
బిహార్:వీడియో కాల్‌లో చూస్తూ నర్స్ ఆపరేషన్ చేయడం వల్ల ఓ గర్భిణీ మృతి చెందింది. ఈ దారుణ ఘటన బిహార్‌లోని పూర్నియా ప్రాంతంలో జరిగింది.
మాల్తీ దేవీ(22)కు నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న సమర్పన్ మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ లేకపోయిన గర్భిణీని ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నారు సిబ్బంది. మాల్తీకి నొప్పులు ఎక్కువవగానే ఐసీయూలోకి తీసుకెళ్లారు. వీడియో కాల్ ద్వారా డాక్టర్ సీతాకుమారి సలహాలు ఇస్తుండగా..గర్భిణీకి నర్స్ ఆపరేషన్ చేసింది.
పుట్టిన కవలలు క్షేమంగానే ఉన్నప్పటికీ ఆపరేషన్ ఆనంతరం బాధితురాలికి విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. అనంతరం మాల్తీ మృతి చెందింది.దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి
Comments
Please login to add a commentAdd a comment