భూ భారతి వచ్చే..! | - | Sakshi
Sakshi News home page

భూ భారతి వచ్చే..!

Apr 14 2025 12:43 AM | Updated on Apr 14 2025 12:43 AM

భూ భా

భూ భారతి వచ్చే..!

మా మామ పేరుపై సిర్నాపల్లి రెవెన్యూ శివారులోని 226 సర్వే నంబర్‌లో ఎకరన్నర, అలాగే నల్లవెల్లి రెవెన్యూ శివారులో 30 గుంటల భూమి ఉంది. ధరణి వచ్చిన తరువాత అసలు రికార్డుల్లోనే వివరాలు లేకుండాపోయాయి. ఇప్పటివరకు కొత్త పాస్‌పుస్తకాలు రాలేదు. రైతుబంధుతోపాటు పంటరుణం పొందలేకపోయాం. ఐదు సంవత్సరాలుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. భూభారతితోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – నాందేడపు రాజన్న, నల్లవెల్లి

సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

– 8లో u

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

ఖలీల్‌వాడి: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదివారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సూపరింటెండెంట్‌ నవాజ్‌ఖాన్‌, ఫైర్‌ ఆఫీసర్‌ నర్సింగ్‌ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

కాకతీయ కాలువకు

నిలిచిన నీటి విడుదల

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని ఆదివారం ప్రాజెక్ట్‌ అధికారులు నిలిపివేశారు. యాసంగి సీజన్‌ కోసం విడుదలవుతున్న నీటిని ఈ నెల 9వ తేదీనే నిలిపివేయాల్సి ఉంది. కానీ, కాకతీయ కాలువ జోన్‌–2 ఆయకట్టు కోసం ప్రాజెక్ట్‌ అధికారులు మూడు రోజులపాటు నీటి విడుదలను కొనసాగించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ నుంచి అన్ని కాలువలు, లిఫ్టులకు నీటి విడుదల నిలిచిపోగా, ఆదివారం నాటికి ప్రాజెక్ట్‌లో 11.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నిలిచిన విద్యుదుత్పత్తి

కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టే వరకు విద్యుదుత్పత్తి జరిగే అవకాశం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.44 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు జెన్‌కో అధికారులు వెల్లడించారు.

33కేవీ, 11కేవీ ఫీడర్లపై ఎఫ్‌పీఐలు

సుభాష్‌నగర్‌: విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో 33కేవీ, 11కేవీ దూరమైన లైన్‌లలో ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లు (ఎఫ్‌పీఐ)లను పెడుతున్నామని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలు, బ్రేక్‌ డౌన్‌, ప్రకృతి వైపరీత్యాల సమయంలో లైన్‌ మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా, సమస్య ఏర్పడిన ప్రాంతాన్ని ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్‌ విభజిస్తుందని పేర్కొన్నారు. అంతరాయం ఏ భాగంలో జరిగిందనే విషయాన్ని వెంటనే విశ్లేషించి నేరుగా అక్కడికే వెళ్లి పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా విద్యుత్‌ అంతరాయ సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చని తెలిపారు. ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లను 33కేవీ, 11కేవీ విద్యుత్‌ లైన్‌లలో అంతరాయాల గుర్తింపు, వాటి నివారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 50 విద్యుత్‌ ఫీడర్లలో, ఎఫ్‌పీఐలను బిగించేందుకు సాంకేతికంగా వ్యూహాత్మక ప్రదేశాలను గుర్తించామని తెలిపారు.

21 నుంచి పరివర్తన్‌ సమ్మర్‌ క్యాంప్‌

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌ హైస్కూల్‌లో ఈ నెల 21 నుంచి పరివర్తన్‌ – సమ్మర్‌క్యాంప్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు మధుసూదనచారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్యాంప్‌లో యోగా, మెడిటేషన్‌, భగవద్గీత, భజన్‌, చెస్‌, డ్రాయింగ్‌ తదితర వాటిపై విద్యార్థులకు శిక్షణ ఉంటుందని అన్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9290449389, 9848225409, 7396994484 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఇందల్వాయి: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘భూ భారతి’ పోర్టల్‌తో రైతుల్లో ఆశలు చిరుగురించాయి. రైతులు, ప్రజలకు సులభంగా, వేగంగా సేవలందిస్తూ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో భూ భారతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. వ్యవసాయభూముల రికార్డుల్లో నెలకొన్న గందరగోళం, పాస్‌పుస్తకాల జారీలో జాప్యం కారణంగా ఎంతో మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ధరణిలోని 33 మాడ్యుళ్లను భూ భారతికి వచ్చేసరికి ఆరుకి కుదించారు.

పేరుకుపోయిన దరఖాస్తులు..

ధరణి వెబ్‌సైట్‌ ద్వారా ఎంతో మంది రైతుల భూ రికార్డులు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోగా, నమోదైనవి తప్పుల తడకగా ఉన్నాయి. వాటిని సరిదిద్దుకునేందుకు రైతులు ఏళ్ల తరబడి తహసీల్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే సమస్యలను పరిష్కరించే అధికారం తహసీల్దార్‌ స్థాయిలో లేకపోవడం, వెబ్‌సైట్‌ నిర్వహణ, సమస్యల పరిష్కారం సక్రమంగా లేకపోవడంతో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఈ కారణంగా ధరణి వెబ్‌సైట్‌పై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

భూ భారతి వచ్చేదాక ఆగమన్నారు

నా భర్త చనిపోయి మూడు నెలలు అవుతోంది. తన పేరుపై ఉన్న భూమిని నా పేరు మీదికి మార్చమని వెళ్తే సర్వే నంబర్లలో విస్తీర్ణం వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చేయడం కుదరదు. భూ భారతి వచ్చేదాకా ఆగమన్నారు. ఇప్పుడేమో భూ భారతి కేవలం మూడు మండలాల్లోనే అంటున్నారు. త్వరగా భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి నాలాంటి వారి సమస్యలను పరిష్కరించాలి.

– కుంటజంగుల పద్మ, నల్లవెల్లి

తగిన ఆప్షన్లు ప్రవేశపెట్టాలి

రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిష్కరించే ఆప్షన్‌లను భూ భారతిలో ప్రవేశ పెట్టాలి. చిన్నచిన్న సమస్యలు తహసీల్‌ కార్యాలయాల్లోనే పరిష్కారమయ్యేలా అధికారాలు బదిలీ చేయాలి. ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. రికార్డులను తారుమారు చేసే, లోసుగులను అడ్డు పెట్టుకొని భూములను అక్రమంగా మార్పిడి చేసే అధికారులను కఠినంగా శిక్షించాలి. – నోముల రాజులు, రైతు, నల్లవెల్లి

పరిష్కారం లభిస్తుంది

రైతులు ఎదుర్కొంటున్న అన్ని భూ సమస్యలకు నూతన ఆర్‌వోఆర్‌ చట్టం–2025 భూ భారతితో తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. సీనియర్‌ ఐఏఎస్‌లు, విశ్రాంత రెవెన్యూ అధికారులు, భూ చట్టాల నిపుణులు, రైతు సంఘాల నేతలతో విస్తృతంగా చర్చించి రూపొందించిన భూ భారతి ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. భూ రికార్డుల పటిష్టానికే భూభారతిని తీసుకొస్తోంది. – సుంకెట అన్వేష్‌రెడ్డి,

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌

న్యూస్‌రీల్‌

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలివే..

పొజిషన్‌లో ఉన్నా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో భూముల వివరాలు లేకపోవడం, నూతన పట్టా పాస్‌పుస్తకాలు రాకపోవడం.

నూతన పాస్‌పుస్తకాలు వచ్చినా పూర్తి స్థాయిలో విస్తీర్ణం నమోదు కాకపోవడం.

పట్టా భూములు అసైన్డ్‌గా, అసైన్డ్‌ భూములు పట్టాలుగా నమోదవడం.

ఆబాది భూములు వ్యవసాయ భూము లుగా, వ్యవసాయ భూములు ఆబాదిగా నమోదవడం.

ఒకరికి చెందిన భూములు మరొకరి పేరు మీద నమోదవడం. తద్వారా గ్రామాల్లో భూ పంచాయితీలు పెరగడం.

భూ విస్తీర్ణం రికార్డుల్లో హెచ్చుతగ్గుల(ఆర్‌ఎస్‌ఆర్‌) సమస్య కారణంగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడం, స్లాట్‌ రద్దయితే చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడం.

కారణాలు చెప్పకుండా దరఖాస్తుల తిరస్కరణ.

ధరణి స్థానంలో నూతన పోర్టల్‌

సమస్యల పరిష్కారం కోసం

ఎదురుచూస్తున్న రైతులు

నేడు అధికారికంగా

ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

భూ భారతి వచ్చే..!1
1/7

భూ భారతి వచ్చే..!

భూ భారతి వచ్చే..!2
2/7

భూ భారతి వచ్చే..!

భూ భారతి వచ్చే..!3
3/7

భూ భారతి వచ్చే..!

భూ భారతి వచ్చే..!4
4/7

భూ భారతి వచ్చే..!

భూ భారతి వచ్చే..!5
5/7

భూ భారతి వచ్చే..!

భూ భారతి వచ్చే..!6
6/7

భూ భారతి వచ్చే..!

భూ భారతి వచ్చే..!7
7/7

భూ భారతి వచ్చే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement