Abhirami
-
ఇండస్ట్రీలో మార్పు వచ్చింది – అభిరామి
‘దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం ఓ హీరోయిన్‌కు 35 ఏళ్లు దాటాయంటే పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. సీనియర్ హీరోయిన్స్ కోసం రచయితలు, దర్శకులు మంచి ΄ాత్రలు రాస్తున్నారు. ఓటీటీ వంటి ΄్లాట్ఫామ్స్లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి’’ అని నటి అభిరామి అన్నారు. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘భలే ఉన్నాడే!’. దర్శకుడు మారుతి సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక ΄ాత్రలో నటించిన అభిరామి మాట్లాడుతూ–‘‘దర్శకుడు మారుతిగారు ఫోన్ చేసి, ‘భలే ఉన్నాడే’ గురించి చె΄్పారు. కథ నచ్చడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమాలో గౌరి అనే బ్యాంకు ఉద్యోగినిగా నటించాను. మా అమ్మానాన్నలు కూడా బ్యాంకు ఉద్యోగులే కావడంతో గౌరి ΄ాత్ర నాకు వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యింది. శివసాయి మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. రాజ్‌తరుణ్ మంచి నటుడు.. బాగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగులో ‘చెప్పవే చిరుగాలి’ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రం ‘భలే ఉన్నాడే’. కానీ ‘సరి΄ోదా శనివారం’ సినిమా ముందుగా విడుదల అయింది. కమల్‌హాసన్–మణిరత్నంగార్ల ‘థగ్‌లైఫ్’లో నటించాను. అలాగే రెండు తమిళ సినిమాలతో ΄ాటు ఓ ఆంథాలజీ చేస్తున్నాను. తెలుగులో రెండు సినిమాల చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలి΄ారు. -
స్నేహం కోసమే ఆ పాత్రలు చేశాను
‘‘మహారాజ’ నా కెరీర్లో 50వ సినిమా. ఈ యాభై చిత్రాల ప్రయాణంలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ఫ్లాప్స్ చూశాను. ఫలితం ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. నేనిప్పటివరకూ చాలా పాత్రలు చేశాను. అయితే ‘మహారాజ’లో నా పాత్ర నా గత సినిమాలకి వైవిధ్యంగా ఉంటుంది. ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా స్పెషల్‌గా ఉంటాయి’’ అని హీరో విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ– ‘‘మహారాజ’ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే నా 50వ సినిమాగా ఈ కథ బాగుంటుందని చేశాను. నితిలన్ ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ‘కాంతార’కు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ మా మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ‘మహారాజ’ని ఎన్వీఆర్ సినిమా వాళ్లు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. నేను క్యారెక్టర్ రోల్స్ తక్కువే చేశాను. అది కూడా ఫ్రెండ్స్ కోసం చేశాను. ‘ఉప్పెన’లో చాలా బలమైన పాత్ర నాది. దర్శకుడు రంజిత్ కోసమే ‘మైఖేల్’లో ఓ క్యారెక్టర్ చేశాను. చిరంజీవిగారిపై ఉన్న ఇష్టంతో ‘సైరా’ చేశాను. అలాగే రజనీకాంత్ సార్, విజయ్, షారుక్ ఖాన్గార్లపై నాకున్న ఇష్టంతో వారి సినిమాల్లో చేశాను. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. తెలుగులో స్ట్రయిట్ సినిమాకి కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళ్లో మూడు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్
యంగ్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టింది. కాకపోతే పరోక్షంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే కుర్రాడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే కావడం ఇక్కడ ఆసక్తికర విషయం. తాజాగా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఏకంగా వీడియో పోస్ట్ చేయడంతో హీరోయిన్ ప్రేమ కహానీపై క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్)చెన్నైకి చెందిన అమ్ము అభిరామి.. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంది. దళపతి 'భైరవ' మూవీతో నటిగా మారింది. కాకపోతే తమిళ సూపర్ హిట్ సినిమా 'రాక్షసుడు'లో స్కూల్ స్టూడెంట్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ నారప్ప, ఎఫ్‌సీయూకే, రణస్థలి, డెవిల్ చిత్రాల్లో నటించింది. ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు సహాయ పాత్రల్లోనూ నటిస్తోంది.అభిరామి ప్రేమ విషయానికొస్తే.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ 'కుక్ విత్ కోమలి' అనే వంటల ప్రోగ్రామ్‌లోనూ చేసింది. ఈ షోకి పనిచేస్తున్న డైరెక్టర్ పార్థివ్ మణితో అలా ప్రేమలో పడింది. గతంలో ఓసారి ప్రేమ విషయాన్ని చూచాయిగా బయటపెట్టింది. కానీ ఇప్పుడు అతడి పుట్టినరోజున వీడియో పోస్ట్ చేసి.. 'నా జీవితంలో వచ్చినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తే త్వరలో వీళ్ల పెళ్లి వార్త చెబుతారేమో!(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) -
Actress Abhirami Photos: ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? పిల్లలు లేకపోవడంతో.. (ఫోటోలు)
-
ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. 10వ తరగతిలోనే ఆ పొరపాటు చేయడంతో..
కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటి అమ్ము అభిరామి. ఈమె తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. భైరవ, ఎన్ ఆవిడ చెరుప్పు కానోమ్, ధీరన్ అధికారం ఒండ్రు వంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన అమ్ము అభిరామి రాక్షసన్ చిత్రంలో పాఠశాల విద్యార్థినిగా నటించి గుర్తింపు పొందారు. ఇదే సినిమా తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు పేరుతో హిట్ కొట్టారు. ఆ తరువాత ధనుష్ కథానాయకుడిగా నటించిన అసురన్ చిత్రంలో ఆయన మరదలుగా నటించారు. తెలుగులో వెంకటేశ్ నారప్ప చిత్రంలో కన్నమ్మ పాత్రలో మెప్పించారు. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్ ప్రేయసిగా అభిరామి మంచి గుర్తింపు పొందింది. అదేవిధంగా కుక్ విత్ కోమాలి టీవీ కార్యక్రమంలో పాల్గొని పాపులర్ అయిన అమ్ము అభిరామి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె తాజాగా నలుగురు కథానాయికల్లో ఒకరిగా నటించిన కన్నగి చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ప్రేమ గురించి పేర్కొంటూ తాను స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పుడే సహ విద్యార్థి ప్రేమలో పడ్డానని, ఆ విషయం ఇంటిలో తెలిసి దొరికి పోయానని చెప్పారు. అది వన్ సైడ్ లవ్వే అయినా దాచుకోలేక ఇంటిలో దొరికిపోయి దెబ్బలు తిన్నానని చెప్పారు. ఆ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ఎలాంటి భర్త రావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు తనను అర్థం చేసుకునే వాడు అయితే చాలు అని బదులిచ్చారు. అది ప్రేమ వివాహం అయినా సరే పెద్దలు నిశ్చయించిన వివాహం అయినా సరే అని అమ్ము అభిరామి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. గోలీ సోడా 1.5 అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) -
20 ఏళ్ల తర్వాత కమల్ హాసన్‌తో నటిస్తున్న హీరోయిన్
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విరుమాండి చిత్రాన్ని సినీ ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. అందులో కమల్ హాసన్‌కు జంటగా నటించిన హీరోయిన్ అభిరామిని మర్చిపోలేరు. ఈ సినిమాతో ఈ జంట అంతగా పాపులర్ అయ్యారు. విరుమాండి చిత్రం 2004లో విడుదలైంది. ఇకపోతే కమల్ హాసన్ నాయగన్ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రం తరువాత మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి థగ్ లైఫ్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ త్రిష, నటుడు జయంరవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. తాజాగా ఇందులో నటి అభిరామి వచ్చి చేరుతున్నారు. దీని గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరుమాండి సినిమాలో ఓ సన్నివేశం ఫోటో తాను కమల్ హాసన్‌కు జంటగా నటించిన విరుమాండి చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిందన్నారు. మళ్లీ ఇప్పుడు థగ్ లైప్ చిత్రంలో ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర గురించి దర్శక నిర్మాతలే ప్రకటిస్తారని అన్నారు. మరో విశేషం ఏమిటంటే విరుమాండి చిత్రం 2004లో పొంగల్ సందర్భంగా విడుదలైందని, ఇప్పుడు థగ్ లైప్ చిత్రం షూటింగ్ 2024 పొంగల్ సందర్భంగా ప్రారంభం కాబోతుందని అభిరామి పేర్కొన్నారు. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, ప్రోమో ఇటీవలే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. చదవండి: ఉన్నదంతా పోయింది.. అప్పులపాలయ్యా.. దివాలా తీశానంటున్న రైతుగా మారిన నటుడు -
పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి
