IPL 2023: Virat Kohli Video Calling Wife Anushka Sharma After His 6th IPL Century, Goes Viral - Sakshi
Sakshi News home page

#ViratKohli: అనుష్కకు వీడియోకాల్‌.. కోహ్లి ఎమోషనల్‌

Published Fri, May 19 2023 5:14 PM | Last Updated on Fri, May 19 2023 5:59 PM

Virat Kohli video calls wife Anushka Sharma After 6th Ton-IPL Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కింగ్‌ కోహ్లి 62 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు  ఐపీఎల్‌లో సెంచరీ సాధించి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు.

ఐపీఎల్‌లో ఆరో సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు బాదిన గేల్‌ రికార్డును సమం చేశాడు.  తన సెంచరీతో జట్టు గెలవడంతో పాటు కీలకమైన ప్లేఆఫ్‌ రేసులో ఆర్‌సీబీ నిలవడం కోహ్లికి తెగ సంతోషాన్నిచ్చింది. అందుకే మ్యాచ్‌ అనంతరం జట్టు సభ్యులతో పాటు అభిమానులతో కోహ్లి తన సెంచరీని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లి తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్‌ చేసి మాట్లాడడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ సందర్భంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ కోహ్లి ఎమోషనల్‌ అయినట్లు అనిపించింది. కోహ్లి సెంచరీ చేసిన సమయంలో అనుష్క స్టేడియంలో ఉండుంటే ఆ ఫీల్‌ వేరుగా ఉండేదని అభిమానులు పేర్కొన్నారు.

అయితే అనుష్క తన భర్త కోహ్లి సాధించిన ఘనతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ''He Is Bomb.. What An Innings My Love..''అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఏది ఏమైనా ఈ స్వీట్‌ కపుల్‌ తమ చర్యతో మరోసారి అభిమానులకు సంతోషాన్ని పంచారు.

ఇక నిన్నటి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ హోంగ్రౌండ్‌లో ఆడుతున్నప్పటికి ఆ ఫీల్‌ ఎక్కడా కలగలేదు.  ఎందుకంటే మ్యాచ్‌కు వచ్చినవారిలో ఎక్కువమంది అభిమానులు ఆర్‌సీబీకే మద్దతిచ్చారు. దీంతో మ్యాచ్‌ జరుగుతుంది బెంగళూరు లేదా హైదరాబాద్‌ అన్న అనుమానం కూడా వచ్చింది.

చదవండి: Virat Kohli: గేల్‌ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement