
వీడియో దృశ్యం
సాక్షి, విజయవాడ : పటమట పరిధిలో సైకో కలకలం సృష్టిస్తున్నాడు. నల్లప్యాంట్, నల్ల షర్ట్, మొహానికి మంకీ క్యాప్‌తో తిరుగుతున్న ఆ సైకో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి ప్రవేశించి వికృతచేష్టలకు దిగుతున్నాడు. సైకో వ్యవహారంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిలా లేదా దొంగలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment