Bhale Unnade Movie
-
భలే ఉన్నాడే నిరుత్సాహపరచదు: మారుతి
‘‘భలే ఉన్నాడే’ సినిమాలో కథ, మాటలు, పాటలు, భావోద్వేగాలన్నీ పక్కాగా కుదిరాయి. మంచి సందేశం కూడా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు సాయి. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు’’ అన్నారు డైరెక్టర్ మారుతి. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా, అభిరామి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘భలే ఉన్నాడే’. జె. శివసాయి వర్ధన్ దర్శకుడు. మారుతీ సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ‘‘ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. ‘‘మా సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు కిరణ్ కుమార్. ‘‘నా 15 ఏళ్ల కల ‘భలే ఉన్నాడే’. ఆ కలని నిజం చేసిన మారుతీగారికి ధన్యవాదాలు. సినిమా చూసి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటికొస్తారు’’ అని జె. శివసాయి వర్ధన్ తెలిపారు. -
రాజ్‌తరుణ్..'భలే ఉన్నాడే' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో మార్పు వచ్చింది – అభిరామి
‘దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం ఓ హీరోయిన్‌కు 35 ఏళ్లు దాటాయంటే పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. సీనియర్ హీరోయిన్స్ కోసం రచయితలు, దర్శకులు మంచి ΄ాత్రలు రాస్తున్నారు. ఓటీటీ వంటి ΄్లాట్ఫామ్స్లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి’’ అని నటి అభిరామి అన్నారు. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘భలే ఉన్నాడే!’. దర్శకుడు మారుతి సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక ΄ాత్రలో నటించిన అభిరామి మాట్లాడుతూ–‘‘దర్శకుడు మారుతిగారు ఫోన్ చేసి, ‘భలే ఉన్నాడే’ గురించి చె΄్పారు. కథ నచ్చడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమాలో గౌరి అనే బ్యాంకు ఉద్యోగినిగా నటించాను. మా అమ్మానాన్నలు కూడా బ్యాంకు ఉద్యోగులే కావడంతో గౌరి ΄ాత్ర నాకు వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యింది. శివసాయి మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. రాజ్‌తరుణ్ మంచి నటుడు.. బాగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగులో ‘చెప్పవే చిరుగాలి’ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రం ‘భలే ఉన్నాడే’. కానీ ‘సరి΄ోదా శనివారం’ సినిమా ముందుగా విడుదల అయింది. కమల్‌హాసన్–మణిరత్నంగార్ల ‘థగ్‌లైఫ్’లో నటించాను. అలాగే రెండు తమిళ సినిమాలతో ΄ాటు ఓ ఆంథాలజీ చేస్తున్నాను. తెలుగులో రెండు సినిమాల చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలి΄ారు. -
భలే ఉన్నాడే మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
'భలే ఉన్నాడే' సినిమా.. ఆ కోరిక ఇప్పుడు తీరింది: రాజ్ తరుణ్
రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ 'భలే ఉన్నాడే!'. మారుతి టీమ్ సమర్పణలో జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించగా.. ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించారు. సెప్టెంబరు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరగ్గా.. రాజ్ తరుణ్ బోలెడన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.'కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే సినిమా ‘భలే ఉన్నాడే!’. ఇందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. శివసాయితో కలిసి పనిచేసిన తర్వాత దర్శకత్వం విషయంలో నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉందనిపించింది. మారుతిగారితో ఓ సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరింది. నిర్మాత కిరణ్ బాగా సపోర్ట్ చేశారు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 7న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబమంతా కలిసి చూసేలా తీశాం. బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్, చాలా మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా థియేటర్స్‌లో సినిమా చూడండి' అని రాజ్ తరుణ్ అన్నారు.దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. ''భలే ఉన్నాడే' నా తొలి మూవీ. చాలా బావుటుంది. నాకు అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ ఈ టైటిల్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడు. ఇందులో తను శారీ డ్రాపర్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. అమ్మాయికి చీర కట్టాలంటే ఓ కంఫర్టబుల్ లెవల్ ఉండాలి. దాని ప్రకారం ఈ క్యారెక్టర్ లుక్ ని డిజైన్ చేశాం. తను ఎందుకు ఇలా వున్నాడనేది సెప్టెంబర్ 7న తెలుస్తుంది. వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ఈవింగ్, నైట్ షో కి వెళితే హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. చాలా హెల్దీ కామెడీ వుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అని చెప్పుకొచ్చారు.