వీడియో కాల్ విధానాన్ని పరిశీలిస్తున్న జైళ్ల శాఖ డీఐజీ సెందామరై కన్నన్
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 12 వేల మందికి పైగా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. జైళ్లశాఖ డీజీపీగా అమరేష్ పూజారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జైళ్లశాఖలో పలు మార్పులను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశఆల్లో మంత్రి రఘుపతి జైలులో ఉన్న ఖైదీలు వారి బంధువులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.
అందులో భాగంగా శుక్రవారం చైన్నెలోని పుళల్ జైలులో ఖైదీలు వీడయో కాల్ ద్వారా బంధువులతో మాట్లాడే అవకాశాన్ని డీజీపీ ప్రారంభించారు. కరోనా కాలంలో ఖైదీలపై ఒత్తిడిని తగ్గించేందుకు వేలూరు పురుషుల జైలులో ఇది వరకే వీడియో కాల్ వసతిని ఏర్పాటు చేశారు. తాజాగా వేలూరు మహిళా జైలులో ఖైదీలు బంధువులతో వీడియో కాల్‌తో మాట్లాడే వసతిని జైళ్లశాఖ డీఐజీ సెందామరై కన్నన్ శనివారం ఉదయం ప్రారంభించి పరిశీలించారు. మహిళా ఖైదీలు వారి బంధువుల వద్ద వారంలో మూడు రోజులకు ఒక సారి 12 నిమషాలు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment