‘అంబేద్కర్’పై చిన్నచూపు! | Ambedkar University, state government was to underestimate | Sakshi
Sakshi News home page

‘అంబేద్కర్’పై చిన్నచూపు!

Published Fri, Aug 22 2014 2:34 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

‘అంబేద్కర్’పై చిన్నచూపు! - Sakshi

‘అంబేద్కర్’పై చిన్నచూపు!

ఎచ్చెర్ల  : గ్రామీణ యూనివర్సిటీగా చెప్పుకునే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూసింది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నామమాత్రం నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో కంటే భారీగా కోత విధించడం అందరినీ విస్మయూనికి గురి చేసింది. వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం కావటం, స్థానిక వర్సిటీకి కనీసం 12-బీ గర్తింపు లేక పోవటం, మౌలిక వసతుల కొరత వెంటాడటంతో ప్రభుత్వం నిధుల కేటాయింపు లో ప్రాధాన్యం ఇస్తుందని అందరూ భావించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్‌లో భారీగా నిధులు మంజూరు చేస్తోందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
 
 అయితే ప్రభుత్వం మాత్రంమొండిచేయి చూపింది. బడ్జెట్ కేటాయింపులో కోత విధించింది. కేవలం రూ. 2.43 కోట్లు మాత్రమే కేటాయించి తన వివక్షతను చాటింది. దీంతో మరోసారి జిల్లా యూనివర్సిటీ వివక్షకు గురైంది. 12-బీ గుర్తింపు ఉండి యూజీసీ నుంచి నిధులు సంమృద్ధిగా వస్తున్న ఆంధ్రా, శ్రీవెంకటేశ్వరా, పద్మావతి, శ్రీకృష్ణదేవరాయ, యోగివేమన, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం, నాగార్జునా వంటి వర్సిటీలకు బడ్జెట్‌లో మెరుగైన నిధులు కేటాయించిన సర్కార్ గ్రామీణ నేపథ్యం ఉన్న బీఆర్‌ఏయూ కు మాత్రం అన్యాయం చేయడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రస్తుతం వర్సిటీకి కేటాయించిన నిధులు మంజూరు పరిశీలిస్తే భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల,
 
 ఫుడ్ పార్క్ వంటివి వస్తాయూ అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ ఉచ్ఛారత్ శిక్షా అభియాన్ వంటి పథకాలపైనే వ ర్సిటీ పూర్తిగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. వర్సిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే కనీసం రూ. 80 కోట్లు అవసరం ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ . 20 కోట్లు మంజూరు చేసినా కొంత ఊరట కలిగేది. మరీ దయనీ యంగా నిధుల కేటాయింపు ఉండటం వర్సిటీ అభివృద్ధిపై తీవ్రప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూ రు కాకపోతే బీఆర్‌ఏయూ ప్రగతికి అవరోధం తప్పదని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. 2010-11లో తప్ప వర్సిటీకి ఇంత తక్కువ కేటాయిం పులు ఎప్పుడూ జరగ లేదు. 2013-14 బడ్జెట్‌తో పోల్చి చూస్తే కేటాయింపుల్లో భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.బీఆర్‌ఏయూ  2008 జూన్ 25న ప్రారంభమైంది. అప్పటి నుంచి బడ్జెట్‌లో  కేటాయింపులు ఇలా ఉన్నాయి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement