భలే ఉన్నాడే నిరుత్సాహపరచదు: మారుతి | Bhale Unnade Pre Release Event | Sakshi
Sakshi News home page

భలే ఉన్నాడే నిరుత్సాహపరచదు: మారుతి

Published Fri, Sep 13 2024 1:02 AM | Last Updated on Fri, Sep 13 2024 1:02 AM

Bhale Unnade Pre Release Event

‘‘భలే ఉన్నాడే’ సినిమాలో కథ, మాటలు, పాటలు, భావోద్వేగాలన్నీ పక్కాగా కుదిరాయి. మంచి సందేశం కూడా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు సాయి. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు’’ అన్నారు డైరెక్టర్‌ మారుతి. రాజ్‌ తరుణ్, మనీషా కంద్కూర్‌ జంటగా, అభిరామి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘భలే ఉన్నాడే’. జె. శివసాయి వర్ధన్‌ దర్శకుడు. మారుతీ సమర్పణలో ఎన్వీ కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. 

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘‘ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అని రాజ్‌ తరుణ్‌ పేర్కొన్నారు. ‘‘మా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు కిరణ్‌ కుమార్‌. ‘‘నా 15 ఏళ్ల కల ‘భలే ఉన్నాడే’. ఆ కలని నిజం చేసిన మారుతీగారికి ధన్యవాదాలు. సినిమా చూసి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటికొస్తారు’’ అని జె. శివసాయి వర్ధన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement