pshyco
-
సైకో హల్చల్: అర్థరాత్రి ఇళ్లలోకి ప్రవేశించి వికృతచేష్టలు
సాక్షి, విజయవాడ : పటమట పరిధిలో సైకో కలకలం సృష్టిస్తున్నాడు. నల్లప్యాంట్, నల్ల షర్ట్, మొహానికి మంకీ క్యాప్‌తో తిరుగుతున్న ఆ సైకో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి ప్రవేశించి వికృతచేష్టలకు దిగుతున్నాడు. సైకో వ్యవహారంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిలా లేదా దొంగలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
సైకో యువకుడు: మనిషి పుర్రెను..
-
సైకో యువకుడు: మనిషి పుర్రెను..
సాక్షి, విశాఖపట్నం : విశాఖ రెల్లివీధిలో మనిషి పుర్రె కలకలం సృష్టించింది. ఓ పాడుబడిన ఇంటి వద్ద కాల్చిన మనిషి పుర్రె వెలుగు చూడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం రెల్లి వీధిలో ఓ పాడుబడిన ఇల్లు ఉంది. ఆ ఇంటికి దగ్గరలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. పాడుబడ్డ ఇంటి వద్ద ఆదివారం వారికి అనుమానాస్పదంగా ఓ సంచి కనిపించింది. కర్ర సహాయంతో దాంట్లో ఏం ఉందో చూసే ప్రయత్నం చేయగా.. అందులో నుంచి కాల్చి ఉన్న ఓ మనిషి పుర్రె బయటపడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు కేకలు వేయగా స్థానికులు గుమిగూడారు. ( లోపల మహిళ శవం.. పైన కూరగాయలు) కాగా, పాడుబడిన ఇంట్లో రావెలపూడి రాజు(20) అనే యువకుడు ఉంటున్నాడని, ప్రతి రోజు రాత్రి అక్కడికి వస్తూ ఏం చేస్తున్నాడో తెలియడం లేదని స్థానికులు భయపడుతున్నారు. సదరు యువకుడు చెడు వ్యసనాలకు బానిసై సైకోగా మారి మనిషి పుర్రెను కాల్చుకుని తింటూ ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సదరు యువకుడు అక్కడికి రాగా.. కాలనీవాసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు పారిపోయాడు. ఆ అనంతరం స్థానికుల కేకలు విని పాడుబడిన ఇంట్లో నుంచి ఓ యువతి బయటకు వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే యువకుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. -
నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో
లక్నో : వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్ సొంత అన్నను హత్య చేయటానికి ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. విచారణలో హత్యలు చేయటానికి గల కారణాన్ని బయటపెట్టి పోలీసులను షాక్‌కు గురిచేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్, ఈటా జిల్లా ధర్మపుర్ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల కుర్రాడు గత ఫిబ్రవరిలో అనుమానాస్పదంగా మరణించాడు. జూన్ 9వ తేదీన అతడి సోదరుడు ప్రశాంత్ కూడా అదే రీతిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో కొంతమంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జూన్ 11వ తేదీన సత్యేంద్ర, ప్రశాంత్‌ల చిన్నాన్న రాథే శ్యామ్.. సొంత అన్న విశ్వనాథ్ సింగ్ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించాడు. అయితే ముందుగానే గుర్తించిన బంధువులు శ్యామ్‌ను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ( ప్రేమ,పెళ్లి పేరుతో మహిళను వంచించి.. ) ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో అతడు కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. తనకు మనుషుల్ని చంపటం ఇష్టమని పోలీసులకు తెలిపాడు. సత్యేంద్ర, ప్రశాంత్‌లను తానే చంపానని ఒప్పుకున్నాడు. ఇంకా మరో ముగ్గుర్ని చంపటానికి పథకం వేసుకున్నట్లు తెలిపాడు. కాగా, చిన్నారుల హత్య కేసులో జైలు పాలైన వారిని విడుదల చేసేందుకు పోలీసులు సన్నహాలు చేస్తున్నారు. -
సైకో కిల్లర్.. మహిళలే టార్గెట్
మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు.. కలహాల కాపురంతో కక్ష పెంచుకుంటాడు.. మితిమీరిన ఆవేశంతో ఏకంగా ప్రాణాలే తీస్తాడు.. అలా మూడు రాష్ట్రాల్లో ముగ్గుర్ని హతమార్చాడు.. ఆఖరికి శ్రీకాకుళం జిల్లా పోలీసులకు చిక్కాడు.. ఎడాపెడా వివాహేతర సంబంధాలు, చివరకు వారినే చంపడాలు చూస్తుంటే సైకో కిల్లర్‌ను తలపిస్తున్నాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి శనివారం అతని వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం : నిందితుడు సవర రమేష్‌ది ఒడిశా రాష్ట్రం జగపతి జిల్లా వలకభద్ర పంచాయతీ. భార్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అతని కళ్లు అందరి ఆడవాళ్లపై పడ్డాయి. 2016లో దాసేటి దమయంతి అనే మహిళకు దగ్గర కావాలని ప్రయత్నించాడు. నిరాకరించడంతో ఆమెను అంతమొందించాడు. తెలంగాణ పారిపోయి 2017లో ముచ్చిక కోసమ్మ అనే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఏ వివాదం వచ్చిందో గానీ ఆమెను కూడా హత్య చేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పుట్టపురం గ్రామం వచ్చి తలదాచుకున్నాడు. అక్కడ దండు జయంతి అనే మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. చివరకు ఆమెనూ 2019 డిసెంబర్లో హతమార్చాడు. ( అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య ) ఆమెతో సఖ్యంగా ఉన్నప్పుడు కొంత నగదు ఇచ్చాడని, తర్వాత తిరిగి ఇవ్వాలని గొడవ పడ్డాడని, ఈ విషయంలో తగాదా వచ్చి జయంతిని హత్యచేసి, సమీపంలో ఉన్న కాల్వలో పడేసి పరారయ్యాడనీ ఎస్పీ తెలిపారు. ఆ సమయంలో మృతురాలి సెల్‌ఫోన్ తీసుకువెళ్లాడు. నాలుగు నెలల తర్వాత ఫోన్ స్విచాన్ చేయడంతో సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ తెలుసుకున్న జిల్లా పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు. నేర పరిశోధనలో ప్రతిభ కనబరిచిన పాతపట్నం సీఐ ఆర్.రవిప్రసాద్, సారవకోట ఎస్సై వై.రవికుమార్, హెచ్‌సీ జె.సింహాచలం, పీసీలు శ్రీను, రవికుమార్లకు ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
సైకోగా మారి ప్రియుడితో వీడియో కాల్స్
తిరువొత్తియూరు: పాలలో విషం కలిపి తాగించి ఇద్దరు పిల్లలను హత్య చేసిన అభిరామి కేసు విచారణలో పలు విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితురాలు అభిరామి సెల్‌ఫోన్‌కు బానిసై సైకోగా మారినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. చెన్నై కున్రత్తూరుకు చెందిన బ్యాంకు ఉద్యోగి విజయన్. అతని భార్య అభిరామి (25). ఈమె తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలులో ఉంచారు. అభిరామి ప్రియుడు సుందరంను పోలీసులు అరెస్టు చేసి ఉన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ జరుపుతున్నారు. విచారణలో సెల్‌ఫోన్‌కు బానిస అయిన అభిరామి తన ప్రియుడితో తరచూ గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేవారని ఆ సమయంలో అడ్డువచ్చిన పిల్లలను చిత్రహింసలకు గురి చేసేదని తెలిసింది. ఈ క్రమంలో సైకోగా మారిన అభిరామి పిల్లలను హత్యచేసినట్టు తెలిసింది. -
అనంతలో ఉన్మాది ఘాతుకం
అనంతపురం సెంట్రల్: అనంతలో ఉన్మాది రెచ్చిపోయాడు. తొలుత తనకు దగ్గరగా ఉన్న మహిళ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో దూరంగా ఉన్నందుకు ఆమె గొంతుకోసి... తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నగర శివారులోని ఆదర్శనగర్‌లో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు... ఆదర్శనగర్‌లో నివాసముంటున్న రామాంజనేయులు, యాస్మిన్(21) దంపతులకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్ల క్రితం రామాంజనేయులుకు వరుసకు తమ్ముడయ్యే శ్రీనివాసులు(అశోక్‌నగర్) అనే వ్యక్తితో యాస్మిన్ చనువుగా ఉండేది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో వారు కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. అయితే శ్రీనివాసులు కొంతకాలంగా గతం గుర్తు చేస్తూ యాస్మిన్‌ను వేధించడం మొదలెట్టాడు. ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోకపోగా ఉన్మాదిగా తయారయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం బాధితురాలి ఇంటి వద్దకు ఆటోలో వెళ్లి మాట్లాడే పనుందని నమ్మబలికాడు. ఆమెను రూరల్ మండలం కాట్నేకాలువ చెరువుగట్టుపైకి తీసుకెళ్లాడు. తిరిగి తనకు దగ్గర కావాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిపోయి వెంట తెచ్చుకున్న సూపర్‌వాస్మోల్ తాగాడు. ఆపై తన మణికట్టు వద్ద బ్లేడుతో కోసుకున్నాడు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. బంధువులు హుటాహుటిన వచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీనివాసులును వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. బాధితురాలు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితునిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ కృష్ణమోహన్ తెలిపారు. -
సైబర్ సైకో ..
సత్తుపల్లి : కొద్దిపాటి పరిచయమున్న మహిళను ఫేస్బుక్, వాట్సాప్‌లో వేధిస్తున్న వ్యక్తి(సైబర్ సైకో)ని సత్తుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. విలేకరుల సమావేశంలో సత్తుపల్లి సీఐ ఎం.వెంకటనర్సయ్య తెలిపిన వివరాలు.. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ యువతి, అస్ట్రేలియాలో నివసిస్తోంది. ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేటప్పుడు కూకట్పల్లి చాంద్రాయనగర్కు చెందిన గుడ్డేటి రాఘవేందర్‌తో కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉంది. అతడు కొంతకాలంగా ఆమెకు ఫేస్బుక్, వాట్సాప్‌లో అసభ్య పోస్టింగ్‌లు పెడుతున్నాడు. ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపింది. ఆయన ఈ నెల 7న సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న నిందితుడు రాఘవేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, శనివారం కోర్టుకు అప్పగించారు. -
దూడను భక్షించిన ఉన్మాది
ఇందుకూరుపేట: గుర్తుతెలియని ఓ ఉన్మాది గేదె దూడను భక్షించి పరారవ్వగా, గ్రామస్తులు గాలించి పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన మండలంలోని మైపాడు పడమటపాళెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఓ గేదె దూడను ఉన్మాది మంగళవారం రాత్రి అపహరించి సమీపాన ఉన్న పొలంలోకి తీసుకెళ్లారు. దూడను కత్తితో కోసి కొంత మాంసాన్ని తొలగించాడు. గమనించిన స్థానికులు ఉన్మాది అని తెలుసుకొని వెంబడించారు. దీంతో సముద్రం వెంబడి పరిగెత్తుతూ పారిపోయాడు. ఇటీవలి కాలంలో చోరీలు సైతం జరగుతుండటంతో దొంగా లేదా ఉన్మాదాననే విషయం గ్రామస్తులకు తెలియలేదు. దీంతో పక్కనే ఉన్న రాముడుపాళెం గ్రామస్తులకు తెలియజేసి ఆరా తీశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి తీరంలో కనిపించాడని తెలియజేయడంతో మైపాడు వాసులు బుధవారం రాముడుపాళేనికి వెళ్లి గాలించారు. తీరం వద్ద మనుషులు పెద్దగా సంచరించని స్థలంలో ఉన్నాది పడుకొని ఉండటాన్ని వేటకు వెళ్లిన గిరిజనులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో ఉన్నాదిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
తల్లిదండ్రులు కాదు.. సైకోలు
