
జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ అని పేరుతో అదిరిపోయే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. గతంలో జూమ్ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటే అలా కనబడేది. ఇప్పుడు జూమ్ తీసుకొచ్చిన ఇమ్మర్సివ్ వ్యూ అనే ఫీచర్ సహాయంతో ఉద్యోగులు అయితే నిజంగానే మనం ఆఫీసులో ఉన్నమా?, విద్యార్థులు అయితే పాఠశాలలో ఉన్నమా? అనే అనుభూతి కలుగుతుంది. జూమ్ గత సంవత్సరం తన జూమ్ టోపియా పేరుతో ఈ ఫీచర్‌ను ప్రకటించింది.
జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ పేరుతో నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ విదేశాల్లో ఉన్న ఉచిత, ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఒక గదిలో ఐదారు స్థానాలు కనిపిస్తాయి. అందులో టేబుల్ దగ్గర(పైన ఒకటో ఫొటోలో ఉన్నట్లు) సమావేశంలో కూర్చున్నట్లుగా అడ్జెస్ట్ చేయవచ్చు. అవసరమైతే బ్యాగ్రౌండ్‌ను కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అయితే దీనిలో ఎటువంటి మార్పులు చేయాలన్న కేవలం హోస్ట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకొనిరనున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి జూమ్ డెస్క్ టాప్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే దీనికి పోటీగా ఇదే తరహా ఫీచర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ‘టుగెదర్ మోడ్’ పేరుతో అందుబాటులో ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment