నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో | Lucknow Psycho Killer Said Pleasure In Assassinating People | Sakshi
Sakshi News home page

నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో

Published Sun, Jun 14 2020 2:54 PM | Last Updated on Sun, Jun 14 2020 3:05 PM

Lucknow Psycho Killer Said Pleasure In Assassinating People - Sakshi

నిందితుడు రాథే శ్యామ్‌

లక్నో : వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్‌ సొంత అన్నను హత్య చేయటానికి ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. విచారణలో హత్యలు చేయటానికి గల కారణాన్ని బయటపెట్టి పోలీసులను షాక్‌కు గురిచేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌, ఈటా జిల్లా ధర్మపుర్‌ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల కుర్రాడు గత ఫిబ్రవరిలో అనుమానాస్పదంగా మరణించాడు. జూన్‌ 9వ తేదీన అతడి సోదరుడు ప్రశాంత్‌ కూడా అదే రీతిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో కొంతమంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జూన్‌ 11వ తేదీన సత్యేంద్ర, ప్రశాంత్‌ల చిన్నాన్న రాథే శ్యామ్..‌ సొంత అన్న విశ్వనాథ్‌ సింగ్‌ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించాడు. అయితే ముందుగానే గుర్తించిన బంధువులు శ్యామ్‌ను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ( ప్రేమ,పెళ్లి పేరుతో మహిళను వంచించి.. )

ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో అతడు కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. తనకు మనుషుల్ని చంపటం ఇష్టమని పోలీసులకు తెలిపాడు. సత్యేంద్ర, ప్రశాంత్‌లను తానే చంపానని ఒప్పుకున్నాడు. ఇంకా మరో ముగ్గుర్ని చంపటానికి పథకం వేసుకున్నట్లు తెలిపాడు. కాగా, చిన్నారుల హత్య కేసులో జైలు పాలైన వారిని విడుదల చేసేందుకు పోలీసులు సన్నహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement