echarla
-
ఇక కళా వెంకట్ర్రావు అక్రమాలు చెల్లవు
-
విగ్రహ వివాదం
ఎచ్చెర్ల క్యాంపస్/శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్: ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం పంచాయతీ పరిధి సింహద్వారం సమీపంలో జాతీయ రహదారి డివైడర్‌పై బుధవారం రాత్రి టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటుచేయడంపై ఎన్‌హెచ్-16 సిబ్బంది పోలీసులు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుచేసే స్థలాన్ని శ్రీకాకుళం ఆర్డీవో జి.గణేష్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్‌లు గురువారం పరిశీలించారు. నోటీసు జారీ చేసి తొలగించే చర్యలు చేపట్టాలని ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావును ఆదేశించారు. అనుమతి లేనిదే విగ్రహం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయకూడదని, జాతీయ రహదారి మధ్యన విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విగ్రహం తొలగించి ఎన్టీఆర్ ఎంహెచ్‌స్కూల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదిరి నారాయణమూర్తి, నాయకులు బొచ్చ కోటిరెడ్డి, చౌదిరి అవినాష్, బెండు మల్లేష్లు తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అందరి విగ్రహాలు ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయని, ఈ విగ్రహం ఉంటే తప్పేమిటని అధికారులను నిలదీశారు. విగ్రహం తొలగించే చర్యలు చేపడితే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కనీసం అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు మాత్రం విగ్రం వేరేచోటుకి మార్చేందుకు అంగీకరించలేదు. నవంబర్ 2న విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని బాబ్జి, పీవీ రమణ, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు తదితరులు స్పష్టంచేశారు. ఈ నేపధ్యంలో అధికారులు నిబంధనలు పాటిస్తారా? టీడీపీ నాయకులు అనుకున్నది సాధిస్తారా? అన్న ప్రశ్నలు అందరిలోనూ మెదలుతున్నాయి. ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు అక్రమంగా విగ్రహం ఏర్పాటుచేశారంటూ ఆర్డీవో, తహశీల్దార్ ఆదేశాల మేరకు కుశాపురం పంచాయతీ గ్రామ కార్యదర్శి మనోరమ ఎచ్చెర్ల పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉదయ్‌కుమార్ చెప్పారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలి శ్రీకాకుళం కలెక్టరేట్: ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం చూసుకోవాలని ఏజేసీ ఆర్.ఎస్ రాజ్‌కుమార్ టీడీపీ నాయకులకు సూచించారు. విగ్రహావిష్కకరణ నిలుపుదలపై టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎవరికైనా నిబంధనల మేరకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. -
బీఆర్ఏయూలో పెరిగిన ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సులో ప్రవేశాలు పెరిగాయి. దాదాపు పదేళ్ల తర్వాత ప్రవేశాలు పెరగటం గమనార్హం. ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఆచార్యులు ఉన్నా.. అప్పటి నుంచే అడ్మిషన్లు తగ్గుతూ వచ్చాయి. ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వీసీగా బాధ్యతలు చేపట్టాక అన్ని కోర్సుల ప్రవేశాలపై దృష్టి పెట్టా రు. బోధకులను భాగస్వాములుగా చేయటంతోపాటు కాంట్రాక్ట్ టీచింగ్ అసోసియేట్లను కోర్సు కోఆర్డినేటర్లుగా నియమించారు. లా విభాగం మార్గదర్శకులుగా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ డాక్టర్ గురుగుబెల్లి యతిరాజులు, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివ ర్సిటీ(విశాఖపట్నం) చాన్సలర్ ఎ.లక్షీనాథ్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పప్పల జగన్నాథరావులను నియమించారు. ఏడు రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చర్యల వల్ల ప్రవేశాలు మెరుగుపడ్డాయి. వర్సిటీలో 80 సీట్లుండగా తొలి విడత కౌన్సెలింగ్‌లో 45 మందికి అలాట్మెంట్ లభించింది. నవంబర్ 5,6 తేదీల్లో రెండోవిడత కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్లు ఉండటం తో మరింతమంది చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం సెకండియర్‌లో 12 మంది, ఫైనలియర్లో ఆరుగులు విద్యార్థులున్నారు. ఎల్ఎల్ఎం కోర్సు ప్రారంభం వర్సిటీలో ఈ ఏడాది ఎల్ఎల్ఎం కోర్సు ను ప్రారంభించారు. ప్రారంభంలో ఉన్నత విద్యామండలి వెబ్ ఆప్షన్లలో ఈ కోర్సు లేదు. దీంతో వీసీ ఉన్నత విద్యామండలి అధికారులతో మాట్లాడి కోర్సు ప్రారంభానికి చర్యలు చేపట్టారు. 20 సీట్లు ఉండగా ప్రస్తుతం ఆరుగురి అలాట్మెంట్ లభించింది. వర్సిటీలోని న్యాయ విభాగాన్ని బలపేతం చేయటానికి వీసీ సలహాలు, సూచనలతో చర్యలు తీసుకుంటున్నామని కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సరోజనమ్మ చెప్పారు. -
కారును ఢీకొన్న లారీ కారు డ్రైవర్‌కు గాయాలు
లావేరు,న్యూస్‌లైన్: లావేరు మండలంలో బొంతుపేట గ్రామం వద్ద జాతీయరహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ ఎం.నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... బొంతుపేట గ్రామం వద్ద డిపో నుంచి సరుగుడు కర్రలతో లారీ వస్తోంది. ఇది జాతీయ రహదారిపై ఎక్కుతున్నప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెథ్తున్న కారును ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. గాయపడిన డ్రైవర్‌ను వెంటనే 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. హైవేపై ప్రమాదం జరగడంతో వాహనాలు రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న వెంటనే లావేరు పోలీస్ స్టేషన్ హెచ్‌సీలు దేవదానం, రాంబాబు, రామరాజులు ప్రమాద స్థలానికి వెళిలరహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలు తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వీరు తెలిపారు. -
బడివానిపేటలో ప్రబలిన జ్వరాలు
ఎచ్చెర్ల, న్యూస్‌లైన్: ఎచ్చెర్ల మండలంలోని మత్స్యకార గ్రామమైన బడివానిపేటలో నెల రోజులుగా చాలా మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితులు ఉన్నారు. చికిత్స కోసం ఎక్కువ మంది స్థానిక సంచి వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జ్వరాలు తీవ్రత పెరిగిన వారు శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. వైద్య సేవలు పొందినప్పటికీ జ్వరాలు తగ్గకపోవడంతో వీరంతా ఆవేదన చెందుతున్నారు. రోజూ గ్రామం నుంచి కనీసం ముగ్గురు వైద్య సేవల నిమిత్తం శ్రీకాకుళం వెళ్తున్నారు. ప్రస్తుతం మైలపల్లి ఎర్రయ్య, వారది లక్ష్మి, బడే బోడినాయుడుతో పాటు పలువురు పట్టణంలో చికిత్స పొందుతున్నారు. గామంలో బడే లక్ష్మి, రాములమ్మ, నారాయణ, వారది ఎల్లమ్మ, ఆదినారాయణ, వారది రాములతో పాటు సుమారు 50 మందికి పైగా జ్వరంతో బాధపడుతూ సంచి వైద్యల వద్ద చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం పొన్నాడ వైద్య సిబ్బంది ఇక్కడ తూతూ మంత్రంగా వైద్యసేవలు అందించి వెళ్లిపోయారు. జ్వరాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోలేదు. దీంతో రోజురోజుకీ జ్వర పీడుతులు పెరుగుతున్నారు తప్ప తరగటం లేదని గ్రామస్థులు అంటున్నారు. ఇంట్లో ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని వీరన్నారు. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గి, సుమారు పది మందికి డెంగీ లక్షణాలు కనిపించాయని ప్రైవేటు వైద్యలు తెలుపుతున్నారు. గ్రామంలోని వైద్యశిబిరాలు నిర్వహించి మెరుగైన సేవలను అందించాలని, పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో వైద్యసేవలు అందిస్తున్నామని, విషయాన్ని మెడికల్ ఆపీసర్‌కు తెలిపామని ఏఎన్ఎం ఉమ అన్నారు. నేడు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తామని చెప్పారు. పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆనందపురంలో అదుపులోకి రాని విష జ్వరాలు జి.సిగడాం: జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో విష జ్వరాలు అదుపులోకి రాలేదు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గ్రామంలో 85 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించినప్పటికీ పెద్దగా మార్పు లేకపోవడంతో జ్వర పీడితులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం వైద్యసిబ్బంది రోగులకు సేవలందించారు. వైద్య శిబిరంలో డాక్టర్ పీటీవీ కిరణ్‌కుమార్, సూపర్వైజర్లు సావిత్రమ్మ, త్రినాధ, ఏఎన్ఎంలు అన్నపూర్ణ, సుజాత, ఈశ్వరమ్మ, పార్వతి, చిన్ని, పొందూరు క్లష్టర్ ఆరోగ్య బోధకురాలు విజయలక్ష్మి రోగులకు వైద్యసేవలందించి, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి గున్నబాబు, వజ్జపర్తి రఘురాం తదితరులు ఉన్నారు. సర్పంచ్ పొగిరి ప్రమీలారాణి పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామాల్లో ప్రబలుతున్న డయేరియా మెళియాపుట్టి: మెళియాపుట్టి మండలంలో ఇటీవల పడిన వర్షాలకు చెత్తాచెదారాలు కుళ్లడంతో పాటు, తాగునీటి బావులు నీటి కాలుష్యానికి గురికావడంతో గ్రామస్తులు డయేరియా వ్యాధి బారిన పడుతున్నారు. ఎగువ బందపల్లిలో డయేరియా వ్యాధి ప్రబలింది. చందనగిరి రమేష్, నవీన్, బి.సాంబమూర్తి, గౌతమి వ్యాధి బారిన పడడంతో సోమవారం వీరిని టెక్కలి ఆస్పత్రికి తరలించారు. మంగళవారం గ్రామంలో బి.సింహాద్రి, బి.గౌరమ్మ, గాసమ్మ వ్యాధిబారిన పడ్డారు. వీరికి స్థానిక పీహెచ్సీ సిబ్బంది వైద్య సేవలు అందించారు. చొంపాపురం, ముక్తాపురంలో కరజాడ పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్‌రెడ్డి రోగులను పరీక్షించారు.15 మందికి వైద్య తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు డయేరియా వ్యాధి గ్రస్తులకు వైద్యం అందించారు. జంతూరు గ్రామంలో డయేరియా తగ్గుముఖం పట్టింది. ఎగువ బందపల్లిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. -
పెద్దశ్రీరాంపురంలో పురివిప్పిన పాతకక్షలు
కంచిలి, న్యూస్‌లైన్: మండల పరిధి పెద్దశ్రీరాంపురంలో పాతకక్షలు పురివిప్పాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు దీనికి కారణమయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారి మధ్య తలెత్తిన తగాడా కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనలో నలుగురు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స కోసం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. క్రాంతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. సంఘటనకు సబంధించి వివరాలు ఇవీ... ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. మంగళవారం గ్రామంలోని బల్లెడ వీధిలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిన క్రాంతికుమార్, కృష్ణకుమార్ బైక్‌పై వచ్చారు. అదే వీధిలో నివసిస్తున్న టీడీపీకి చెందిన లమ్మత సంజీవరావు ఇంటి ఎదురుగా వచ్చేసరికి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అది చినికి చినికి గాలివానలా మారి కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనలో క్రాంతి తల, శరీరంపైన తీవ్ర గాయాలు తగిలాయి. కృష్ణమూర్తికి కూడా తల, చేతుల మీద గాయాలయ్యాయి. అలాగే సంజీవరావు, ఆయన భార్య లలిత కూడా గాయపడ్డారు. విషయం తెలిసి సోంపేట సీఐ జి.వి.రమణ, కంచిలి ఎస్ఐ కె.గోవిందరావు సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఇరువర్గాలు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ మాదిన రామారావు, లమ్మత సంజీవరావుతోపాటు 8 మందిపైన, సంజీవరావు ఫిర్యాదు మేరకు క్రాంతి, కృష్ణమూర్తి, రాంప్రసాద్ సహా 8 మందిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని కాంగ్రెస్ వర్గీకులను ఆ పార్టీ నాయకులు నర్తు రామారావు, ఇప్పిలి కృష్ణారావు, కొల్లి ఈశ్వరరావు, పిలక చిన్నబాబు, దుర్గాసి ధర్మారావు, టీడీపీ వర్గీయులను బంగారు కురయ్య, జగదీష్ పట్నాయక్ పరామర్శించారు. ఆధిపత్య పోరే గొడవకు కారణం పంచాయతీపై పట్టుకోసం ఇరు పార్టీల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరుసాగుతోంది. పంచాయతీ ఎన్నికలు పరిస్థితి విషమించేలా చేశాయి. కొంతకాలంగా ఇరువర్గాలు ఘర్షణలు దిగుతునే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు బల్లెడ సుమన్ మీద టీడీపీకి చెందిన మాదిన రామారావు గెలుపొందారు. ఎప్పుడూ ఏకపక్షంగా సాగే ఎన్నికలు ఈసారి రసవత్తర పోటీ జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండేది. ఈనేపథ్యంలో మంగళవారం కొట్లాట జరిగింది. గ్రామంలో కొద్ది రోజులుగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. గ్రామంలో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
అతివేగం మిగిల్చిన విషాదం
రేగులపాడు(వీరఘట్టం), న్యూస్‌లైన్: ఓ వ్యాన్ డ్రైవర్ అతివేగంగా వ్యాన్ నడిపి రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాడు. మరి కొన్ని నిరుపేదల బతుకులు రోడ్డునపడే పరిస్థితి కల్పించాడు. వయసుపైబడినా చేతనైన పనిచేస్తూ కుమార్తె కుటుంబానికి ఆసరాగా ఉన్న ఓ వృద్ధురాలిని బలిగొన్నాడు. శేషజీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి ఉసురు తీసి ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే... వీరఘట్టం మండలం రేగులపాడు జంక్షన్లో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పెంకి చిన్నతల్లి(70), అంపావల్లి శ్రీరామ్మూర్తి(72) దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌లో ఉన్న 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వీరందరినీ శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించగా వారిలో ఇద్దరిని విశాఖపట్నంకు రిఫర్ చేశారు. అతివేగంగా వస్తున్న వ్యాన్ డ్రైవర్ రోడ్డు దాటుతున్న చిన్నతల్లిని తప్పించబోయి మొదట వృద్ధురాలిని ఆ తర్వాత రోడ్డు పక్కన బస్సు కోసం నిల్చున్న శ్రీరామ్మూర్తిని ఢీకొట్టాడు. వీరిద్దరు సంఘటన స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆతర్వాత రోడ్డు పక్కన ఉన్న చెట్టుపైకి దూసుకువెళ్లడంతో వ్యాన్‌లో ఉన్న లోచర్ల గంగరాజు, సిరిపురం సుమన్, భోగాది నాగరాజు, బొబ్బిలి లక్షుంనాయుడు, బూసపు సింహాచలం, చాట్ల చంద్రమౌళి, మోసూరు రాము, కోరూడు చంద్రరావు, గుడాల శ్రీను, మండలంలోని విక్రంపురానికి చెందిన సాదు శివకుమార్, సాదు విశ్వేశ్వరరావు, బూర్జ మండలం మదనాపురానికి చెందిన దుప్పాడ గౌరునాయుడు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. వీరిలో గంగరాజు, సుమన్, శ్రీను, నాగరాజు, గౌరునాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం తరలించారు. గంగరాజు, సుమన్‌కు మెరుగైన వైద్యం కోసం విశాఖకు రిఫర్ చేశారు. ప్రమాదం ఇలా జరిగింది రేగులపాడుకు చెందిన చిన్నతల్లి పొలంలో వరినాట్లు వేసే పనికోసం వెళుతూ రోడ్డు దాటుతోంది. అదే సమయంలో అతివేగంగా వస్తున్న వ్యాన్ ఆమెను తప్పించబోయి అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. చిన్నతల్లి శరీరం మీద నుంచి వెళ్లిన వ్యాన్ అదేవేగంతో దూసుకుపోయి వీరఘట్టం వెళ్లడానికి రోడ్డుపై వేచివున్న శ్రీరామ్మూర్తిపై దూసుకుపోయింది. దీంతో ఇద్దరు దుర్మరణంపాలయ్యారు. అనంతరం వ్యాన్ చెట్టుపైకి దూసుకుపోవడంతో అందులో ఉన్న వారంతా రోడ్డుపై, పక్కనే ఉన్న పొలాల్లోకి తుళ్లిపోయారు. వయసుపైబడినా పొలం పనికి... ఈ దుర్ఘటనలో మృతి చెందిన చిన్నతల్లిది పేద కుటుంబమే. భర్త లేడు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గేదెల ఆరుద్రమ్మ ఇంట్లో ఉంటోంది. వయస్సుపైబడినా కుమార్తెను ఆర్థికంగా ఆదుకోడానికి పొలం పనులకు వెళుతోంది. ఈ క్రమంలోనే పొలానికి వెళుతూ మృత్యువాత పడింది. ఆమెకు రమణమ్మ, గొర్లె సావిత్రమ్మ అనే మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా శేషజీవితాన్ని ఆనందంగా సాగిస్తున్న శ్రీరామ్మూర్తి వ్యక్తిగత పనులపై వీరఘట్టం వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డు పక్కన నిలుచున్నారు. ఇంతలో వ్యాన్ ఆయనపైకి దూసుకువచ్చి బలితీసుకుంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు కేశవరావు కత్తులకవిటి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. తండ్రి దుర్మరణ సమాచారం ఫోన్లో తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. శ్రీరామ్మూర్తి భార్య భవానమ్మ నడవలేని స్థితిలో మంచంపై ఉన్నారు. భర్త మృత్యువాతపడ్డారని తెలిసి గుండలవిసేలా విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. క్షతగాత్రుల్లో అధికులు కూలీలే క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కూలీలే. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. వీరంతా వీరఘట్టం నుంచి కొల్లివలసకు నిత్యం పనుల కోసం వెళుతుంటారు. ఈ క్రమంలో వ్యాన్‌లో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. కాగా బస్సులో వెళ్లాల్సిన తండ్రీకొడుకులు విశ్వేశ్వరరావు, శివకుమార్ అనూహ్య పరిస్థితుల్లో ఈ వ్యాన్ ఎక్కారు. సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా బస్సులు సమయపాలన పాటించకపోవడంతో వారు వ్యాన్ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు. పరామర్శకు వచ్చి... బూర్జ మండలం మదనాపురానికి చెందిన గౌరునాయుడుది మరో గాథ. సమీప బంధువు ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యుల పరామర్శకు ఆయన వీరఘట్టం వచ్చారు. బస్సులు లేకపోవడంతో వ్యాన్ ఎక్కి ప్రమాదంబారిన పడ్డారు. పీహెచ్సీ సిబ్బందిపై బాధితుల ఆగ్రహం వీరఘట్టం, న్యూస్‌లైన్:ఆపదసమయంలో క్షతగాత్రులను ఆదుకోవాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం రేగులపాడు జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో సిరిపురం సుమన్, భోగాది నాగరాజు, బొబ్బిలి లక్షుంనాయులను చికిత్స కోసం మొదట స్థానికి పీహెచ్‌సీకే తీసుకువచ్చారు. అప్పటి ఉదయం 9 గంటలయింది. ఆ సమయంలో పీహెచ్సీలో స్టాఫ్ నర్సు మాత్రమే ఉన్నారు. ఇంతలో స్థానిక ప్రైవేట్ వైద్యుడు వెంకటరమణ పీహెచ్‌సీకి వచ్చి స్టాఫ్ నర్సు సహాయంతో ప్రాథమిక చికిత్స చేశారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పీహెచ్సీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై క్షతగాత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమ సారథులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో సకల జనోద్యమంగా మారింది. అన్నివర్గాల ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. రాస్తారోకోలు, మానవహారాలతో నిరసన తెలుపుతున్నారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి కర్మకాండ నిర్వహిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు పలు సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ర్ట నేత ధర్మాన కృష్ణదాస్ అందరికంటే ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని వివిధ కులాలు, ఉద్యోగ సంఘాలవారు నేరుగా ఉద్యమ బాట పడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వారు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు నేత లు మద్దతు పలుకుతున్నారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో సమైక్యాంధ్ర జేఏసీ అగ్రభాగాన ఉంది. గురువారం శ్రీకాకుళం పట్టణంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది. ఉద్యమకారులు మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు, కాలినడకన ర్యాలీలో పాల్గొన్నారు. డే అండ్ నైట్ జంక్షన్లో ఉద్యమకారులు నినాదాలు చేసి నిరసన తెలిపారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. రోడ్డుపై వంటావార్పు చేసి భోజనాలు చేశారు. తెలంగాణ ప్రకటన వెలువడిన రోజు నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. విద్యుత్, జిల్లా పరిషత్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల ఉద్యోగులు కూడా దీక్షలు చేపట్టారు. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ నేతలు సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతుండటంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నీలకంఠంనాయుడు ఒక్కరే రాజీనామా చేయడంతో మిగిలినవారు కూడా అదే బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును ధర్మసందేహం ఇంకా వీడినట్లు లేదు. వెంటనే రాజీనామా చేయాలని పార్టీలోని ముఖ్యనాయకులంతా పట్టుబట్టడంతో ఆయన కూడా నేడో రేపో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజీనామా చేసి ఉద్యమబాట పట్టకుంటే వారి ఇళ్లను ముట్టడించడంతోపాటు ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేసేందుకు సమైక్య వాదులు వ్యూహం రూపొందిస్తున్నారు. ఉద్యమంలో ముందున్న వైఎస్ఆర్ సీపీ సమైక్య ఉద్యమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముందున్నారు. అందరికంటే ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసన్నపేటలో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన పాలు పంచుకుంటున్నారు. సమైక్య ఉద్యమ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల కన్వీనర్ల ఆధ్వర్యం లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్య మం ఈ నెల 12 నుంచి మహోద్యమంగా మారుతుందని నేతలు చెబుతున్నారు. సమ్మెకు పిలుపునిచ్చిన ఎన్జీవోలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ధర్మాన ప్రద్మప్రియతోపాటు అంధవరపు సూరి బాబు, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు. అడపాదడపా కనిపిస్తున్న టీడీపీ నేతలు ఆందోళనల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడక్కడ, అడపాదడపా కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో బ్రాహ్మణులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలతోపాటు టీడీపీవారు కూడా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మాటలకే పరిమితమవుతున్నారని, పెద్దగా ఆందోళనల్లో పాల్గొనటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఐక్య ఉద్యమానికి విద్యార్థులు సన్నద్ధం జిల్లాలో ఇకముందు ఐక్యంగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రణాళిక రూపొం దించారు. ఇప్పటివరకు ఎవరికివారు నేరుగా ఆయా పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. ఇకమీదట ఐక్యంగా ఉద్య మ పథంలో నడవాలని నిర్ణయించారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీలో ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. కమిటీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేసి వివిధ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులతో మాట్లాడించి అందరినీ చైతన్యవంతం చేస్తున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
పాతపట్నం,న్యూస్‌లైన్: నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నం మండలంలో గత కొద్ది కాలంగా టీడీపీ శ్రేణుల మధ్య వర్గపోరు ఊపందుకొంది. దీనికి తోడు నియోజకవర్గ ఇన్చార్జి నియామకంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తాత్సారం టీడీపీ అభిమానులకు నిరాశ కలిగించింది. పంచాయతీ ఎన్నికల కోసం పార్టీ మద్దతుదారులను ఎన్నుకోలేని పరిస్థితి చాలా చోట్ల ఏర్పడింది. దీంతో పంచాయతీలో విజయం కోసం హడావుడిగా కొవగాపు సుధాకర్ రావును నియోజక వర్గ ఇన్చార్జిగా నియమించారు. ఐతే సుధాకర్‌రావు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసిన టీడీపీ మద్దతుదారుల గెలుపునకు ఏ మాత్రం కృషి చేయలేదని పాతపట్నం మండల టీడీపీ అధ్యక్షుడు కొంచాడ వీరభద్రరావుతో పాటు పలువరు టీడీపీ సీనియర్ నాయకులు బాహాటంగానే విమర్శించారు. దీంతో టీడీపీలో అసంతృప్తి గలం బహిర్గతమైంది. సుధాకర్ స్థానికుడని చెప్పుకొంటున్నప్పటికీ అతడి స్వగ్రామమైన అవలంగిలో కూడా టీడీపీ మద్దతుదారుని బరిలో నిలుపలేకపోయారని పార్టీ నాయకులు ఆరోపించారు. పరిశీలకులు తప్పుడు సంకేతాలిచ్చి పార్టీని నష్టపరిచే విధంగా కొవగాపు సుధాకర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారని స్థానిక నేతలు పార్టీ అధినాయకుడికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవం పొందాలంటే ఎర్రన్నాయుడు సతీమణి విజయకుమారిని ఇన్చార్జిగా నియమించాలని కోరుతూ టీడీపీ నాయకులు సమాచారాన్ని పంపినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పాతపట్నం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీకి చేజారినట్టే చెప్పుకోవాలి. అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. నియోజకవర్గ పరిస్థితులపై అధినేతకు ఫిర్యాదు చేయాలన్న తలంపుతో సోమవారం మేజర్ పంచాయతీ సర్పంచ్ పైల ప్రియాంక, శాసనపురి మధుబాబు, డి.ఉదయ్ భాస్కర్, పైల బాబ్జీ, కనకల నారాయణ, రుంకు చలపతి రావు, డి.పద్మావతి, బిడ్డిక చంద్రయ్య పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
సమైక్య రాష్ట్రం కోసంఒక గుండె ఆగింది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒక గుండె ఆగింది.. సమైక్య రాష్ట్రం కోసం జిల్లా లో తొలి బలిదానం జరిగింది. మరోవైపు జిల్లా అంతటా సమైక్య ఉద్యమ సెగ రాజుకుంది. రోడ్లపైనే వంటావార్పులు, పిండ ప్రదానాలు, గుండు గీయించుకోవడాలు, నాయకుల శవయాత్రలు, రాస్తారోకోలు సోమవారం ఉద్ధృతంగా సాగాయి. పలాసలో జీడిపప్పు పరిశ్రమ బంద్ పాటిం చింది. ఇంకా పలు పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. బస్సులు, ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. లావేరు మండలం గుమడాం గ్రామంలో పొడమచ్చిలి బంగారి (51) అనే వ్యక్తి టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయాడు. శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. రాష్ట్ర విభజనను తట్టుకోలేకే బంగారి మరణించడాని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. నైర వ్యవసాయ కళాశాలలో.. నైరలోని ఆచార్య ఎన్జీ. రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 3 గంటలపాటు రవాణా స్తంభించింది. అనంతరం కేసీఆర్, సోనియా, బొత్సల దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని లంకాం కూడలి వద్ద యువకులు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహిం చారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ద హనం చేసి సుమారు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఇటు వాకలవలస, అటు నందగిరిపేట కూడలి వర కూ ట్రాఫిక్ నిలిచిపోయింది. కరజాడ సమీపంలో కరజాడ, బైరి గ్రామాల యువకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు జాతీయ ర హదారిని దిగ్బంధించారు. వాకలవలస, అలికాం కాలనీల వాసులు కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. పాలకొండలో.. నియోజకవర్గంలో సోమవారం దాదాపు 15 చోట్ల సోనియా, కే సీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. న్యాయవాదులు రోడ్డుపైనే కుర్చీలు వేసుకుని కూర్చొని రాకపోకలు నిలిపివేశారు. ఆందోళనకారులు సినిమా హాళ్లను కూడా మూయించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు అంతా సంఘటితమై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను గాజులు వేసుకున్న మహిళలుగా చూపుతూ వేసిన చిత్రాలను ప్రదర్శించారు. సోనియా శవయాత్రలో ఓ సమైక్యవాది అర్ధనగ్నంగా తలకొరివి పట్టుకొని దాదాపు రెండు గంటల పాటు ఏడుస్తూ ప్రత్యేకతను చాటుకున్నాడు. సాయంత్రం ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నరసన్నపేటలో.. స్థానిక డీఆర్ఎన్ కళాశాల విద్యార్థులు సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఆటో యూనియన్ సభ్యులు ఆటోల ర్యాలీ నిర్వహించారు. రెడీమేడ్ వర్తక సంఘం ప్రతినిధులు ర్యాలీ నిర్వహించగా, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు కాలేజీ రోడ్డు వద్ద మానవహారం నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. పలాసలో... పలాస కాశీబుగ్గ పట్టణాలకు చెందిన జీడి పారిశ్రామికవేత్తలు, కార్మికులు, వివిధ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. జీడి పరిశ్రమలను బంద్ చేశారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాశీబుగ్గ కె.టి.రోడ్డులో టైర్లు కాల్చారు. టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటి ముందు ధర్నా చేశారు. ప్రజ్ఞ విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఆటో రిక్షా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మందస మండలం హరిపురంలో అన్ని వర్గాల ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇంటి ముందు బైఠాయించారు. ఇచ్ఛాపురంలో... స్వర్ణభారతి పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. సోనియా, కేసీఆర్, చిదంబరం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సోంపేటలో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కంచిలి రైల్వే స్టేషన్ జంక్షన్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాకపోకలు నిలిపివేశారు. రోడ్డు కిరువైపులా తాళ్లు కట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన నిర్వహించారు. రాజాంలో... రాజాంలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. పలు ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పొగిరి, ఒమ్మి గ్రామాల వద్ద సర్పంచ్ల ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజాం నగర పంచాయతీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. టెక్కలిలో... ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కూడలిలో జర్నలిస్టులు ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది కార్మికులు ఆటో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. కె.కొత్తూరు వద్ద జాతీయ రహదారిలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో పలు పాఠశాలల విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఎచ్చెర్లలో... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రెండున్నర గంటలపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి దిగ్బంధించారు. జేసీ పి.భాస్కర్ కారును చుట్టుముట్టారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి కృపారాణి చిత్రపటంతో విద్యార్థులు భిక్షాటన చేశారు. లావేరు మండలం సుభధ్రాపురం కూడలిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రణస్థలం, పైడి భీమవరం కూడళ్లలో జాతీయ రహదారిపై యువకులు రాస్తారోకోలు చేసి ట్రాఫిక్ స్తంభింప జేశారు. జి.సిగడాం మండలం పాలఖండ్యాంలో జూట్ మిల్లు కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ధర్నా చేశారు. సంతవురిటిలోయువకులు ధర్నా నిర్వహించి సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి పిండ ప్రదానం చేశారు. పాతపట్నంలో... ఎన్జీవోలు, సమైక్యాంధ్ర జేఏసీ సభ్యులు గ్రీవెన్స్‌సెల్‌ను నిలిపివేయాలని కోరుతూ మండల ప్రత్యేకాధికారి కె.స్వామినాథన్‌ను కోరడంతో గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం నిలిచిపోయింది. మెళియాపుట్టిలో పూర్తి బంద్ జరిగింది. మెళియాపుట్టి, చాపర, వసుంధర, జాడుపల్లి గ్రామాల్లో రోడ్లకు అడ్డంగా బెంచీలు, కర్రలు వేయడంతో పాటు టైర్లను కాల్చారు. మెళియాపుట్టి మూడు రోడ్ల జంక్షన్ వద్ద వంటావార్పు నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం జరుగలేదు. కొత్తూరులో ఆటో డ్రైవర్ యూనియన్, విద్యార్థులు, యువకలు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మెట్టూరు, కుంటిభద్ర, గూనభద్రల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గూనభద్ర జూట్ మిల్లు కార్మికులు ఆందోళన చేశారు. బొర్రంపేటలో గామస్తులు, యువకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్ఎన్ పేటలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. -
భార్య గొంతు కోసిన ఘనుడు
పలాస, న్యూస్‌లైన్: పోలీసులు కౌన్సెలింగ్ చేయడాన్ని అవమానంగా భావించి ఓ వ్యక్తి కట్టుకున్న భార్య గొంతుకను బ్లేడుతో కోసి ఆతర్వాత తనూ కోసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాశీబుగ్గ న్యూకాలనీ చాకలి చెరువు గట్టు వీధిలో శనివారం రాత్రి 7 గంటల సమయం లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవీ... న్యూకాలనీకి చెందిన మర్రి మురళీకృష్ణ తన భార్య అనూరాధ కనిపించడంలేదని 15 రోజుల కింద ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితులను పిలిపించి ఆరా తీశారు. ఈ నేథ్యంలో గత నెల 29వ తేదీన ఇంటికి వచ్చిన అనూరాధ తాను విశాఖపట్నంలో ఉంటున్న తం డ్రి ఓడరేవు మంగరాజు ఇంటికి వెళ్లానని చెప్పారు. అప్పటికే పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు ఉండడంతో ఆమె పోలీసులకు భర్తపై కేసు నమోదు చేయించారు. దీంతో పోలీసులు శనివారం ఇద్దరినీ పిలిపించి విచారణ చేశారు. ఇంటికి తిరిగివస్తుండగా చెరువుగట్టు వీధిలో మురళీకృష్ణ బ్లేడుతో భార్య గొంతు కోశాడు. ఆమె కేకలు వేస్తూ స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయన అదే బ్లేడుతో తన గొంతుక కూడా కోసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చి ఇద్దరినీ పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసి కాశీబుగ్గ సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్ఐ ఆర్.వేణుగోపాలరావు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమైక్య ఉద్యమం మరింత ఉద్ధృతం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. రెండో రోజు శని వారం కూడా బంద్ కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపో గేట్లు దాటి బయటకురాలేదు. ప్రైవేటు బస్సులు కూడా నిలిచిపోయాయి. దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్విహ ం చారు. సోనియాగాంధీ, యూపీఏ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, ఎచ్చెర్ల శాసనసభ్యుడు మీసాల నీలకంఠం ఇళ్లను ముట్టడించారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. జి.సిగడాం రైల్వేస్టేషన్లో విశాఖపట్నం- పలాస ఈఎంయూ రైలును కొద్దిసేపు నిలిపివేశారు. రేపు భారీ ర్యాలీ, బహిరంగసభ జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, వివిధ సం ఘాల ప్రతినిధులు సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పొట్టిశ్రీరాములు కూడలి, వైఎస్ఆర్ కూడలి మీదుగా డే అండ్ నైట్ కూడలికి చేరుకుని మానవహారం నిర్వహించారు. తర్వాత రామలక్ష్మణ, సూర్యమహల్, జీటీ రోడ్ మీదుగా మళ్లీ వైఎస్ఆర్ కూడలికి చేరుకుని సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ కేసీఆర్ జాగీర్ కాదని, ఇంకోసారి అలా అంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులు, విద్యార్థులేనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షు డు చౌదరి బాబ్జి, సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక ప్రతి నిధులు శ్రీనివాసానందస్వామి, హనుమంతు సాయిరామ్‌లు మాట్లాడుతూ ఉద్యమం ఊపందుకుందన్నా రు. సోమవారం భారీ ర్యాలీ, బహిరంగసభను నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యాసంస్థల ప్రతినిధి జామి భీమశంకర్, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి తదితరులు మా ట్లాడుతూ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. ఆర్టీసీకి మరో రూ.40 లక్షలు నష్టం వరుసగా రెండో రోజు కూడా జిల్లాలోని ఐదు డిపోల్లో 480 బస్సులు నిలిచిపోవటంతో ఆర్టీసీకి దాదాపు రూ.40 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఎదుట రోడ్డుపై ఉద్యమకారులు బైఠాయించి బస్సులను కదలనివ్వలేదు. ప్రైవేట్ బస్సులు కూడా లేకపోవటంతో ఇతర ప్రైవేటు వాహనాలవారు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చేశారు. = రాజాం జీఎంఆర్‌ఐటీ విద్యార్థులు శ్రీకాకుళం డే,నైట్ జంక్షన్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై బైఠాయించి బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. = శ్రీకాకుళంలో పీఆర్ మినిస్టీరియల్, ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఆడిట్, ఎస్బీఐ(జెడ్పీ బ్రాంచి), ఎఫ్‌సీఐ, శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ కార్యాలయం, ఇతర శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కేసీఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. = ఇచ్ఛాపురంలో ఉద్యమకారులు ర్యాలీ, ధర్నా, మానవహారం నిర్వహించారు. నరసన్నపేట జేఏసీ ఆధ్వర్యం లో సత్యవరం జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మరోవైపు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యకమంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, టీడీపీ నేత బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. = పాలకొండలో విశాఖపట్నం ప్రధాన రహదారిని సమైక్యవాదులు గంటసేపు దిగ్బంధించారు. న్యాయవాదులు పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉపాధ్యాయులు మహా ర్యాలీ నిర్వహించారు. = పాతపట్నం కోర్టు జంక్షన్లో ఉద్యోగులు, విద్యార్థులు, విద్యావేత్తలు ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సాయంత్రం స్టేట్‌బ్యాంక్ నుంచి కోర్టు జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. = ఎచ్చెర్లలో అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు 16వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కేసీఆర్, సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. = కాశీబుగ్గ,పలాస పట్టణాల్లో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉద్యమకారులు ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మహరణా గుండు గీయిం చుకుని నిరసన తెలిపారు. టెక్కలిలో సమైక్యాంధ్ర రాష్ట్ర ఫోరం, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. = ఆమదాలవలసలో ఉద్యమకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఇంటిని ముట్టడించి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు.