ఉన్మాదిని బంధించిన గ్రామస్తులు
ఇందుకూరుపేట: గుర్తుతెలియని ఓ ఉన్మాది గేదె దూడను భక్షించి పరారవ్వగా, గ్రామస్తులు గాలించి పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన మండలంలోని మైపాడు పడమటపాళెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఓ గేదె దూడను ఉన్మాది మంగళవారం రాత్రి అపహరించి సమీపాన ఉన్న పొలంలోకి తీసుకెళ్లారు. దూడను కత్తితో కోసి కొంత మాంసాన్ని తొలగించాడు. గమనించిన స్థానికులు ఉన్మాది అని తెలుసుకొని వెంబడించారు. దీంతో సముద్రం వెంబడి పరిగెత్తుతూ పారిపోయాడు.
ఇటీవలి కాలంలో చోరీలు సైతం జరగుతుండటంతో దొంగా లేదా ఉన్మాదాననే విషయం గ్రామస్తులకు తెలియలేదు. దీంతో పక్కనే ఉన్న రాముడుపాళెం గ్రామస్తులకు తెలియజేసి ఆరా తీశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి తీరంలో కనిపించాడని తెలియజేయడంతో మైపాడు వాసులు బుధవారం రాముడుపాళేనికి వెళ్లి గాలించారు. తీరం వద్ద మనుషులు పెద్దగా సంచరించని స్థలంలో ఉన్నాది పడుకొని ఉండటాన్ని వేటకు వెళ్లిన గిరిజనులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో ఉన్నాదిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment