మధురానగర్(విజయవాడ సెంట్రల్): పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన విజయ మేరీ జర్షిత్ ఆర్‌సీఎం స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈమె కుమార్తె జాన్సీమౌనిక (17) ఇంటర్ చదువుతుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న జాన్సీ ఇంటర్ పరీక్షలు రాయనని చెప్పడంతో తల్లి సైక్రియాటిస్ట్‌కు చూపించగా అక్కడ పరీక్షలు రాసేందుకు అంగీకరించింది. గురువారం ఉదయం 7.30గంటలకు జాన్సీ మౌనిక ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. పరీక్షలు రాయటం ఇష్టం లేక ఇంట్లో తలుపు వేసుకుని పడుకుందని భావించిన తల్లి విధులకు వెళ్లిపోయింది. తరువాత విజయ మేరీ మరదలు తలుపు కొట్టినా తెరవకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరచి చూసేసరికే ఆమె మృతిచెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.