ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో ప్రవేశాలు పెరిగాయి. దాదాపు పదేళ్ల తర్వాత ప్రవేశాలు పెరగటం గమనార్హం. ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఆచార్యులు ఉన్నా.. అప్పటి నుంచే అడ్మిషన్లు తగ్గుతూ వచ్చాయి. ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వీసీగా బాధ్యతలు చేపట్టాక అన్ని కోర్సుల ప్రవేశాలపై దృష్టి పెట్టా రు. బోధకులను భాగస్వాములుగా చేయటంతోపాటు కాంట్రాక్ట్ టీచింగ్ అసోసియేట్లను కోర్సు కోఆర్డినేటర్లుగా నియమించారు. లా విభాగం మార్గదర్శకులుగా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ డాక్టర్ గురుగుబెల్లి యతిరాజులు, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివ ర్సిటీ(విశాఖపట్నం) చాన్సలర్ ఎ.లక్షీనాథ్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పప్పల జగన్నాథరావులను నియమించారు. ఏడు రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చర్యల వల్ల ప్రవేశాలు మెరుగుపడ్డాయి. వర్సిటీలో 80 సీట్లుండగా తొలి విడత కౌన్సెలింగ్‌లో 45 మందికి అలాట్‌మెంట్ లభించింది. నవంబర్ 5,6 తేదీల్లో రెండోవిడత కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్లు ఉండటం తో మరింతమంది చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం సెకండియర్‌లో 12 మంది, ఫైనలియర్‌లో ఆరుగులు విద్యార్థులున్నారు.
ఎల్‌ఎల్‌ఎం కోర్సు ప్రారంభం
వర్సిటీలో ఈ ఏడాది ఎల్‌ఎల్‌ఎం కోర్సు ను ప్రారంభించారు. ప్రారంభంలో ఉన్నత విద్యామండలి వెబ్ ఆప్షన్లలో ఈ కోర్సు లేదు. దీంతో వీసీ ఉన్నత విద్యామండలి అధికారులతో మాట్లాడి కోర్సు ప్రారంభానికి చర్యలు చేపట్టారు. 20 సీట్లు ఉండగా ప్రస్తుతం ఆరుగురి అలాట్‌మెంట్ లభించింది. వర్సిటీలోని న్యాయ విభాగాన్ని బలపేతం చేయటానికి వీసీ సలహాలు, సూచనలతో చర్యలు తీసుకుంటున్నామని కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సరోజనమ్మ చెప్పారు.
బీఆర్‌ఏయూలో పెరిగిన ఎల్‌ఎల్‌బీ ప్రవేశాలు
Published Thu, Oct 31 2013 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement