాటు ప్రతి యూనిట్‌ను పక్కగా లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న మెకానికల్ విద్యుత్ మీటర్ల స్థానంలో ఇకపై ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు వీటిని బిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీఓ కూడా జారీ చేసింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. వీధిలైట్లకు మినహా అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఈ మీటర్లను బిగించాలని సూచించింది. ఇందుకోసం ఇప్పటికే ఐదు వేల మీటర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ తరహా మీ టర్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు అమర్చడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, గృహాల్లో చోటు చేసుకుంటున్న విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా సంస్థకు వస్తున్న నష్టాలను కూడా నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. నగరంలో చాలామంది తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. చాలా మంది విద్యుత్ వినియోగంపై ఆంక్ష లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటు యజమానులకు, అటు అద్దెవాసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చడం వల్ల విద్యుత్ వృథాను అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ‘గ్రేటర్’ పరిధిలోనే సుమారు 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రెండు వేలకుపైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు అరకోటికిపైగా విద్యుత్ బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం తమకు నిర్వహణ ఖర్చులు ఇవ్వడం లేదనే సాకుతో చాలా మంది అధికారులు తమ ఆఫీసుకు సంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా డిస్కం రూ.కోట్లు నష ్టపోవాల్సి వస్తుంది. ఇలా పనిచేస్తాయి... ప్రస్తుతం ఉన్న పాత మెకానికల్ మీటర్లను తొలగించి, దాని స్థానంలో ప్రీపెయిడ్ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌ను (సెల్‌ఫోన్ రీచార్జ్ తరహా) అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. విని యోగదారుడు ప్రతినెలా తన చేతిలోని సెల్ ఫోన్ రీచార్జీ చేసుకున్నట్లుగానే ఇకపై ఇంట్లోని విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్ లైట్లు వెలుగుతాయి. లేదంటే కార్డును రీచార్జీ చేసుకునే వరకు చీకట్లు తప్పవు. ఇందు కోసం ఆయా కార్యాలయాలు, సంస్థలు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే పూర్తి ఖర్చును డిస్కమే భరిస్తుంది. మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ఆ తర్వాత గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ తరహా సేవలను వ ర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. -
వంశీ కధని డైరెక్ట్ చేస్తోన్న పూరీ
-
తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలను ఏర్పాటు చేయండి
గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా జెన్కో, ట్రాన్స్‌కో సంస్థలను ఏర్పాటుచేయాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గవర్నర్ సలహాదారు నుంచి జెన్కో, ట్రాన్స్‌కో యాజమాన్యాలకు లేఖలు అందినట్టు తెలిసింది. ఇందుకనుగుణంగా కొత్త సంస్థల ఏర్పాటుకు ఆయా యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. వాస్తవానికి కొత్త వాటిని ఏర్పాటుచేయాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కంపెనీ లక్ష్యాలు, ఉద్దేశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే వాటిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా కంపెనీలు ఏర్పాటుచేసుకోవాలని మొదట్లో భావించారు. అయితే, ప్రస్తుతం రాష్ర్టపతి పాలన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపితే కేబినెట్ ఆమోదం తెలిపినట్టేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. దీంతో తాజాగా తెలంగాణకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ గవర్నర్ కార్యాలయం అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలకు లేఖలు రాసినట్టు తెలిసింది.