ఇండస్ట్రీలో మార్పు వచ్చింది – అభిరామి | Actress Abhirami Speech Highlights At Bhale Unnade Movie Pre Release Event, Deets Inside | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీలో మార్పు వచ్చింది – అభిరామి

Published Thu, Sep 12 2024 4:11 AM | Last Updated on Thu, Sep 12 2024 1:27 PM

Actress Abhirami Speech Bhale Unnade Pre Release Event

‘దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం ఓ హీరోయిన్కు 35 ఏళ్లు దాటాయంటే పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. సీనియర్‌ హీరోయిన్స్ కోసం రచయితలు, దర్శకులు మంచి ΄ాత్రలు రాస్తున్నారు. ఓటీటీ వంటి ΄్లాట్‌ఫామ్స్‌లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి’’ అని నటి అభిరామి అన్నారు. 

రాజ్‌ తరుణ్, మనీషా కంద్కూర్‌ జంటగా జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘భలే ఉన్నాడే!’. దర్శకుడు మారుతి సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఎన్వీ కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక ΄ాత్రలో నటించిన అభిరామి మాట్లాడుతూ–‘‘దర్శకుడు మారుతిగారు ఫోన్ చేసి, ‘భలే ఉన్నాడే’ గురించి చె΄్పారు. కథ నచ్చడంతో ఒప్పుకున్నాను. 

ఈ సినిమాలో గౌరి అనే బ్యాంకు ఉద్యోగినిగా నటించాను. మా అమ్మానాన్నలు కూడా బ్యాంకు ఉద్యోగులే కావడంతో గౌరి ΄ాత్ర నాకు వ్యక్తిగతంగా కనెక్ట్‌ అయ్యింది. శివసాయి మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. రాజ్‌తరుణ్‌ మంచి నటుడు.. బాగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. 

తెలుగులో ‘చెప్పవే చిరుగాలి’ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రం ‘భలే ఉన్నాడే’. కానీ ‘సరి΄ోదా శనివారం’ సినిమా ముందుగా విడుదల అయింది. కమల్‌హాసన్–మణిరత్నంగార్ల ‘థగ్‌లైఫ్‌’లో నటించాను. అలాగే రెండు తమిళ సినిమాలతో ΄ాటు ఓ ఆంథాలజీ చేస్తున్నాను. తెలుగులో రెండు సినిమాల చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలి΄ారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement