కేసు వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ కిరణ్‌కుమార్, పక్కన ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు
ఖలీల్‌వాడి: బోధన్ మండలం ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి వద్ద దోపిడీకి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. ఒకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి(55) నుంచి దోపిడీ పాల్పడిన కేసులో ఆర్మూర్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న నల్ల నవీన్, ఇదేకాలనీలో ఉంటున్న గడ్డల దామోదర్, రాస ప్రవీణ్, ఒడ్డెర కాలనీకి చెందిన మేకల హరీశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా దారంగుల గంగాధర్ పరారీలో ఉన్నాడు.
ఈ ఐదుగురు జల్సాల కోసం డబ్బు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో నిందితులు రెండు మోటార్ సైకిళ్లపై ఈనెల 23న నిజామాబాద్‌కు బయలు దేరినట్లు వెళ్లారు. గంగాధర్, ప్రవీణ్, హరీశ్, దామోదర్‌లు చిన్నాపూర్ గండి వద్ద కట్టెలు, స్క్రూ డ్రైవర్‌లతో వేచి ఉన్నారు. నల్లనవీన్ నిజామాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌కు అతని మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడ టీతాగుతున్న పోతుల పోశెట్టి దగ్గరకు వెళ్లి అతన్ని చంపుతానని బెదిరించాడు. అతడిని మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టుకొని చిన్నాపూర్ గండి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ నిందితులు బాధితుడిని బెదిరించి స్క్రూడ్రైవర్‌తో పొడిచి కట్టెలతో కొట్టి బాధితుడి వద్ద ఉన్న వెండి, బంగారపు వస్తువులతో పాటు రూ. 600 దోపిడీ చేశారు.
అంతేకాకుండా బాధితుడిని ఎరాజ్‌పల్లిలో తన ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న రూ. 35వేలు దోచుకున్నారు. అనంతరం బాధితుడిని మామిడిపల్లి రోడ్ వద్ద వదిలి ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు, ఎస్సై హబీబ్ ఖాన్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఇన్‌చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కిరణ్‌కుమార్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment