1/12
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్‌లలో ఒకరైను సుకుమార్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
2/12
సుకుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో జన్మించారు.
3/12
కాకినాడలోని ఆదిత్య కళాశాలలో గణితం అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చినా తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి ఇండిస్ట్రీ వైపు అడుగులు పడేలా చేసింది.
4/12
సినీ రంగంపై ఉన్న ఆసక్తితో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశారు.
5/12
చిరంజీవి హిట్ సినిమా బావగారు బాగున్నారా సినిమా కోసం రైటింగ్ విభాగంలో ఆయన తొలిసారి పనిచేశారు.
6/12
రచయితగా తన కెరీర్ ప్రారంభించినప్పటికీ 2004 సంత్సరంలో ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు.
7/12
సుకుమార్ ఇప్పటి వరకు డైరెక్షన్ చేసిన సినిమాలు తొమ్మిది.. ప్రతి సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు.
8/12
రంగస్థలం , పుష్ప చిత్రాలకు గాను ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డ్స్ అందుకున్నారు.
9/12
ఆర్య సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది.
10/12
సుకుమార్ రైటింగ్స్ పేరుతో కుమారి21F, ఉప్పెన,విరూపాక్ష వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.
11/12
పుష్ప సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందిన సుకుమార్.. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు.
12/12
రామ్ చరణ్‌తో సుకుమార్ ఒక సినిమా ఇప్పటికే ప్రకటించారు. అందుకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.