screwdriver
-
భార్యను 41 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి.. దారుణ హత్య
అంకారా: టర్కీలో దారుణం జరిగింది. హోటల్ గదిలో ఓ బ్రిటీష్ పర్యటకుడు తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు. ఇస్తాంబుల్ సమీపంలోని ఫాతిహ్ మెవ్లనాకపి జిల్లాలో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హోటల్ గదిలో అరుపులు వినడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తీసి చూడగా.. మహిళ మృతదేహం అతి కారాతకంగా పొడిచి ఉంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త గది నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితున్ని ప్రశ్నించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యను తనే స్క్రూ డ్రైవర్‌తో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. తనకు డ్రగ్స్ ఇచ్చినందుకు ఇలా చేశానని పోలీసులకు చెప్పాడు. కానీ గదిలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 14న బ్రిటన్‌కు చెందిన భార్యభర్త ఇస్తాంబుల్‌కు వచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు -
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
ఖలీల్‌వాడి: బోధన్ మండలం ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి వద్ద దోపిడీకి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. ఒకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి(55) నుంచి దోపిడీ పాల్పడిన కేసులో ఆర్మూర్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న నల్ల నవీన్, ఇదేకాలనీలో ఉంటున్న గడ్డల దామోదర్, రాస ప్రవీణ్, ఒడ్డెర కాలనీకి చెందిన మేకల హరీశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా దారంగుల గంగాధర్ పరారీలో ఉన్నాడు. ఈ ఐదుగురు జల్సాల కోసం డబ్బు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో నిందితులు రెండు మోటార్ సైకిళ్లపై ఈనెల 23న నిజామాబాద్‌కు బయలు దేరినట్లు వెళ్లారు. గంగాధర్, ప్రవీణ్, హరీశ్, దామోదర్‌లు చిన్నాపూర్ గండి వద్ద కట్టెలు, స్క్రూ డ్రైవర్లతో వేచి ఉన్నారు. నల్లనవీన్ నిజామాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌కు అతని మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడ టీతాగుతున్న పోతుల పోశెట్టి దగ్గరకు వెళ్లి అతన్ని చంపుతానని బెదిరించాడు. అతడిని మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టుకొని చిన్నాపూర్ గండి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ నిందితులు బాధితుడిని బెదిరించి స్క్రూడ్రైవర్‌తో పొడిచి కట్టెలతో కొట్టి బాధితుడి వద్ద ఉన్న వెండి, బంగారపు వస్తువులతో పాటు రూ. 600 దోపిడీ చేశారు. అంతేకాకుండా బాధితుడిని ఎరాజ్పల్లిలో తన ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న రూ. 35వేలు దోచుకున్నారు. అనంతరం బాధితుడిని మామిడిపల్లి రోడ్ వద్ద వదిలి ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు, ఎస్సై హబీబ్ ఖాన్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కిరణ్‌కుమార్ అభినందించారు. -
పెళ్లి చేసుకోవాలని వివాహితపై ఒత్తిడి.. ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్‌తో
సాక్షి, రంగారెడ్డి: ఫేస్ బుక్ పరిచయం ఓ వివాహితను ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన మహిళ స్థానిక ఎంబీఆర్ నగర్లో నివాసం ఉంటోంది. భర్త రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కూతురు ఉంది. ఈమెకు ఫేస్బుక్ ద్వారా మంచాల మండలం రంగాపూర్‌కు చెందిన శివకాంత్(28)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని బెదరింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం ఏకంగా వివాహిత ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్‌తో ఆమె మెడ, చెంప, కూడి చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధిత మహిళ, ఆమె అమ్మమ్మ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు యత్నించాడు. అదే భవనంలో ఉన్న వారు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ.. -
అప్పు తీర్చమంటే.. స్క్రూడ్రైవర్‌తో పొడిచాడు
విజయవాడ: నగరంలోని వన్ టౌన్ చిట్టినగర్‌లో దారుణం జరిగింది. గ్రంది వెంకట రంగారావు అనే వ్యక్తిని సెల్‌ఫోన్ మెకానిక్ గా పనిచేస్తున్న తాజ్ అనే యువకుడు స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు. పోలీసులు తాజ్‌ను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఛాతి భాగంలో స్ర్కూ డ్రైవర్ బలంగా దిగడంతో వెంటనే అతడిని అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలివి.. రంగారావు తన సెల్‌ఫోన్‌ను రిపేర్ చేయమని తాజ్‌కు ఇచ్చాడు. దాన్ని విక్రయించాలంటూ తాజ్ సలహా ఇవ్వగా అందుకు అతను అంగీకరించాడు. రూ.5వేలకు సెల్‌ఫోన్‌ను విక్రయించిన తాజ్ ఆ డబ్బులు రంగారావుకు ఇవ్వలేదు. గతంలో రంగారావు వద్ద అప్పుగా తీసుకున్న రూ.4 వేలతో కలిపి మొత్తంగా రూ.9 వేలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి చిట్టినగర్ ఈద్గా సెంటర్లో తాజ్‌ను పట్టుకున్న రంగారావు తనకు రావాల్సిన రూ.9వేల గురించి నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా కోపం పట్టలేక తాజ్ స్ర్కూ డ్రైవర్‌తో రంగారావును పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు తాజ్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. -
అప్పు తీర్చమంటే స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు