డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్ | Ammu Abhirami Love With Director Parthiv Mani | Sakshi
Sakshi News home page

Ammu Abhirami: లవ్ మేటర్ బయటపెట్టిన టాలీవుడ్ నటి

Jun 12 2024 7:46 AM | Updated on Jun 12 2024 9:11 AM

Ammu Abhirami Love With Director Parthiv Mani

యంగ్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టింది. కాకపోతే పరోక్షంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే కుర్రాడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే కావడం ఇక్కడ ఆసక్తికర విషయం. తాజాగా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఏకంగా వీడియో పోస్ట్ చేయడంతో హీరోయిన్ ప్రేమ కహానీపై క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్‌ రిలీజ్)

చెన్నైకి చెందిన అమ్ము అభిరామి.. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంది. దళపతి 'భైరవ' మూవీతో నటిగా మారింది. కాకపోతే తమిళ సూపర్ హిట్ సినిమా 'రాక్షసుడు'లో స్కూల్ స్టూడెంట్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ నారప్ప, ఎఫ్‌సీయూకే, రణస్థలి, డెవిల్ చిత్రాల్లో నటించింది. ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు సహాయ పాత్రల్లోనూ నటిస్తోంది.

అభిరామి ప్రేమ విషయానికొస్తే.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ 'కుక్ విత్ కోమలి' అనే వంటల ప్రోగ్రామ్‌లోనూ చేసింది. ఈ షోకి పనిచేస్తున్న డైరెక్టర్ పార్థివ్ మణితో అలా ప్రేమలో పడింది. గతంలో ఓసారి ప్రేమ విషయాన్ని చూచాయిగా బయటపెట్టింది. కానీ ఇప్పుడు అతడి పుట్టినరోజున వీడియో పోస్ట్ చేసి.. 'నా జీవితంలో వచ్చినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తే త్వరలో వీళ్ల పెళ్లి వార్త చెబుతారేమో!

(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?)

Advertisement
 
Advertisement
Advertisement