మలయాళ నటి అభిరామి దంపతులు తల్లిదండ్రులయ్యారు. అదేంటి, ప్రెగ్నెన్సీ విషయాన్ని నటి ఇంతకాలంగా దాచిపెట్టిందేంటి? అనుకునేరు. బిడ్డను కనకుండానే ఆమె తల్లయింది. అభిరామి దంపతులు ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఏడాది కాలంగా ఆ పాప వీళ్ల దగ్గరే ఉంటోంది. తాజాగా ఈ విషయాన్ని మదర్స్ డే సందర్భంగా మే 14న సోషల్ మీడియాలో వెల్లడించింది నటి. తమ కూతురికి కల్కి అని నామకరణం చేసినట్లు తెలిపింది. ఒక తల్లిగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ అభిరామి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ మదర్స్ డే అంటూ నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిరామి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అభిరామి ప్రముఖ రచయిత పవనన్ మనవడు రాహుల్ పవనన్ను 2009లో పెళ్లాడింది. ఇంతవరకు వీరికి పిల్లలు లేకపోవడంతోనే ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆమె తెలుగులో చెప్పవే చిరుగాలి, అమర్ అక్బర్ ఆంటోని, చార్మినార్, థాంక్యూ సుబ్బారావు వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక చిత్రాలు చేసింది. ప్రస్తుతం సురేశ్ గోపీ ప్రధాన పాత్రలో నటిస్తున్న గరుడన్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. View this post on Instagram A post shared by Abhirami (@abhiramiact) చదవండి: ది కేరళ స్టోరీ టీమ్‌కు యాక్సిడెంట్.. స్పందించిన హీరోయిన్ -
నటి వీపుపై టాటు.. అసలు ఆమెకేమైంది?
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న తాజాగా చిత్రం లియో. ఈ సినిమాలో హీరోయిన్గా అభిరామి వెంకటాచలం నటిస్తోంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఆమె ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో కతెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆమె వీపుపై నటరాజస్వామి టాటు కనిపించడమే. అయితే ఆమె టాటు ఎందుకు వేయించుకుందన్న దానిపై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. అసలు అభిరామికి ఏమైందని అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీపుపై ఆ టాటూ ఏంటని నిలదీస్తున్నారు. అంకే కాకుండా మహా శివరాత్రి రోజున ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ కూడా చేశారు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆమె వీపుపై నటరాజ స్వామిని టాటూ కనిపించడం పలు చర్చలకు దారితీసింది. ఆ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో అభిరామి షేర్ చేశారు. అదే సమయంలో తనకు భక్తి గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. పైగా తాను ఆరాధించే శివుడిని ఎక్కడ ఉంచాలన్నది.. తన వ్యక్తిగత విషయమంటూ అభిరామి పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Abhirami Venkatachalam 🦋 (@abhirami.venkatachalam) -
‘ఎఫ్‌సీయూకే’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
సైకోగా మారి ప్రియుడితో వీడియో కాల్స్
తిరువొత్తియూరు: పాలలో విషం కలిపి తాగించి ఇద్దరు పిల్లలను హత్య చేసిన అభిరామి కేసు విచారణలో పలు విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితురాలు అభిరామి సెల్‌ఫోన్‌కు బానిసై సైకోగా మారినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. చెన్నై కున్రత్తూరుకు చెందిన బ్యాంకు ఉద్యోగి విజయన్. అతని భార్య అభిరామి (25). ఈమె తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలులో ఉంచారు. అభిరామి ప్రియుడు సుందరంను పోలీసులు అరెస్టు చేసి ఉన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ జరుపుతున్నారు. విచారణలో సెల్‌ఫోన్‌కు బానిస అయిన అభిరామి తన ప్రియుడితో తరచూ గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేవారని ఆ సమయంలో అడ్డువచ్చిన పిల్లలను చిత్రహింసలకు గురి చేసేదని తెలిసింది. ఈ క్రమంలో సైకోగా మారిన అభిరామి పిల్లలను హత్యచేసినట్టు తెలిసింది. -
భర్తను కూడా కడతేర్చాలనుకున్నా!
సాక్షి, చెన్నై, టీ.నగర్: భర్తపై విముఖత, ప్రియుడిపై ఏర్పడిన వ్యామోహంతో భర్తను హత్య చేయాలనుకున్నానని, అయితే వీలుకానందున ఇద్దరి పిల్లల్లకు విషమిచ్చి చంపినట్లు కిరాతకురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. చెన్నై కుండ్రత్తూరు సమీపంలోగల మూండ్రాంకట్టలైకు చెందిన విజయ్ భార్య ప్రియుడిపై మోజుతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి ప్రియుడితో పరారైన విషయం తెలిసిందే. భర్త కార్యాలయంలో పని నిమిత్తం అక్కడే ఉండిపోవడంతో ఈ హత్య నుంచి తప్పించుకున్నాడు. ఇలాఉండగా దీనిపై పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఇందులో పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి అభిరామి తన ప్రియుడు బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడు సుందరం ఇంటికి వెళ్లింది. అక్కడ సుందరం ఆమెను కన్యాకుమారికి వెళ్లమని, తాను అక్కడికి వచ్చి కలుసుకుంటానని తెలిపాడు. తామిద్దరం వివాహం చేసుకుని కాపురం చేద్దామని పేర్కొన్నాడు. దీంతో అభిరామి కోయంబేడు బస్టాండ్ నుంచి బస్సు ఎక్కించిన సుందరం కున్రత్తూరుకు చేరుకున్నాడు. ఇలా ఉండగా పోలీసులు కున్రత్తూరులో తన ఇంట్లో ఉన్న సుందరాన్ని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన వివరాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం కన్యాకుమారికి చేరికుంది. అక్కడ కన్యాకుమారి బస్టాండ్‌లో అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తన భర్త సరిగా ఇంటికి రాడని, అంతేకాకుండా తనను అనుమానించేవాడని తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పేర్కొంది. ఇలా ఉండగా తనకు బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారిందని తెలిపారు. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకునే దాన్నని తెలిపింది. దీంతో భర్త అనుమానించడంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే పాలలో విషం కలిపి పిల్లలు, భర్తకు తాగించి హత్య చేయాలనుకున్నానని, అయితే భర్త తప్పించుకోగా, పిల్లలు మృతి చెందినట్టు తెలిపింది. -
విశ్వరూపం-2తో రీఎంట్రీ
విశ్వరూపం - 2 చిత్రం ద్వారా నటి అభిరామి మళ్లీ సినిమాకు రీ ఎంట్రీ అవుతున్నారు. అందం, అభినయం మెండుగా ఉన్న నటీమణుల్లో అభిరామి ఒకరు. 2001లో వానవిల్ చిత్రం ద్వారా అర్జున్ సరసన హీరోయిన్గా పరిచయమైన నటి అభిరామి. ఆ తరువాత సముద్రం చార్లిచాప్లిన్, విరుమాండి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ అమెరికాలో పనిచేసే రాహుల్ భావనన్ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలాంటిది దశాబ్దం తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో అపోద్కేరి అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తమిళంలోనూ కొన్ని చిత్రాలకు అవకాశాలు వస్తున్నాయన్న అభిరామి, విశ్వరూపం-2 చిత్రంలో హీరోయిన్ పూజాకుమార్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఆహ్వానించారని చెప్పారు. దీని గురించి అభిరామి మాట్లాడుతూ వివాహం తరువాత సినిమాకు దూరం అయ్యానన్నారు. పదేళ్లపాటు అమెరికాలో నివసిస్తున్న తనకు నటుడు కమల్‌హాసన్ తన చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ఆహ్వానించారని తెలిపారు. మలయాళంలోనూ మంచి కథా పాత్ర కావడంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు.