
పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప
డిచ్‌పల్లి/నిజామాబాద్ సిటీ: ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణ పనులను పాత డిజైన్ ప్రకారం చేపట్టి రెండు సంవత్సరాల్లో లక్షా 82 వేల ఎకరాలకు సాగునీరందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల పనులపై ఆదివారం హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖ ఉన్నతాధికారులతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాను ప్రతిపాదించిన విధంగా మంచిప్ప ప్రాజెక్టు పనులను పాత డిజైన్ ప్రకారం పూర్తి చేయడంతోపాటు రూరల్ నియోజకవర్గంలోని అన్ని నీటిపారుదల శాఖ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు.
వ్యవసాయానికి పెద్దపీట
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని, సకాలంలో నీటి పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మునిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉ న్న బకాయిలను మంజూరు చేస్తామని, ఆర్మూర్ నియోజకవర్గంలోని నాలుగు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చౌట్‌పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో పైపులైన్ లీకేజీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని, సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చే యాలని మంత్రి ఆదేశించినట్లు షబ్బీర్ తెలిపారు.
రెండేళ్లలో లక్షా 82వేల
ఎకరాలకు సాగునీరందించాలి
ప్యాకేజీ – 21 పనులపై నీటిపారుదల
శాఖ మంత్రి ఉత్తమ్ సమీక్ష
హాజరైన షబ్బీర్,
భూపతిరెడ్డి, మహేశ్‌గౌడ్