చికిత్స పొందుతున్న తేజ్
Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయిధరమ్‌తేజ్ శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తను మాట్లాడే క్రమంలో తీవ్రంగా ఇబ్బందిపడినట్లు సమాచారం. కేవలం ఒక నిమిషమే మాట్లాడినప్పటికీ ఆ సమయంలో చాలా నొప్పిగా ఉందని తేజ్ వైద్యులకు చెప్పారట. దీంతో తను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తేజ్ దగ్గరకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదు అపోలో వైద్యులు.
కాలర్ బోన్ ఫ్రాక్చర్.. తొందరగానే నయమవుతుంది
సాయిధరమ్‌తేజ్‌కు మొట్టమొదటిగా వైద్యం చేసిన డాక్టర్ సతీష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. సాయి తేజ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు స్పృహలో లేరని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఫిట్స్ వచ్చాయని, అందుకే చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఎక్కువగా రక్తస్రావం కాకపోవడం వల్ల ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టే స్థితిలోనే ఉన్నారన్నారు. ఆయనకు కంటి మీద గాయం కాలేదని, అది చిన్న స్క్రాచ్ మాత్రమేనని చెప్పారు. చేతితో పాటు, ఛాతీ, కాళ్ల మీద చిన్నచిన్న గాయాలయ్యాయని పేర్కొన్నారు. అలాగే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, అయితే ఇది పెద్ద సమస్యేమీ కాదని, తొందరగానే నయమవుతందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment