సమైక్య ఉద్యమం మరింత ఉద్ధృతం
Published Sun, Aug 4 2013 5:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. రెండో రోజు శని వారం కూడా బంద్ కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపో గేట్లు దాటి బయటకురాలేదు. ప్రైవేటు బస్సులు కూడా నిలిచిపోయాయి. దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్విహ ం చారు. సోనియాగాంధీ, యూపీఏ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, ఎచ్చెర్ల శాసనసభ్యుడు మీసాల నీలకంఠం ఇళ్లను ముట్టడించారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. జి.సిగడాం రైల్వేస్టేషన్‌లో విశాఖపట్నం- పలాస ఈఎంయూ రైలును కొద్దిసేపు నిలిపివేశారు.
రేపు భారీ ర్యాలీ, బహిరంగసభ
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, వివిధ సం ఘాల ప్రతినిధులు సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పొట్టిశ్రీరాములు కూడలి, వైఎస్‌ఆర్ కూడలి మీదుగా డే అండ్ నైట్ కూడలికి చేరుకుని మానవహారం నిర్వహించారు. తర్వాత రామలక్ష్మణ, సూర్యమహల్, జీటీ రోడ్ మీదుగా మళ్లీ వైఎస్‌ఆర్ కూడలికి చేరుకుని సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ కేసీఆర్ జాగీర్ కాదని, ఇంకోసారి అలా అంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులు, విద్యార్థులేనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షు డు చౌదరి బాబ్జి, సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక ప్రతి నిధులు శ్రీనివాసానందస్వామి, హనుమంతు సాయిరామ్‌లు మాట్లాడుతూ ఉద్యమం ఊపందుకుందన్నా రు. సోమవారం భారీ ర్యాలీ, బహిరంగసభను నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యాసంస్థల ప్రతినిధి జామి భీమశంకర్, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి తదితరులు మా ట్లాడుతూ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు.
ఆర్టీసీకి మరో రూ.40 లక్షలు నష్టం
వరుసగా రెండో రోజు కూడా జిల్లాలోని ఐదు డిపోల్లో 480 బస్సులు నిలిచిపోవటంతో ఆర్టీసీకి దాదాపు రూ.40 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఎదుట రోడ్డుపై ఉద్యమకారులు బైఠాయించి బస్సులను కదలనివ్వలేదు. ప్రైవేట్ బస్సులు కూడా లేకపోవటంతో ఇతర ప్రైవేటు వాహనాలవారు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చేశారు.
= రాజాం జీఎంఆర్‌ఐటీ విద్యార్థులు శ్రీకాకుళం డే,నైట్ జంక్షన్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై బైఠాయించి బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు.
= శ్రీకాకుళంలో పీఆర్ మినిస్టీరియల్, ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆడిట్, ఎస్‌బీఐ(జెడ్పీ బ్రాంచి), ఎఫ్‌సీఐ, శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ కార్యాలయం, ఇతర శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కేసీఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
= ఇచ్ఛాపురంలో ఉద్యమకారులు ర్యాలీ, ధర్నా, మానవహారం నిర్వహించారు. నరసన్నపేట జేఏసీ ఆధ్వర్యం లో సత్యవరం జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మరోవైపు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యకమంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, టీడీపీ నేత బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు.
= పాలకొండలో విశాఖపట్నం ప్రధాన రహదారిని సమైక్యవాదులు గంటసేపు దిగ్బంధించారు. న్యాయవాదులు పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉపాధ్యాయులు మహా ర్యాలీ నిర్వహించారు.
= పాతపట్నం కోర్టు జంక్షన్‌లో ఉద్యోగులు, విద్యార్థులు, విద్యావేత్తలు ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సాయంత్రం స్టేట్‌బ్యాంక్ నుంచి కోర్టు జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.
= ఎచ్చెర్లలో అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు 16వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కేసీఆర్, సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
= కాశీబుగ్గ,పలాస పట్టణాల్లో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉద్యమకారులు ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మహరణా గుండు గీయిం చుకుని నిరసన తెలిపారు. టెక్కలిలో సమైక్యాంధ్ర రాష్ట్ర ఫోరం, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
= ఆమదాలవలసలో ఉద్యమకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఇంటిని ముట్టడించి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు.
Advertisement
Advertisement