కారును ఢీకొన్న లారీ కారు డ్రైవర్‌కు గాయాలు
Published Wed, Aug 21 2013 3:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
లావేరు,న్యూస్‌లైన్: లావేరు మండలంలో బొంతుపేట గ్రామం వద్ద జాతీయరహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ ఎం.నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... బొంతుపేట గ్రామం వద్ద డిపో నుంచి సరుగుడు కర్రలతో లారీ వస్తోంది. ఇది జాతీయ రహదారిపై ఎక్కుతున్నప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెథ్తున్న కారును ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి.
కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. గాయపడిన డ్రైవర్‌ను వెంటనే 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. హైవేపై ప్రమాదం జరగడంతో వాహనాలు రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న వెంటనే లావేరు పోలీస్ స్టేషన్ హెచ్‌సీలు దేవదానం, రాంబాబు, రామరాజులు ప్రమాద స్థలానికి వెళిలరహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలు తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వీరు తెలిపారు.
Advertisement
Advertisement