
స్ర్కూడ్రైవర్‌తో సైకో వీరంగం
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యపేటలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నాగరాజు మతిస్థిమితం లేకపోవడంతో అతని భార్య విడాకులు తీసుకుని వెళ్లి పోయింది. దీంతో ఉన్మాదిగా మారిన నాగరాజు శనివారం ఉదయం స్ర్కూడ్రైవర్ తీసుకుని స్థానిక చర్చిలోకి చొరబడ్డాడు. అక్కడున్న వారిని స్ర్కూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేస్తుండటంతో అంతా కలిసి అతడిని తాడుతో కట్టి, పోలీసులకు సమాచారం అందించారు. వారు నాగరాజును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.