Kabaddi competitions
-
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రస్థాయి అంతర విశ్వవిద్యాలయాల మహిళల కబడ్డీ పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహం గా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వేదిక జరుగుతున్న పోటీలను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు అంతర్జాతీయ క్రీడాకారిణులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కబడ్డీకి మంచి ఆదరణ ఉందన్నా రు. పురుషులతో సమానంగా మహిళల కబడ్డీకి ఆదరణ లభిస్తోందన్నారు. ఐపీఎల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ ప్రొకబడ్డీకి ఉందన్నారు. తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తోందని, బాలికలను చదువుతో పాటు క్రీడల్లో పోత్సహిస్తున్నారన్నారు. మహిళలు కూడా దేశ ప్రతిష్టను పెంచే కీడానైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని చెప్పారు. పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, సానియా మీర్జా వంటి క్రీడాకారిణులు దేశప్రతిష్టను అంతర్జాతీయ స్థా యికి తీసుకెళ్లారని కొనియాడారు. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీస్థాయి విద్యార్థినులు చదువుతో పాటు నచ్చిన క్రీడకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడలకు ప్రాధాన్యం : వీసీ రామ్‌జీ బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ మా ట్లాడుతూ వర్సిటీలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యమన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి అంతర విశ్వవిద్యాలయాల క్రీడల నిర్వహణ, జాతీయస్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వర్సిటీలో క్రీడా వసతు ల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరిం చారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ కె.రఘబాబు, ప్రిన్సిపాల్ గుంట తులసీరావు, పాలక మండలి సభ్యులు తమ్మినేని కామరాజు, బిడ్డిక అడ్డయ్య, బరాటం లక్ష్మణరావు, పొన్నాల జయరాం, వర్సిటీ పీడీ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి సుందరరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆరు జట్లు హాజరు అంతర వర్సిటీ మహిళల కబడ్డీ పోటీలకు ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన జట్లు హాజరయ్యా యి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కాకినాడ, నాగార్జునా విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాల యం జట్లు హాజరయ్యాయి. లీగ్, నా కౌట్ దశల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఏయూ, శ్రీ కృష్ణా విశ్వవిద్యాలయం మధ్య జరిగిన పోటీలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విజయం సాధించిం ది. అలాగే నాగార్జునా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కాకినాడ మధ్య జరిగిన పోటీలో నాగార్జునా విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కాకినాడ మధ్య జరిగిన పోటీల్లో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణ, నన్నయ్య విశ్వవిద్యాలయం మధ్య జరి గిన పోటీల్లో నన్నయ్య విశ్వవిద్యాలయం జట్లు విజయం సాధించాయి. క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. మ్యాట్లతో కోర్టు తయారు చేశారు. ఫ్లడ్ లైట్లు వెలుగులో సాయంత్రం పోటీలు జరిగాయి. సాయంత్రం క్రీడాకారిణులు క్యాంప్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. క్రీడాకారినులు ఉత్సాహంగా చేసిన నృత్యాలు అలరించాయి. కబడ్టీ పోటీల్లో గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆంధ్రా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య వర్సిటీ మధ్య పోటీ ఉత్కంఠంగా సాగింది. మ్యా చ్ డ్రాగా (32–32 సాయింట్లు సాధించి) ముగి సింది. లీగ్ మ్యాచ్‌లో ప్రతిభ ఆధారంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ సెమీస్‌కు చేరుకుంది. -
హోరాహోరీగా ‘సీఆర్సీ’ కబడ్డీ పోటీలు
రావులపాలెం (కొత్తపేట) : స్థానిక ప్రభుత్వ ఉభయ కళాశాలల మైదానంలో ఆదివారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని సీఆర్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో హోరాహోరీగా సాగాయి. పురుషుల, మహిళల విభాగంలో మూడో రోజు పోటీలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో ఎనిమిది జిల్లాల జట్లు, మహిళల విభాగంలో ఆరు జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం ఈ పోటీలను రావులపాలెం పరిసర ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో ప్రజలు తిలకించారు. ఎంపీపీ కోట చెల్లయ్య, సీఆర్సీ రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి మూడో రోజు పోటీలను ప్రారంభించారు. సీఆర్సీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఈ పోటీలు నిర్వహించారు. -
కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను తెలంగాణ శాసనసభా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ పోటీల్లో 14 సంవత్సరాల్లోపు బాలబాలికలు పాల్గొంటారు. అనంతరం భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పాఠాలు ఏవిధంగా చెబుతున్నారని, పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. -
పోలీసు క్రీడాకారులకు డీజీపీ ప్రశంస
ఎస్సై మహేందర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: సౌత్ ఏషియన్ కబడ్డీ పోటీల్లో భారత్ ప్రథమ బహుమతి సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన రాష్ట్ర పోలీసు అధికారులను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రశంసించారు. కబడ్డీ జట్టుకు నాయకత్వం వహించిన రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.మహేందర్‌రెడ్డిని డీజీపీ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన 12వ సౌత్ ఏషియన్ కబడ్డీ పోటీల్లో భారత్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఫైనల్లో దాయాది దేశం పాకిస్తాన్‌ను భారత జట్టు చిత్తుచేసింది. దేశానికి నాయకత్వం వహించిన మహేందర్‌రెడ్డితో పాటు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అహ్మద్, అసిస్టెంట్ కోచ్ రమణారెడ్డి, బెటాలియన్ ఐజీ శ్రీనివాసరావులను ప్రశంసించారు. -
రాష్ర్టస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
రెంటచింతల : కనుమరుగవుతున్న సంప్రదాయ క్రీడలను కాపాడుకుందామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక వైఆర్ఎస్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం కానుకమాత తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆయన గురజాల డీఎస్పీ నాగేశ్వరావుతో కలసి ప్రారంభించి మాట్లాడారు. డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే, డీఎస్పీలు కబడ్డీ ఆడి ప్రేక్షకులను రంజింపచేశారు. మొత్తం 32 టీమ్‌లు పాల్గొన్నాయి. పోటీల్లో సాగర్మాత జూనియర్ కళాశాల జట్టు ఆనంద్ సీసీపై.. రెంటాల భాస్కర్‌రెడ్డి జట్టు.. రామచంద్రాపురం జట్టుపై, వైఆర్ఎస్ జూనియర్స్ టీం.. రాయవరం జట్టుపై, డేగల విజయ్ టీం.. గురజాల రెబల్ సీసీపై విజయం సాధించినట్లు నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లెర్ల లక్ష్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాప్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పూజల రామయ్య, ఉప సర్పంచ్ ఏలూరిసత్యం, వైఎస్సార్ సీపీ రాష్ర్ట యువజన కార్యవర్గసభ్యుడు ఉమామహేశ్వరెడ్డి, పమ్మి సీతారామిరెడ్డి, రిటైర్డు ఎంఈవో గోగిరెడ్డి సీతారెడ్డి, యేచూరి వెంకటసైదయ్య పాల్గొన్నారు. -
ఉత్సాహంగా కబడ్డీ పోటీలు
విశాఖపట్నం : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆదివారం విశాఖ సాగర తీరంలో తలపెట్టిన కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలను వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. తొలుత వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ తాత్కాలిక విగ్రహానికి నాయకులంతా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాజువాక మహిళా కబడ్డీ జట్టుతో పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు. తరువాత మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మూడు రోజులపాటు సాగర తీరంలో ఈ పోటీలు జరగనున్నాయని మళ్ల విజయప్రసాద్ తెలిపారు. పోటీల ముగింపు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలోని పలు కబడ్డీ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. గాజువాక, అక్కయ్యపాలెం మహిళా జట్ల మధ్య పోరుతో పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, కర్రి సీతారాం, పార్టీ నాయకులు ఫరూఖ్, జాన్ వెస్లీ, శ్రీకాంత్, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండ జిల్లాలో ‘క్విక్ యాక్షన్ టీం’ ఏర్పాటు
దామరచర్ల(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో సూర్యాపేట వంటి సంఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యేందుకు 8 మంది పోలీసులతో కూడిన క్విక్ యాక్షన్ టీంను ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ జి.సందీప్ తెలిపారు. మంగళవారం మండలంలోని అడవిదేవులపల్లిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది మందితో కూడిన ఈ బృంద సభ్యులకు ఆధునిక ఆయుధాలు సమకూర్చినట్లు వివరించారు. ఎలాంటి ఘటన జరిగినా తిప్పికొట్టేందుకు వారు సంసిద్ధులై ఉంటారని తెలిపారు. అలాగే, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా గ్రామ పోలీసు అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో జన మైత్రి సంఘాలతో పాటు పల్లె నిద్ర పథకాలను చేపట్టడం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. -
వరంగల్ జట్ల విజయకేతనం
=ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ అండర్-19 పోటీలు =బాలికల విభాగంలో ప్రథమ స్థానం =బాలురలో రెండో స్థానం వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్రస్థాయి అండర్-19 జూనియర్ కళాశాల కబడ్డీ పోటీల్లో వరంగల్ జట్లు హవా కొనసాగించాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిలవగా, బాలుర విభాగంలో రెండో స్థానం సాధించింది. వరంగల్‌లోని రంగశాయిపేటలో మూడు రోజులుగా జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, వరంగల్ జట్టు రెండో స్థానం సాధించింది. బాలికల విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ స్థానం, విశాఖపట్నం ద్వితీయ బహుమతి అందుకుంది. బాలికల ఫైనల్ విభాగంలో వరంగల్ 49-18తేడాతో విశాఖపట్నంపై జయకేతనం ఎగురవేసింది. బాలుర ఫైనల్ విభాగంలో ప్రకాశం జట్టు 43-13 తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. జాతీయస్థాయిలో రాణించాలి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించి జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని చాటాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డీవీఈఓ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సారయ్యతో పాటు, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇవే చివరివని అన్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో వరంగల్ జిల్లా ముందుంటుందని, క్రీడల్లో కూడా ముందుంజలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ అండర్-19 జిల్లా సెక్రటరీ రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్‌చైర్మన్ సారయ్య, నాయిని అశోక్, కేడల పద్మ, పోషాల పద్మ, ఎంబాడి రవీందర్, ఎం.వెంకటేశ్వరరావు, పెటా పీఈటీ సంఘం జిల్లా కార్యదర్శి కత్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.