
నిందితురాలు అభిరామి, ప్రియుడు సుందరం
తిరువొత్తియూరు: పాలలో విషం కలిపి తాగించి ఇద్దరు పిల్లలను హత్య చేసిన అభిరామి కేసు విచారణలో పలు విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితురాలు అభిరామి సెల్‌ఫోన్‌కు బానిసై సైకోగా మారినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. చెన్నై కున్రత్తూరుకు చెందిన బ్యాంకు ఉద్యోగి విజయన్.
అతని భార్య అభిరామి (25). ఈమె తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలులో ఉంచారు. అభిరామి ప్రియుడు సుందరంను పోలీసులు అరెస్టు చేసి ఉన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ జరుపుతున్నారు. విచారణలో సెల్‌ఫోన్‌కు బానిస అయిన అభిరామి తన ప్రియుడితో తరచూ గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేవారని ఆ సమయంలో అడ్డువచ్చిన పిల్లలను చిత్రహింసలకు గురి చేసేదని తెలిసింది. ఈ క్రమంలో సైకోగా మారిన అభిరామి పిల్లలను హత్యచేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment