రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ 'భలే ఉన్నాడే!'. మారుతి టీమ్ సమర్పణలో జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించగా.. ఎన్‌వీ కిరణ్ కుమార్ నిర్మించారు. సెప్టెంబరు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరగ్గా.. రాజ్ తరుణ్ బోలెడన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
'కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే సినిమా ‘భలే ఉన్నాడే!’. ఇందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. శివసాయితో కలిసి పనిచేసిన తర్వాత దర్శకత్వం విషయంలో నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉందనిపించింది. మారుతిగారితో ఓ సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరింది. నిర్మాత కిరణ్ బాగా సపోర్ట్ చేశారు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 7న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబమంతా కలిసి చూసేలా తీశాం. బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్, చాలా మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా థియేటర్స్‌లో సినిమా చూడండి' అని రాజ్ తరుణ్ అన్నారు.
దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. ''భలే ఉన్నాడే' నా తొలి మూవీ. చాలా బావుటుంది. నాకు అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ ఈ టైటిల్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడు. ఇందులో తను శారీ డ్రాపర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. అమ్మాయికి చీర కట్టాలంటే ఓ కంఫర్టబుల్ లెవల్ ఉండాలి. దాని ప్రకారం ఈ క్యారెక్టర్ లుక్ ని డిజైన్ చేశాం. తను ఎందుకు ఇలా వున్నాడనేది సెప్టెంబర్ 7న తెలుస్తుంది. వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ఈవింగ్, నైట్ షో కి వెళితే హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. చాలా హెల్దీ కామెడీ వుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment