
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విరుమాండి చిత్రాన్ని సినీ ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. అందులో కమల్ హాసన్‌కు జంటగా నటించిన హీరోయిన్ అభిరామిని మర్చిపోలేరు. ఈ సినిమాతో ఈ జంట అంతగా పాపులర్ అయ్యారు. విరుమాండి చిత్రం 2004లో విడుదలైంది. ఇకపోతే కమల్ హాసన్ నాయగన్ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రం తరువాత మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి థగ్ లైఫ్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు.
ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ త్రిష, నటుడు జయంరవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. తాజాగా ఇందులో నటి అభిరామి వచ్చి చేరుతున్నారు. దీని గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విరుమాండి సినిమాలో ఓ సన్నివేశం ఫోటో
తాను కమల్ హాసన్‌కు జంటగా నటించిన విరుమాండి చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిందన్నారు. మళ్లీ ఇప్పుడు థగ్ లైప్ చిత్రంలో ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర గురించి దర్శక నిర్మాతలే ప్రకటిస్తారని అన్నారు. మరో విశేషం ఏమిటంటే విరుమాండి చిత్రం 2004లో పొంగల్ సందర్భంగా విడుదలైందని, ఇప్పుడు థగ్ లైప్ చిత్రం షూటింగ్ 2024 పొంగల్ సందర్భంగా ప్రారంభం కాబోతుందని అభిరామి పేర్కొన్నారు. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, ప్రోమో ఇటీవలే రిలీజై అందరినీ ఆకట్టుకుంది.
చదవండి: ఉన్నదంతా పోయింది.. అప్పులపాలయ్యా.. దివాలా తీశానంటున్న రైతుగా మారిన నటుడు
Comments
Please login to add a commentAdd a comment