కాలిఫోర్నియా : ప్రేమగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు క్రూరత్వానికి ప్రతిరూపంగా మారారు. తమ పది మంది పిల్లలను తీవ్రంగా హింసించారు. ప్రతి రోజూ వారికి పత్యక్ష నరకాన్ని చూపించారు. ఎట్టకేలకు వారి పాపం పండింది. పొరుగుంటి వారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పది మంది పిల్లలకు అక్కడి నుంచి విముక్తి కలిగించారు. ఆ తల్లిదండ్రులిద్దర్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జొనాధన్ అల్లెన్, ఇనా రోజర్స్ భార్యాభర్తలు వీరికి పదిమంది పిల్లలు. ఏమైందో తెలియదు గత కొద్ది నెలలుగా వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పిల్లలను ఏ తప్పు చేయకపోయినా కొట్టడం, కాల్చడం, గాయపర్చడం చేసేవారు. ఒక రోజు రాత్రి పెద్ద కుమారున్ని తీవ్రంగా కొట్టడంతో అతడు ఇంటి నుంచి పారిపోయి పక్కింటి గార్డెన్లో నిద్రపోయాడు. అదే సమయంలో అటుగా రౌండ్సుకు వెళుతున్న పోలీసులు అతన్ని గమనించి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఇంటి పరిస్థితి, అల్లెన్, రోజర్స్ మాటలపై అనుమానం రావడంతో ఇంటి లోపల సోదాలు నిర్వహించారు. ఇంటి లోపలికి వెళ్లిన వాళ్లకు ఆ పిల్లాడి తల్లిదండ్రులు సైకోలని అర్థమయ్యింది. ఇల్లు బయటకు మాత్రం అందంగా కనిపించినా లోపల మొత్తం చెత్త చెదారంతో, మనుషుల, జంతువుల మల మూత్రాలతో నిండి పోయింది. బాత్ రూమ్ గోడల నిండా పక్షుల వ్యర్థాలతో నిండి ఉండటం పోలీసులు గమనించారు. పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు చేస్తున్న అకృత్యాలను పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు పిల్లలను అక్కడి నుంచి సంరక్షణా కేంద్రానికి తరలించి ఆ దంపతులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. -
ప్రేమించలేదని యువతిపై దాడి
కాకినాడ రూరల్/ భానుగుడి: ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మోది చేసిన దాడి జిల్లా కేంద్రం కాకినాడలో కలకలం రేపింది. అడ్డు వచ్చిన మరో ముగ్గురిపై కూడా తన ఉన్మాదాన్ని చూపించి కత్తితో గాయపరిచాడు. ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి ఘనట చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగించింది. కాకినాడ రాజీవ్ గృహకల్పకు చెందిన ఆకూరి ప్రసాద్ అనే యువకుడు కొంత కాలంగా పొక్లైన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు సాంబమూర్తినగర్ ఐదో వీధికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని రోజూ బెదిరింపులకు దిగేవాడు. ఎప్పటికప్పుడు ఆ యువతి ప్రసాద్ ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా సాంబమూర్తినగర్లోని కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల సందర్భంగా దీపాలు వెలిగించేందుకు ఆ యువతి వచ్చింది. దీపాలు వెలిగిస్తున్న సమయంలో ఆ యువతి వద్దకు ప్రసాద్ వచ్చి నన్ను ప్రేమించాలని, నిర్ణయం ఇప్పుడే చెప్పాలంటూ పట్టుబట్టాడు. ఆమె అందుకు తిరస్కరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్ ఆ యువతిని చున్నీతో రోడ్డుపైకి లాక్కుంటూ వెళ్లి కత్తితో దాడి చేశాడు. సమీపంలోనే టీ తాగుతున్న కుడిపూడి సత్యనారాయణ, పితాని శ్రీను, మేడిశెట్టి సదాసాంబశివలు ఈ సంఘటన చూసి అతడ్ని అడ్డుకున్నారు. ఆమెను విడిపించేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రసాద్ బ్లేడులాంటి వస్తువుతో వారిపై దాడి చేశాడు. యువతికి చిన్నపాటి గాయం కాగా, ముగ్గురికి గుండెలపైన తుంటిపైన గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గుర్ని కాకినాడ జీజీహెచ్‌కు 108 వాహనంలో తరలించారు. దాడికి పాల్పడిన ప్రేమోన్మోది ఆకూరి ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా మద్యం తాగి ఉండటంతో అతడ్ని పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. త్రీ టౌన్ సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్సై పి.కిశోర్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్ర్కూడ్రైవర్‌తో సైకో వీరంగం
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యపేటలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నాగరాజు మతిస్థిమితం లేకపోవడంతో అతని భార్య విడాకులు తీసుకుని వెళ్లి పోయింది. దీంతో ఉన్మాదిగా మారిన నాగరాజు శనివారం ఉదయం స్ర్కూడ్రైవర్ తీసుకుని స్థానిక చర్చిలోకి చొరబడ్డాడు. అక్కడున్న వారిని స్ర్కూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేస్తుండటంతో అంతా కలిసి అతడిని తాడుతో కట్టి, పోలీసులకు సమాచారం అందించారు. వారు నాగరాజును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
కోరుకొండలో సైకో వీరంగం
-
సైకో దాడుల్లో ముగ్గురి మృతి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో సొంత వదినతో సహా దారిన పోయే వాళ్లపై దాడి చేశాడు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న ఏడిద ఆనంద్(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంటి ఎదుట పని చేసుకుంటున్న వదిన విజయలక్ష్మి(38)పై ఇనుపరాడ్డుతో ఒక్కసారిగా దాడి చేయడంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గుర్తించిన స్థానికుడు గడ్డం నాగభూషణం అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతని తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలిపోయాడు. అడ్డొచ్చిన మరొకరిపై కూడా దాడి చేసి గాయపరిచాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ కండవల్లి కుమారి అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేసి గాయపరిచాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గాయపడిన వారిలో ఎంపీటీసీ కుమారి, నాగభూషణం చికిత్స పొందుతూ మరణించగా..మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కోరుకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనంద్ నిన్ననే జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తుంది. -
పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి
నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా సైకో సూది బాబు మరోసారి రెచ్చిపోయాడు. నర్సాపురం పట్టణంలోని శుక్రవారం ఓ విద్యార్థినిపై దాడి చేశాడు. బైక్‌పై వచ్చిన సైకో స్థానిక జగన్నాథస్వామి ఆలయం సమీపంలోని మున్సిపల్ స్కూల్ లోపలికి వెళ్తున్న పల్లా కరుణ అనే విద్యార్థిని చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. దాంతో అక్కడే ఉన్న స్థానికులు సైకోను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే బాలికును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక స్వల్పంగా గాయపడ్డిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సైకో కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలను పోలీసులు అప్రమత్తం చేశారు. అతడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. -
సైకో దాడి : వృద్ధుడికి గాయాలు
నిజామాబాద్ : ఓ సైకో దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట మండలం సజ్జనపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సజ్జనపల్లి గ్రామానికి చెందిన పొమ్యా నాయక్(75) హోటల్లో టీ తాగి ఇంటికి వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని నారాయణ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పొమ్యానాయక్ను కిందకు తోసేసి బ్లేడుతో పురుషాంగాన్ని కోసేశాడు. తీవ్రంగా గాయపడిన పొమ్యా నాయక్‌ను 108 వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సైకో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు గతంలోనూ ఒక వ్యక్తిని కర్రతో కొట్టి చంపినట్టు సమాచారం. (లింగంపేట)