హోరాహోరీగా ‘సీఆర్‌సీ’ కబడ్డీ పోటీలు
Published Sun, Jan 15 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
రావులపాలెం (కొత్తపేట) :
స్థానిక ప్రభుత్వ ఉభయ కళాశాలల మైదానంలో ఆదివారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని సీఆర్‌సీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో హోరాహోరీగా సాగాయి. పురుషుల, మహిళల విభాగంలో మూడో రోజు పోటీలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో ఎనిమిది జిల్లాల జట్లు, మహిళల విభాగంలో ఆరు జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం ఈ పోటీలను రావులపాలెం పరిసర ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో ప్రజలు తిలకించారు. ఎంపీపీ కోట చెల్లయ్య, సీఆర్‌సీ రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి మూడో రోజు పోటీలను ప్రారంభించారు. సీఆర్‌సీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఈ పోటీలు నిర్వహించారు.
Advertisement
Advertisement