విశ్వరూపం-2తో రీఎంట్రీ | Actress Abhirami Reentry Into Glamour World | Sakshi
Sakshi News home page

విశ్వరూపం-2తో రీఎంట్రీ

Published Wed, Feb 12 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

విశ్వరూపం-2తో రీఎంట్రీ

విశ్వరూపం-2తో రీఎంట్రీ

విశ్వరూపం - 2 చిత్రం ద్వారా నటి అభిరామి మళ్లీ సినిమాకు రీ ఎంట్రీ అవుతున్నారు. అందం, అభినయం మెండుగా ఉన్న నటీమణుల్లో అభిరామి ఒకరు. 2001లో వానవిల్ చిత్రం ద్వారా అర్జున్ సరసన హీరోయిన్‌గా పరిచయమైన నటి అభిరామి. ఆ తరువాత సముద్రం చార్లిచాప్లిన్, విరుమాండి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ అమెరికాలో పనిచేసే రాహుల్ భావనన్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలాంటిది దశాబ్దం తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో అపోద్‌కేరి అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. 
 
 తమిళంలోనూ కొన్ని చిత్రాలకు అవకాశాలు వస్తున్నాయన్న అభిరామి, విశ్వరూపం-2 చిత్రంలో హీరోయిన్ పూజాకుమార్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఆహ్వానించారని చెప్పారు.  దీని గురించి అభిరామి మాట్లాడుతూ వివాహం తరువాత సినిమాకు దూరం అయ్యానన్నారు. పదేళ్లపాటు అమెరికాలో నివసిస్తున్న తనకు నటుడు కమల్‌హాసన్ తన చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ఆహ్వానించారని తెలిపారు. మలయాళంలోనూ మంచి కథా పాత్ర కావడంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement