పెద్ద నోట్లు మార్చుకున్న ఆర్టీసీ అధికారి | Currency exchanging rtc officer in ravulapalem depot | Sakshi

పెద్ద నోట్లు మార్చుకున్న ఆర్టీసీ అధికారి

Nov 13 2016 6:29 PM | Updated on Sep 22 2018 7:51 PM

రావులపాలెం ఆర్టీసీ బస్టాండులో ఆ సంస్థ ఉన్నతాధి ఒకరు తన వద్ద ఉన్న పెద్ద నోట్లను కండక్టర్ల వద్ద మార్చుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది.

తూర్పుగోదావరి జిల్లా : రావులపాలెం ఆర్టీసీ బస్టాండులో ఆ సంస్థ ఉన్నతాధి ఒకరు తన వద్ద ఉన్న పెద్ద నోట్లను కండక్టర్ల వద్ద మార్చుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది. రూ.500, రూ.వెయ్యి నోట్లను కేంద్రం రద్దు చేయడంతో తన వద్ద ఉన్న వాటిని ఆ అధికారి కండక్టర్లకు ఇచ్చి వారినుంచి రూ.100 ఇతర చిన్న నోట్లు మార్చుకుంటుండగా స్థానికులు మీడియాకు సమాచారం అందించారు.

దీంతో ‘సాక్షి’ అక్కడికి చేరుకుని ఫొటోలు తీయడంతో ఆయన ఖంగుతిన్నారు. దీనిపై ఆయన్ను వివరణ కోరగా సొంత అవసరాల కోసం పెద్ద నోట్లు మార్చుకున్నానని, ఇలా రూ.20 వేలు మార్చుకున్నానంటూ ఇదేమీ తప్పు కాదన్నట్లు సమర్థించుకున్నారు. పై అధికారి కావడంతో తప్పు అయినా సహకరించినట్లు కొందరు సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement