BRAU
-
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రస్థాయి అంతర విశ్వవిద్యాలయాల మహిళల కబడ్డీ పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహం గా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వేదిక జరుగుతున్న పోటీలను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు అంతర్జాతీయ క్రీడాకారిణులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కబడ్డీకి మంచి ఆదరణ ఉందన్నా రు. పురుషులతో సమానంగా మహిళల కబడ్డీకి ఆదరణ లభిస్తోందన్నారు. ఐపీఎల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ ప్రొకబడ్డీకి ఉందన్నారు. తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తోందని, బాలికలను చదువుతో పాటు క్రీడల్లో పోత్సహిస్తున్నారన్నారు. మహిళలు కూడా దేశ ప్రతిష్టను పెంచే కీడానైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని చెప్పారు. పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, సానియా మీర్జా వంటి క్రీడాకారిణులు దేశప్రతిష్టను అంతర్జాతీయ స్థా యికి తీసుకెళ్లారని కొనియాడారు. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీస్థాయి విద్యార్థినులు చదువుతో పాటు నచ్చిన క్రీడకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడలకు ప్రాధాన్యం : వీసీ రామ్‌జీ బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ మా ట్లాడుతూ వర్సిటీలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యమన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి అంతర విశ్వవిద్యాలయాల క్రీడల నిర్వహణ, జాతీయస్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వర్సిటీలో క్రీడా వసతు ల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరిం చారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ కె.రఘబాబు, ప్రిన్సిపాల్ గుంట తులసీరావు, పాలక మండలి సభ్యులు తమ్మినేని కామరాజు, బిడ్డిక అడ్డయ్య, బరాటం లక్ష్మణరావు, పొన్నాల జయరాం, వర్సిటీ పీడీ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి సుందరరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆరు జట్లు హాజరు అంతర వర్సిటీ మహిళల కబడ్డీ పోటీలకు ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన జట్లు హాజరయ్యా యి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కాకినాడ, నాగార్జునా విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాల యం జట్లు హాజరయ్యాయి. లీగ్, నా కౌట్ దశల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఏయూ, శ్రీ కృష్ణా విశ్వవిద్యాలయం మధ్య జరిగిన పోటీలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విజయం సాధించిం ది. అలాగే నాగార్జునా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కాకినాడ మధ్య జరిగిన పోటీలో నాగార్జునా విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కాకినాడ మధ్య జరిగిన పోటీల్లో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణ, నన్నయ్య విశ్వవిద్యాలయం మధ్య జరి గిన పోటీల్లో నన్నయ్య విశ్వవిద్యాలయం జట్లు విజయం సాధించాయి. క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. మ్యాట్లతో కోర్టు తయారు చేశారు. ఫ్లడ్ లైట్లు వెలుగులో సాయంత్రం పోటీలు జరిగాయి. సాయంత్రం క్రీడాకారిణులు క్యాంప్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. క్రీడాకారినులు ఉత్సాహంగా చేసిన నృత్యాలు అలరించాయి. కబడ్టీ పోటీల్లో గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆంధ్రా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య వర్సిటీ మధ్య పోటీ ఉత్కంఠంగా సాగింది. మ్యా చ్ డ్రాగా (32–32 సాయింట్లు సాధించి) ముగి సింది. లీగ్ మ్యాచ్‌లో ప్రతిభ ఆధారంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ సెమీస్‌కు చేరుకుంది. -
బీఆర్ఏయూలో వర్కుషాపు నేడు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు కూర్పు అంశాలపై బుధవారం వర్కుషాపు నిర్వహించనున్నట్టు విభాగాధిపతి తమ్మినేని కామరాజు, ఈవెంట్ కన్వీనర్ నీలం సంతోష్ రంగనాథ్ చెప్పారు. ఎంబీఏ, ఎంకాం విద్యార్థులు ఈ వర్కుషాపులో పాల్గొంటారన్నారు. విద్యార్థులు నైపుణ్య ప్రదర్శనలు ఆధారంగా 30 రకాలు ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు అభివృద్ధికి దోహదపడేలా ఈ కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు. -
సమ్మెకు దిగిన బీఆర్‌ఏయూ కాంట్రాక్టు అధ్యాపకులు
ఎచ్చెర్ల: కాంట్రాక్టు అధ్యాపకులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోసియేట్లు, టీచింగ్ అసిస్టెంట్లు సోమవారం సమ్మెకు దిగారు. రాష్ట్ర ఐక్య కార్యాచరణ యూనియన్ పిలు పు మేరకు తరగతులు బహిష్కరించారు. తరగతి గదులు, రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళాలు వేశారు. అనంతరం వర్సిటీ ముందు ఆందోళన చేశారు. సహాయ ఆచార్యులు పోస్టుల నియామ కానికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేకమైనదంటూ నినదించారు. డాక్టరేట్, నెట్, స్లెట్ వంటి అర్హతలతో ఏళ్లకొద్దీ పనిచేస్తున్న వారికి అన్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో ఉద్యమం ఉద్ధతం చేస్తామని, కోర్టులను సైతం అశ్రయిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావులను కలిసి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు బోధకుల నిరసన ను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం, డాక్టర్ కాయలు కష్ణమూర్తి, రోణంకి శ్రీధర్, డాక్టర్ జేఎల్ సంధ్యారాణి తదితరలు పాల్గొన్నారు. -
లక్ష్యనిర్ధేశం ఉంటే ర్యాగింగ్‌కు దూరం
ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య ఎచ్చెర్ల: లక్ష్యం ఉన్న విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటారని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అన్నారు. ‘వర్సిటీలో విద్యార్థులపై ర్యాగింగ్ మానసిక ప్రభావం’ అనే అంశంపై ఒక రోజు అవగాహన తరగతి గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీలో విద్యార్థులు ఎందుకు అడుగుపెట్టారు, తల్లిదండ్రులు పిల్లలను ఏ ఆశయంతో చదివిస్తున్నారు అనే అంశాలపై సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. ర్యాగింగ్ చేయడం సైతం ఒక మానసిక రోగంగా చెప్పారు. నిర్థిష్ట లక్ష్యంతో కళాశాలల్లో చేరే విద్యార్థులపై ర్యాగింగ్ ప్రభావం చూపుతుందని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరలేడని, ర్యాగింగ్ బాధిత వ్యక్తి మానసికంగా చదువుపై దృష్టి పెట్టలేడన్నారు. బీఆర్‌ఏయూ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తులను క్షమించేది లేదని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు మాట్లాడుతూ వర్సిటీలో ర్యాగింగ్‌కు తావు లేకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థుల మానసిక పరిస్థితి, బాధితుల మానసిక సంఘర్షణపై విద్యా విభాగం మానసిక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎల్ సంధ్యారాణి విద్యార్థులకు వివరించారు. -
పీజీ కోర్సులకు బయోమెట్రిక్
ఈ ఏడాది నుంచే అమలుకు ఉన్నత విద్యామండలి యత్నం ఎంబీఏ కోర్సులపై ఎక్కువ ప్రభావం ప్రస్తుతం దూర విద్య కోర్సుల్లా కొనసాగుతున్న పీజీ కోర్సులు ఎచ్చెర్ల: కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు అయిదేళ్ల నుంచి ప్రతి పాదనల దశలోనే ఉంది. అమలుకు మాత్రం నోచుకోలేదు. ఈ ఏడాది ఎలాగైనా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తప్పనిసరిగా పీజీ, యూజీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఉన్నత విద్యామండలి యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలు సైతం ఏఫిలియేష న్ కమిటీలకు నోటీసులు జారీ చేశాయి. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తే ప్రవేశాలపై తీవ్ర ప్రభావం తప్పదని కళాశాలలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పీజీ కోర్సులు చాలా వరకు దూర విద్య కంటే దారుణంగా నడుస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు మాత్రమే విద్యార్థులు రాస్తున్నారు. అంతకు మించి కళాశాలలకు వెళ్లడం లేదు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తే చాలా కళాశాలలు పీజీ కోర్సులు రద్దు చేసుకోవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మాత్రమే ఇకపై పీజీ కోర్సుల్లో చేరవలసి ఉంటుంది. అధిక శాతం ఎంబీఏ కళాశాలలు పీజీ కోర్సులకు సంబంధించి ఎంబీఏ జిల్లాలో ఎక్కువ కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఎనిమిది కళాశాలల్లో 600 సీట్లు ఉన్నాయి. గత ఏడాది మొత్తం సీట్లు నిండగా, ఈ ఏడాది ప్రవేశాలు కౌన్సెలింగ్ దశలో ఉంది. ప్రైవేట్ కళాశాలలు మాత్రం బయోమెట్రిక్ అమలు సాధ్యం కాదని, తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని అంటున్నారు. అయితే బయోమెట్రిక్ అమలు చేస్తే 50 శాతం ప్రవేశాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఎం.ఫార్మశీ, ఎంటెక్, ఎల్ఎల్ఎం వంటి కోరుసల్లో ప్రవేశాలు ఘణనీయింగా తగ్గిపోతాయి. ఎం.పార్మశీ రెండు కళాశాలల్లో నిర్వహిస్తుండగా, ఎంటెక్ ఏడు కళాశాలల్లో, ఎల్ఎల్ఎం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రైవేటుగా ఉద్యోగాలు చేసున్న వారే ఈ కోర్సులు చేస్తున్నారు. దూర విద్య ద్వారా చేస్తే పాస్ శాతం, మార్కులు శాతం పీజీ కోర్సుల్లో తక్కుగా ఉంటుంది. రెగ్యులర్ కోర్సుల్లో మార్కులతో పాటు కొన్ని కళాశాలల్లో చూసిరాతను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఈ రెండు అంశాల వల్ల పీజీ కోర్సులకు డిమాండ్ ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారు ఎక్కువగా ఎంబీఏకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఎంబీఏ తరగతులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీతో పాటు, మరో రెండు కళాశాలల్లో మాత్రమే పక్కాగా తరగతులు నిర్వహిస్తున్నారు. మిగతా కళాశాలలో దూరవిద్యా కోర్సు కంటే ఆధ్వానంగా నిర్వహిస్తున్నారు. 75 శాతం హాజరు ఉంటేనే రీయింబర్స్మెంట్ బయోమెట్రిక్ పక్కాగా అమలు చేస్తే 75 శాతం హాజరు ఉంటేనే రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ సాధ్యం. కనీసం 65 శాతం ఉంటేనే పరీక్షలకు అనుమతి సాధ్యం అవుతుంది. బయోమెట్రిక్ అమలు చేస్తే విద్యార్థి ప్రవేశాన్ని ఆధార్‌తో సీడింగ్ చేస్తారు. జాతీయ సమాచార కేంద్రం పలు సంస్థలకు బయోమెట్రిక్ అనుసంధానం చేస్తుంది. ఉన్నత విద్యా మండలి, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వర్సిటీలు ఇలా అన్ని విభాగాలు అనుసంధానం చేస్తే విద్యార్థులు హాజరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. దాదాపుగా విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా చదవడం సాధ్యం కాదు. బయోమెట్రిక్ హాజరు ఈ ఏడాది అమలు అవుతుందో... లేదో, ప్రవేశాలపై ఎటు వంటి ప్రభావం చూపుతుందో నిరీక్షించవలసిదే. అయితే మొదటి ఏడాదిలో తప్పని సరిగా అమలు చేయాలని రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ భారం తగ్గించుకోవాలన్న అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు అమలు చేయడం సాధ్యం అయ్యే పరిస్థికాదన్నది కళాశాలల భావన. -
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: కలెక్టర్
ఎచ్చెర్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో బుధవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పీజీ, ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్, గ్రూప్స్ పరీక్షపై విద్యార్థులకు అవగాహన అవసరమన్నారు. క్రమ శిక్షణ, పట్టుదల, లక్ష్యం, విషయ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు సివిల్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా యూపీఎస్సీ, ఎపీపీఎస్సీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య మట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు సివిల్స్ వంటి అత్యున్నత సర్వీసులకు ఎంపిక అవుతున్నారని, పేద విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు, ఐటీడీఏ పీవో వెంకటరావు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు పాల్గొని మాట్లాడారు. -
నైపుణ్యతతోనే ఉన్నత స్థాయి
ఎచ్చెర్ల: నైపుణ్యాలు ఉన్న విద్యార్థులు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారని మలేషియాకు చెందిన యూఎస్ఎం వర్సిటీ ప్రొఫెసర్ ఎం.బాలరాజు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సోషల్ వర్కు, రూరల్ డెవలప్మెంట్, ఎంఎడ్, ఎకనామిక్స్ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలపై సోమవారం ఒక్క రోజు వర్కుషాపు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సంపూర్ణ విషయ పరిజ్ఞానంతో ముందుకు సాగాలన్నారు. ఎంటర్ ప్రన్యూర్ షిప్, సోషల్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం ఎంతగానో అవసరమని చెప్పారు. కష్టపడే విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు యు.కావ్యజ్యోత్స, డాక్టర్ జే ఎల్ సంధ్యారాణి, డి.వనజ, మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు. -
మారిన ఫిజిక్స్ ప్రశ్నపత్రం
ఎచ్చెర్ల: బీఆర్ఏయూలో శుక్రవారం నిర్వహించిన ఫిజిక్స్ పరీక్షలో ప్రశ్నపత్రం తారుమారైంది. ఫిజిక్స్ ప్రశ్నపత్రానికి బదులు బీబీఎం కోర్సుకు సంబంధించిన సేల్స్మేనేజ్మెంట్ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. తప్పిదాన్ని గుర్తించిన వర్సిటీ అధికారులు వెంటనే ప్రశ్నపత్రాలను వెనుకకు తీసుకున్నారు. వర్సిటీ పరీక్ష కేంద్రంగా డిగ్రీ చివరి ఏడాదిలో ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన 761 మంది విద్యార్థులకు ఇన్స్టెంట్ పరీక్ష నిర్వహించారు. వీరిలో 752 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫిజిక్స్ సబ్జెక్టులో 73 మంది ఫెయిల్ కాగా 69 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఫిజిక్స్ ప్రశ్నపత్రాలు అని రాసి ఉన్న బండిల్స్‌ను తెరచి ఇన్విజిలేటర్లకు వర్సిటీ అధికారులు అందజేశారు. అందులో ఫిజిక్స్-3 ప్రశ్నపత్రంకు బదులుగా బీబీఎం కోర్సుకు సంబంధించిన సేల్స్ మేనేజ్మెంట్ ప్రశ్నపత్రం ఉంది. వీటిని చూసుకోకుండా విద్యార్థులకు అందజేయడంతో సమస్యతలెత్తింది. అధికారులు అందజేసిన సేల్స్ మేనేజ్మెంట్ సబ్జెక్టు ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారి జాబితాలో సైతం లేదు. ఈ ప్రశ్న పత్రాలు పెద్దమొత్తంలో ప్రచురించి ఎలా అందజేశారన్నది చర్చనీయాంశంగా మారింది. అదనపు సెట్ లు సైతం పరీక్షల నిర్వహణ కేంద్రంలో అందుబాటులో లేవు. దీంతో డిజైన్ ప్రశ్నపత్రాన్ని జిరాక్సులు తీసి విద్యార్థులకు అంజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.30కు ఆరంభం కావడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు అదనపు సమయం కేటాయించినా సాయంత్రం ఫిజిక్స్-4 పరీక్ష రాసేందుకు ఇబ్బంది పడ్డారు. తొందరలో ఏమరపాటు... డిగ్రీ చివరి ఏడాది ఒక్క సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులందరికీ శుక్రవారం పరీక్ష నిర్వహించి శనివారం ఫలితాలు వెల్లడించేందుకు వర్సిటీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈనెల 3 నుంచి పీజీ ప్రవేశాలకు సంబంధించిన ఆసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు విద్యార్థులకు డిగ్రీ ప్రొవిజనల్స్, మార్కులు జాబితాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రయత్నంలో ఫిజిక్స్ ప్రశ్నపత్రం మారడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. మిగిలిన సబ్జెక్టుల విద్యార్థులు సజావుగా పరీక్షను పూర్తిచేశారు. పరీక్షలను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజులు పర్యవేక్షించారు. -
‘అంబేద్కర్’పై చిన్నచూపు!
ఎచ్చెర్ల : గ్రామీణ యూనివర్సిటీగా చెప్పుకునే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూసింది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నామమాత్రం నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో కంటే భారీగా కోత విధించడం అందరినీ విస్మయూనికి గురి చేసింది. వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం కావటం, స్థానిక వర్సిటీకి కనీసం 12-బీ గర్తింపు లేక పోవటం, మౌలిక వసతుల కొరత వెంటాడటంతో ప్రభుత్వం నిధుల కేటాయింపు లో ప్రాధాన్యం ఇస్తుందని అందరూ భావించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్లో భారీగా నిధులు మంజూరు చేస్తోందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రంమొండిచేయి చూపింది. బడ్జెట్ కేటాయింపులో కోత విధించింది. కేవలం రూ. 2.43 కోట్లు మాత్రమే కేటాయించి తన వివక్షతను చాటింది. దీంతో మరోసారి జిల్లా యూనివర్సిటీ వివక్షకు గురైంది. 12-బీ గుర్తింపు ఉండి యూజీసీ నుంచి నిధులు సంమృద్ధిగా వస్తున్న ఆంధ్రా, శ్రీవెంకటేశ్వరా, పద్మావతి, శ్రీకృష్ణదేవరాయ, యోగివేమన, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం, నాగార్జునా వంటి వర్సిటీలకు బడ్జెట్లో మెరుగైన నిధులు కేటాయించిన సర్కార్ గ్రామీణ నేపథ్యం ఉన్న బీఆర్‌ఏయూ కు మాత్రం అన్యాయం చేయడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రస్తుతం వర్సిటీకి కేటాయించిన నిధులు మంజూరు పరిశీలిస్తే భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ఫుడ్ పార్క్ వంటివి వస్తాయూ అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ ఉచ్ఛారత్ శిక్షా అభియాన్ వంటి పథకాలపైనే వ ర్సిటీ పూర్తిగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. వర్సిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే కనీసం రూ. 80 కోట్లు అవసరం ఉంది. రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ . 20 కోట్లు మంజూరు చేసినా కొంత ఊరట కలిగేది. మరీ దయనీ యంగా నిధుల కేటాయింపు ఉండటం వర్సిటీ అభివృద్ధిపై తీవ్రప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూ రు కాకపోతే బీఆర్‌ఏయూ ప్రగతికి అవరోధం తప్పదని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. 2010-11లో తప్ప వర్సిటీకి ఇంత తక్కువ కేటాయిం పులు ఎప్పుడూ జరగ లేదు. 2013-14 బడ్జెట్‌తో పోల్చి చూస్తే కేటాయింపుల్లో భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.బీఆర్‌ఏయూ 2008 జూన్ 25న ప్రారంభమైంది. అప్పటి నుంచి బడ్జెట్లో కేటాయింపులు ఇలా ఉన్నాయి... -
బీఆర్ఏయూలో పెరిగిన ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సులో ప్రవేశాలు పెరిగాయి. దాదాపు పదేళ్ల తర్వాత ప్రవేశాలు పెరగటం గమనార్హం. ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఆచార్యులు ఉన్నా.. అప్పటి నుంచే అడ్మిషన్లు తగ్గుతూ వచ్చాయి. ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వీసీగా బాధ్యతలు చేపట్టాక అన్ని కోర్సుల ప్రవేశాలపై దృష్టి పెట్టా రు. బోధకులను భాగస్వాములుగా చేయటంతోపాటు కాంట్రాక్ట్ టీచింగ్ అసోసియేట్లను కోర్సు కోఆర్డినేటర్లుగా నియమించారు. లా విభాగం మార్గదర్శకులుగా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ డాక్టర్ గురుగుబెల్లి యతిరాజులు, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివ ర్సిటీ(విశాఖపట్నం) చాన్సలర్ ఎ.లక్షీనాథ్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పప్పల జగన్నాథరావులను నియమించారు. ఏడు రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చర్యల వల్ల ప్రవేశాలు మెరుగుపడ్డాయి. వర్సిటీలో 80 సీట్లుండగా తొలి విడత కౌన్సెలింగ్‌లో 45 మందికి అలాట్మెంట్ లభించింది. నవంబర్ 5,6 తేదీల్లో రెండోవిడత కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్లు ఉండటం తో మరింతమంది చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం సెకండియర్‌లో 12 మంది, ఫైనలియర్లో ఆరుగులు విద్యార్థులున్నారు. ఎల్ఎల్ఎం కోర్సు ప్రారంభం వర్సిటీలో ఈ ఏడాది ఎల్ఎల్ఎం కోర్సు ను ప్రారంభించారు. ప్రారంభంలో ఉన్నత విద్యామండలి వెబ్ ఆప్షన్లలో ఈ కోర్సు లేదు. దీంతో వీసీ ఉన్నత విద్యామండలి అధికారులతో మాట్లాడి కోర్సు ప్రారంభానికి చర్యలు చేపట్టారు. 20 సీట్లు ఉండగా ప్రస్తుతం ఆరుగురి అలాట్మెంట్ లభించింది. వర్సిటీలోని న్యాయ విభాగాన్ని బలపేతం చేయటానికి వీసీ సలహాలు, సూచనలతో చర్యలు తీసుకుంటున్నామని కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సరోజనమ్మ చెప్పారు.