
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న తాజాగా చిత్రం లియో. ఈ సినిమాలో హీరోయిన్‌గా అభిరామి వెంకటాచలం నటిస్తోంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఆమె ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో కతెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆమె వీపుపై నటరాజస్వామి టాటు కనిపించడమే. అయితే ఆమె టాటు ఎందుకు వేయించుకుందన్న దానిపై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది.
అసలు అభిరామికి ఏమైందని అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీపుపై ఆ టాటూ ఏంటని నిలదీస్తున్నారు. అంకే కాకుండా మహా శివరాత్రి రోజున ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ కూడా చేశారు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆమె వీపుపై నటరాజ స్వామిని టాటూ కనిపించడం పలు చర్చలకు దారితీసింది. ఆ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో అభిరామి షేర్ చేశారు. అదే సమయంలో తనకు భక్తి గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. పైగా తాను ఆరాధించే శివుడిని ఎక్కడ ఉంచాలన్నది.. తన వ్యక్తిగత విషయమంటూ అభిరామి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment