బీఆర్‌ఏయూలో ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు బోధకులు
ఎచ్చెర్ల: కాంట్రాక్టు అధ్యాపకులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోసియేట్‌లు, టీచింగ్ అసిస్టెంట్‌లు సోమవారం సమ్మెకు దిగారు. రాష్ట్ర ఐక్య కార్యాచరణ యూనియన్ పిలు పు మేరకు తరగతులు బహిష్కరించారు. తరగతి గదులు, రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళాలు వేశారు. అనంతరం వర్సిటీ ముందు ఆందోళన చేశారు. సహాయ ఆచార్యులు పోస్టుల నియామ కానికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేకమైనదంటూ నినదించారు. డాక్టరేట్, నెట్, స్లెట్ వంటి అర్హతలతో ఏళ్లకొద్దీ పనిచేస్తున్న వారికి అన్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో ఉద్యమం ఉద్ధతం చేస్తామని, కోర్టులను సైతం అశ్రయిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావులను కలిసి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు బోధకుల నిరసన ను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం, డాక్టర్ కాయలు కష్ణమూర్తి, రోణంకి శ్రీధర్, డాక్టర్ జేఎల్ సంధ్యారాణి తదితరలు పాల్గొన్నారు.