అమ్మమ్మ తాతయ్య ప్రేమ కోసం ఆత్మహత్య | student sucide | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ తాతయ్య ప్రేమ కోసం ఆత్మహత్య

Published Fri, Sep 23 2016 5:53 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

student sucide

కోల్‌సిటీ : గోదావరిఖని ఫైవింక్లయిన్‌ చౌరస్తాకు చెందిన రాసమల్ల అభినయ్‌(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అభినయ్‌ తల్లిదండ్రులు విజేందర్, కవిత హోటల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిది ప్రేమవివాహం కావడంతో బంధువులకు దూరమయ్యారు. అభినయ్‌ తనకు అమ్మమ్మ, తాతయ్య ప్రేమ కావాలని అనేకసార్లు బంధువులను కోరాడు. అయినా ప్రేమ పంచకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స మహేందర్‌ తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement