ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | inter student sucide | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Wed, Dec 21 2016 11:13 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

దివిలి (పెద్దాపురం) : ఆ మనస్సుకు ఏ కష్టమొచ్చిందో, ఏమో.. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దాపురం మండలం దివిలి బీఎస్‌ఆర్‌ కళాశాలలో మొల్లేరు మల్లవరానికి చెందిన టేకుమూడి సునీత(17) చంద్రమాంపల్లిలోని తన పిన్ని గుబ్బల లక్ష్మి ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు  పాల్పడింది. ఈ సంఘటన ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని స్వగ్రామమైన మల్లవరానికి పంపించేశారు. బుధవారం సాయంత్రానికి ఈ విషయం బయటకు పొక్కడంతో ఎస్సై వై.సతీష్‌ చంద్రమాంపల్లిలోని మృతురాలి పిన్ని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కళాశాల యాజమాన్యం బుధవారం సెలవు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement