తలపడుతున్న క్రీడాకారిణులు
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రస్థాయి అంతర విశ్వవిద్యాలయాల మహిళల కబడ్డీ పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహం గా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వేదిక జరుగుతున్న పోటీలను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు అంతర్జాతీయ క్రీడాకారిణులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కబడ్డీకి మంచి ఆదరణ ఉందన్నా రు. పురుషులతో సమానంగా మహిళల కబడ్డీకి ఆదరణ లభిస్తోందన్నారు. ఐపీఎల్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ ప్రొకబడ్డీకి ఉందన్నారు. తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తోందని, బాలికలను చదువుతో పాటు క్రీడల్లో పోత్సహిస్తున్నారన్నారు. మహిళలు కూడా దేశ ప్రతిష్టను పెంచే కీడానైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని చెప్పారు. పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, సానియా మీర్జా వంటి క్రీడాకారిణులు దేశప్రతిష్టను అంతర్జాతీయ స్థా యికి తీసుకెళ్లారని కొనియాడారు. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీస్థాయి విద్యార్థినులు చదువుతో పాటు నచ్చిన క్రీడకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
క్రీడలకు ప్రాధాన్యం : వీసీ రామ్‌జీ
బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ మా ట్లాడుతూ వర్సిటీలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యమన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి అంతర విశ్వవిద్యాలయాల క్రీడల నిర్వహణ, జాతీయస్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వర్సిటీలో క్రీడా వసతు ల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరిం చారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ కె.రఘబాబు, ప్రిన్సిపాల్ గుంట తులసీరావు, పాలక మండలి సభ్యులు తమ్మినేని కామరాజు, బిడ్డిక అడ్డయ్య, బరాటం లక్ష్మణరావు, పొన్నాల జయరాం, వర్సిటీ పీడీ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి సుందరరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆరు జట్లు హాజరు
అంతర వర్సిటీ మహిళల కబడ్డీ పోటీలకు ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన జట్లు హాజరయ్యా యి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ కాకినాడ, నాగార్జునా విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాల యం జట్లు హాజరయ్యాయి. లీగ్, నా కౌట్ దశల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఏయూ, శ్రీ కృష్ణా విశ్వవిద్యాలయం మధ్య జరిగిన పోటీలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విజయం సాధించిం ది. అలాగే నాగార్జునా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ కాకినాడ మధ్య జరిగిన పోటీలో నాగార్జునా విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ కాకినాడ మధ్య జరిగిన పోటీల్లో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణ, నన్నయ్య విశ్వవిద్యాలయం మధ్య జరి గిన పోటీల్లో నన్నయ్య విశ్వవిద్యాలయం జట్లు విజయం సాధించాయి. క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. మ్యాట్‌లతో కోర్టు తయారు చేశారు. ఫ్లడ్ లైట్లు వెలుగులో సాయంత్రం పోటీలు జరిగాయి. సాయంత్రం క్రీడాకారిణులు క్యాంప్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. క్రీడాకారినులు ఉత్సాహంగా చేసిన నృత్యాలు అలరించాయి.
కబడ్టీ పోటీల్లో గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆంధ్రా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య వర్సిటీ మధ్య పోటీ ఉత్కంఠంగా సాగింది. మ్యా చ్ డ్రాగా (32–32 సాయింట్లు సాధించి) ముగి సింది. లీగ్ మ్యాచ్‌లో ప్రతిభ ఆధారంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ సెమీస్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment