First budget
-
రూ.3 లక్షల కోట్ల బడ్జెట్!?
సాక్షి, హైదరాబాద్: ఆరుగ్యారంటీల అమలుకు ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాల అమలు కోసం గ్రీన్‌చానెల్ ఆసరా కల్పిస్తూ, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రాధాన్యతల వారీగా చూపిస్తూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఈ తొలి బడ్జెట్ పద్దు రూ.2.95లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ పద్దు కింద మూడు నెలల కాలానికి అసెంబ్లీ అనుమతి తీసుకుని జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఓటాన్ అకౌంట్‌కు శనివారం ఉదయం 9 గంటలకు భేటీ కానున్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. పెద్ద పద్దులు తగ్గించకుండానే...! గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,90,296 కోట్లుగా సభ ఆమోదం కోసం పెట్టిన విషయం విదితమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల కంటే ముందే ఆన్లైన్లో ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖలు తమ ప్రతిపాదనలు పంపాయి. విద్యుత్ శాఖ రూ.18 వేల కోట్లు, సాగునీటి శాఖ రూ.25వేల కోట్లు, సంక్షేమ శాఖలన్నీ కలిపి రూ.40వేల కోట్ల పైచిలుకు, గృహనిర్మాణశాఖ రూ.25వేల కోట్లు, ఆర్టీసీ రూ.7వేల కోట్లు, వైద్యారోగ్య శాఖ రూ.13వేల కోట్లు, అన్ని రకాల విద్యాశాఖలు కలిపి రూ.21వేల కోట్లు, వ్యవసాయ శాఖ రూ.30వేల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.40వేల కోట్ల పైచిలుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. కీలకమైన ఈ ఐదారు శాఖల బడ్జెట్ పద్దు రూ.2లక్షల కోట్ల వరకు చేరాయి. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల చెల్లింపుల కింద మరో రూ.65వేల కోట్లు అవసరమవుతాయి. నాలుగు గ్యారంటీలకే నిధులు? ఆరు గ్యారంటీల అమలు కోసం రూ.65వేల కోట్ల వరకు అవసరమవుతాయనే అంచనాలున్నా ప్రస్తుత ఏడాది బడ్జెట్లో కేవలం నాలుగు గ్యారంటీల (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్)లకు నిధులు ప్రతిపాదించనున్నారు. వీటిని ఆయా శాఖల పద్దుల్లో సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు రైతుభరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనలకు అవసరమైన నిధులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయాశాఖల్లో సర్దుబాటు చేయనున్న ట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన వా టిలో రైతుబంధు (రైతు భరోసా) మినహా ఇతర ప థకాలకు నిధుల కేటాయింపు లేదని సమాచారం. వీటికి తోడు రెవెన్యూ పద్దు, మూల ధన వ్యయం, ద్రవ్యలోటు అంచనాలు కలిపి బడ్జెట్ పద్దు ఈసారి రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు వెళుతుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే.. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాలు, ఇవ్వాల్సిన గ్రాంట్ఇన్ ఎయిడ్లు ఆశించిన మేర రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో చూపించిన మొత్తానికి, సవరణల బడ్జెట్‌కు చాలా తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల్లో వాటా కింద రూ. 21,471 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 41,259 కోట్లను ప్రతిపాదించింది. అయితే, వాస్తవ రూపంలోకి వచ్చేసరికి డిసెంబర్ నాటికి రూ. 10,253 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేవలం రూ. 4978 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి తమకు ఏ మేరకు సహకారం ఉంటుందన్న దానిపై ఆచితూచి అంచనాలతో రాష్ట్రం బడ్జెట్ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే వాస్తవిక అంచనాలకు అనుగుణంగా ప్రతిపాదనలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల! ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర పన్నుల్లో వాటాను తెలంగాణకు 2.102 శాతంగా ప్రతిపాదించింది. ఇందులో కార్పొరేషన్ ట్యాక్స్ కింద రూ.8051.77 కోట్లు, ఆదాయపన్ను కింద రూ. 8872.10 కోట్లు, సీజీఎస్టీ కింద రూ. 7838.82 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ కింద రూ. 523.20 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ కింద రూ. 312.84 కోట్లు, సరీ్వసు టాక్స్, ఇతర పన్నులు కలిపి మొత్తం రూ. 25639.84 కోట్లు తెలంగాణకు వచ్చే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే పన్నుల్లో వాటా ప్రతిపాదనలు పెరిగి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల ఉండే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. అప్పులు.. భూముల అమ్మకాలు ఎలా? రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని మొదటి సమావేశాల్లోనే శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ పత్రంలో ఏ మేరకు రుణ సమీకరణను ప్రతిపాదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతేడాది రుణాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40,615 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రూ.36వేల కోట్లకు పైగా డిసెంబర్ నాటికే సమీకరణ జరిగింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెల చివరకు మరో రూ.5,400 కోట్లు తీసుకోనుంది. విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనుగడకు బహిరంగ మార్కెట్లో రుణ సేకరణ అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అప్పుల పద్దు రూ.40వేల కోట్లు దాటుతుందని తెలుస్తోంది. ఇక, రాజీవ్ స్వగృహ, దిల్ భూముల అమ్మకాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పన్నేతర ఆదాయం పద్దు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
హామీలకు పెద్దపీట..జగన్ సర్కారు తొలి బడ్జెట్
-
‘నవరత్నాల’బడ్జెట్ నేడే
సాక్షి, అమరావతి: తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జనరంజకంగా తీర్చిదిద్దింది. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని సమా చారం. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. రైతుల పట్ల సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం.. టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీ అప్పులను నూతన ప్రభుత్వానికి అప్పగించింది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలసి బడ్జెట్ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు. గత సర్కారు బకాయిల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్లో కేటాయింపులు చేయడం విశేషం. ఇందుకు ఉదాహరణ రైతులకు గత సర్కారు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించడం. కరువు కాటకాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయించడం అన్నదాతల పట్ల ఆయన చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. మరోపక్క వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. సంక్షేమానికి పెద్దపీట సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన బడ్జెట్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తగిన విధంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాభివృద్ధిపై దూరదృష్టితో ఆలోచించి గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనతోపాటు పోలవరం, వంశధార, గాలేరు నగరి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా బడ్జెట్ రూపొందించారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన అన్ని కుటుంబాలకు యూనివర్శల్ హెల్త్ కేర్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలకు కొండంత ఆరోగ్య భరోసా కల్పించేలా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. చేనేత, మత్య్సకారులు, ఆటో డ్రైవర్లుతోపాటు అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకునేలా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం పెళ్లి కానుక కింద బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. అన్ని పథకాలకు తగిన విధంగా కేటాయింపులు.. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు కేటాయింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు చేయనుంది. ఆత్మహత్యకు పాల్పడటం లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన రైతన్నల కుటుంబాలకు రూ. ఏడు లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. సహకార రంగం పునరుద్ధణకు నిధులు కేటాయించనున్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించనున్నారు. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో రూ.1,740 కోట్లను కేటాయించనున్నారు. రూ.2.31 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్! గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించి నూతన సర్కారుకు ఖాళీ ఖజానా అప్పగించినప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రూ. 2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లకుపైగా వస్తాయని భావిస్తున్నారు. కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.34 వేల నుంచి రూ.36 వేల కోట్ల దాకా రాష్ట్రానికి వస్తాయని అంచనా వేశారు. రూ.28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్! వ్యవసాయ మంత్రి కన్నబాబుకు బదులుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి బొత్స సాగుకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. అనుబంధ రంగాలతో కలిపి రూ.28,866 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కేవలం వ్యవసాయ రంగానికే రూ.12,510 కోట్లను కేటాయించనున్నారు. పశు సంవర్ధక శాఖకు రూ.1,240 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.3,212 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.5,000 కోట్లను కేటాయించనున్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను గత ఏడాది కన్నా 10 – 15 శాతం ఎక్కువ అంచనాలతో రూపొందించినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ అకాల మృతి చెందిన నేపథ్యంలో మంత్రులు బొత్స, మోపిదేవి అసెంబ్లీ, శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచించారు. 2013–14 నుంచి ఇది ఆచరణలోకి వచ్చింది. వ్యవసాయానికి గతంలో కేటాయింపులు(రూ. కోట్లలో) నేడు ఉదయం బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేపెట్టనున్నారు. అంతకు ముందు శుక్రవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమవేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది. -
మార్చి16న ఆ ప్రభుత్వ తొలి బడ్జెట్
జయలలిత మరణం అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో అట్టుడికిన తమిళనాడులో ఇటీవలే ఓ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కొత్తగా పదవిలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మార్చి 16న తమ తొలి బడ్జెట్ తో అసెంబ్లీ ముందుకు రాబోతుంది. మార్చి 16న పళనిస్వామి ప్రభుత్వం తొలి బడ్జెట్ తమిళనాడు అసెంబ్లీ ముందుకు రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి16న 10.30 గంటలకు సమావేశమవ్వాలని లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ ధనపాల్ సమన్లు పంపారు. ఆర్థికమంత్రి డీ జయకుమార్ పళనిస్వామి ప్రభుత్వంలో తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాస పరీక్షను ప్రతిపక్షం డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఎలాగైనా పదవిలో నుంచి దింపేందుకు బడ్జెట్ సమావేశాలను ఓ పావుగా వాడుకునేందుకు సిద్ధమవుతోంది. -
గజ్వేల్..‘రింగ్’.. జింగ్
గజ్వేల్.. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. కానీ కేసీఆర్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారో అప్పుడే ఈ ప్రాంతానికి మంచిరోజులొచ్చేశాయి. ఇక కేసీఆర్ సీఎం అయ్యాక గజ్వేల్ దశ పూర్తిగా మారిపోయింది. అభివృద్ధి కోసం నిధుల వరద పారుతోంది. కేవలం హైదరాబాద్‌లోనే ఉన్న రింగ్ రోడ్డు ఇపుడు గజ్వేల్‌లోనూ కనిపించబోతోంది. బడ్జెట్లోనూ ఈ మేరకు నిధులు కేటాయించడంతో గజ్వేల్ పట్టణవాసుల ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి. * రింగ్‌రోడ్డుకు రూ.30 కోట్లు మంజూరు చేసిన సీఎం * మొత్తం రూ.90కోట్లతో ప్రతిపాదనలు * భూసేకరణకు సిద్ధమవుతున్న యంత్రాంగం గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే తొలి బడ్జెట్లోనే గజ్వేల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించారు. తొలిదశగా రూ.30 కోట్లు మంజూరు చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్, సీఎం అయ్యాక ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌తో దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు రింగ్‌రోడ్‌తో చెక్ పెట్టాలని భావించారు. ఈ ప్రతిపాదనను అధికారుల ముందుంచిన కేసీఆర్..సాధ్యాసాధ్యాలపై వివరాలు సేకరించారు. రింగ్‌రోడ్డు పనులకు రూ. 90 కోట్లతో అధికారులు అంచనాలు తయారు చేయగా, కేసీఆర్ తన తొలి బడ్జెట్లోనే మూడోవంతు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం విడుదలైన నిధులతో భూసేకరణ పనులను చేపట్టేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం నుంచి ఇందిరాపార్క్, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకించి ఇక్కడ సంత జరిగే బుధవారం ప్రధాన రహదారిపై కొంతభాగంలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొన్నదంటే అతిశయోక్తి కాదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, ఇదే మార్గం గుండా భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతుండగా ప్రాణనష్టం సంభవిస్తోంది. ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి, 18న ‘మెతుకుసీమ గర్జన’ పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలో ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకుసీమ గర్జన సభలో ట్రాఫిక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌కు రింగ్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ బాధలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్అండ్బీ అధికారులను పురమాయించారు. కేసీఆర్ ఆదేశాలను మేరకు రంగంలో దిగిన ఆర్అండ్బీ శాఖ పట్టణంలోని 133/33కేవీ సబ్‌స్టేషన్ నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్కళాశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రూ.90 కోట్లతో అంచనాలను రూపొందించారు. రింగ్ రోడ్డు పూర్తిచేస్తే ఈ రహదారి వెంటే భారీ వాహనాలు వెళ్లే అవకాశముండగా, ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు ని ర్మాణం గజ్వేల్ చుట్టూ 19 కిలోమీటర్ల మేర 30 మీటర్ల వెడల్పుతో నిర్మాణం కానుంది. ఇందుకోసం 140 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులను భూసేకరణకు వినియోగించనున్నట్లు ఆర్అండ్బీ ఈఈ బాల్ నర్సయ్య ‘సాక్షి’కి తెలిపారు. -
అంగన్వాడీల సంక్షేమం పట్టదా?
సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో అంగన్వాడీల సంక్షేమం కోసం, వారి వేతనాల పెంపు కోసం ఎలాంటి నిధులను కేటాయించకుండా వారిని విస్మరించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలను శనివారం సిద్దిపేట పట్టణంలోని శివమ్స్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. సభకు ముందు అంగన్వాడీలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మహాసభలకు ప్రవాహంలా తరలివచ్చారు. శివమ్స్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ, నవ తెలంగాణ నిర్మాణంలో కీలకమైన అంగన్వాడీల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు కూడా సీఎం సిద్ధంగా లేరని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల యాజ మాన్యాలకు లాభం చేకూర్చేందుకు సమయం కేటాయిస్తున్న సీఎం, ప్రజలకు విశేష సేవలందిస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోకుండా, ఆత్మహత్యలపై అనుమానాలు వ్యక్తం చేయడం దారుణమన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా తక్షణమే గు ర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. చరి త్ర పుస్తకాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం విరమించుకోవాలన్నారు. కార్మిక సంక్షేమాలకు, హక్కుల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ వ్యక్తుల కోసం రద్దు చేయాలని నేతలు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడి దారుల కోసం దేశంలో ఉత్పత్తి చేసుకోమని ప్రకటించి, ఎక్కడైనా అమ్ముకోండని పిలుపునివ్వడం దారుణమన్నారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం వల్ల సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం జరుగుతుందన్నారు. మరో ఉద్యమానికి సిద్ధంగా కావాలి. ఉద్యమాల గడ్డగా నిలిచిన సిద్దిపేట ప్రాంతంలో అంగన్వాడీ సిబ్బంది మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంస్థలు ప్రతి కుటుంబానికి జీవించేందుకు కనీస వేతనం రూ. 15 వేలు ఉండాలని తెలియజేస్తున్నాయన్నారు. పాలకు లు మాత్రం అంగన్వాడీ సిబ్బందికి గౌరవ వేతనం ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికైన వారికి కనీస వేతనం అమలు చేయాలని డి మాండ్ చేశారు. గౌరవ వేతనం, పారితోషికాల పేరుతో కార్మికులు, సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. వాగ్ధానాలను అమలు చేయాలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. సిబ్బంది వేతనాల పెంపు కోసం ఈ నెల 18న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ. మల్లేషం, శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ఎస్. రమ, అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మ, నర్సమ్మ, డివిజన్ కార్యదర్శి రేవంత్‌కుమార్, నాయకులు జగన్, పుష్పలత, అనురాధ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, అంజమ్మ, హేమలత, ఆనంద్, రాజు, బాల్‌రాజు, నాగరాజు, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రవేశపెడతారు. బుధవారం సాయంత్రం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఒకే సమయంలో అసెంబ్లీలో ఈటెల రాజేందర్, శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నం కావడంతో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ముందుగానే వివిధ శాఖాధిపతులతో విస్తృతంగా చర్చించి, ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఏడో తేదీ నుంచి ఉదయం 10 గంటలకే ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. -
‘అంబేద్కర్’పై చిన్నచూపు!
ఎచ్చెర్ల : గ్రామీణ యూనివర్సిటీగా చెప్పుకునే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూసింది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నామమాత్రం నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో కంటే భారీగా కోత విధించడం అందరినీ విస్మయూనికి గురి చేసింది. వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం కావటం, స్థానిక వర్సిటీకి కనీసం 12-బీ గర్తింపు లేక పోవటం, మౌలిక వసతుల కొరత వెంటాడటంతో ప్రభుత్వం నిధుల కేటాయింపు లో ప్రాధాన్యం ఇస్తుందని అందరూ భావించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్లో భారీగా నిధులు మంజూరు చేస్తోందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రంమొండిచేయి చూపింది. బడ్జెట్ కేటాయింపులో కోత విధించింది. కేవలం రూ. 2.43 కోట్లు మాత్రమే కేటాయించి తన వివక్షతను చాటింది. దీంతో మరోసారి జిల్లా యూనివర్సిటీ వివక్షకు గురైంది. 12-బీ గుర్తింపు ఉండి యూజీసీ నుంచి నిధులు సంమృద్ధిగా వస్తున్న ఆంధ్రా, శ్రీవెంకటేశ్వరా, పద్మావతి, శ్రీకృష్ణదేవరాయ, యోగివేమన, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం, నాగార్జునా వంటి వర్సిటీలకు బడ్జెట్లో మెరుగైన నిధులు కేటాయించిన సర్కార్ గ్రామీణ నేపథ్యం ఉన్న బీఆర్‌ఏయూ కు మాత్రం అన్యాయం చేయడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రస్తుతం వర్సిటీకి కేటాయించిన నిధులు మంజూరు పరిశీలిస్తే భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ఫుడ్ పార్క్ వంటివి వస్తాయూ అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ ఉచ్ఛారత్ శిక్షా అభియాన్ వంటి పథకాలపైనే వ ర్సిటీ పూర్తిగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. వర్సిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే కనీసం రూ. 80 కోట్లు అవసరం ఉంది. రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ . 20 కోట్లు మంజూరు చేసినా కొంత ఊరట కలిగేది. మరీ దయనీ యంగా నిధుల కేటాయింపు ఉండటం వర్సిటీ అభివృద్ధిపై తీవ్రప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూ రు కాకపోతే బీఆర్‌ఏయూ ప్రగతికి అవరోధం తప్పదని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. 2010-11లో తప్ప వర్సిటీకి ఇంత తక్కువ కేటాయిం పులు ఎప్పుడూ జరగ లేదు. 2013-14 బడ్జెట్‌తో పోల్చి చూస్తే కేటాయింపుల్లో భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.బీఆర్‌ఏయూ 2008 జూన్ 25న ప్రారంభమైంది. అప్పటి నుంచి బడ్జెట్లో కేటాయింపులు ఇలా ఉన్నాయి... -
తొలి పద్దు.. పాతవాటితో సద్దు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో జిల్లాకు కనీస ప్రాధాన్యమైనా దక్కలేదు. గత ప్రభుత్వ హయూంలో చేసిన ప్రతిపాదనలను బడ్జెట్లో చూపించి.. వాటిని తాము కొత్తగా చేపట్టబోతున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గొప్పలు పోయూరు. ఏలూరులో శిల్పారామం, పేరుపాలెం బీచ్‌లో రిసార్ట్స్ నిర్మిస్తామంటూ పాత ప్రతిపాదనలను కొత్తగా తెరపైకి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు మాత్రం పైసా కూడా కేటాయించలేదు. వ్యవసాయానికి 9గంటలు, గృహాలకు 24గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినా ఎప్పటినుంచి ఇస్తారో స్పష్టం చేయలేదు. చెప్పినవన్నీ పాతవే మొత్తంగా బడ్జెట్‌ను చూస్తే పాత ప్రాజెక్టులనే మళ్లీ ప్రకటించడం మినహా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు ఏమీ కనిపించలేదు. ఏలూరు నగరంలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. నిజానికి ఈ ప్రతిపాదన గతంలోనే ఉంది. ఏలూరులోని పంపుల చెరువు వద్దగల గులాబీతోట ప్రాంతంలో నగరపాలక సంస్థకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని శిల్పారామం ఏర్పాటుకు కేటాయించేలా గత కలెక్టర్లు సంజయ్‌జాజు, వాణీమోహన్ ప్రతిపాదనలు రూపొం దించారు. నగరపాలక సంస్థ స్థలంలో శిల్పారామం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక నాయకుడు పగడాల వెంకటరత్నం నాయుడు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రతిపాదన మూలనపడింది. అనంతరం తంగెళ్లమూడి ప్రాం తంలోని 1వ డివిజన్ ఎమ్మార్సీ కాలనీ వద్ద దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం ఏర్పాటుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి హోదాలో కావూరి సాంబశివరావు సార్వత్రిక ఎన్నికల ముందు శంకుస్థాపన చేశారు. తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది. చిరంజీవి హామీ ఇది మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో రిసార్ట్స్ నిర్మిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో సినీ నటుడు చిరంజీవి ప్రకటించారు. ఇందుకు సంబంధించి దాదాపు రూ.10 కోట్లు ఖర్చుకాగల ప్రతిపాదనలు రూపొందిం చారు. దీనికి తాజాగా బడ్జెట్లో స్థానం కల్పించారు. ఇక విజయవాడ-కాకినాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎరుుర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇది కూడా కొత్త ప్రతిపాదన కాదు. 2004లో అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఆలోచన చేశారు. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు జిల్లాలోని తాడేపల్లిగూడెంను అనుకూల ప్రాంతంగా గుర్తించారు. అక్కడి విమానాశ్రయ భూముల్లో ఎరుుర్‌పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేసి టెండర్లు కూడా పిలిచారు. సత్యం రామలింగరాజుకు చెందిన మైటాస్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఆ తర్వాత కంపెనీ పలు కేసుల్లో ఇరుక్కోవడంతో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం తాజా బడ్జెట్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది వెల్లడించకపోయినా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి విద్యుత్ ఎప్పటినుంచి ఇస్తారు వ్యవసాయానికి ప్రస్తుతం ఇస్తున్న 7గంటల విద్యుత్ సరఫరాను 9గంటలకు పెంచుతామని, గృహాలకు రోజంతా అందిస్తామని చెప్పినప్పటికీ ఎప్పటి నుం చి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. వృద్ధులకు రూ.వెరుు్య, వికలాంగులకు రూ.1,500 పింఛన్ అందిస్తామని, ప్రతి గ్రామానికి రూ.2కే 20 లీటర్ల తాగునీరు ఇస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. వీటన్నిటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీనినిబట్టి చూస్తే ఇవి కూడా ప్రజలకు పూర్తిస్థారుులో దక్కవనే విషయం అర్థమవుతోంది. అన్నిటికంటే ముఖ్యమైన రుణమాఫీకి బడ్జెట్లో కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించడం జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు కోస్తా జిల్లాల్లోని రైతుల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టుకు తొలి బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందనే ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం కేటారుుంపులు చేయలేదని టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. కానీ రాష్ట్ర వాటాగా కనీస కేటాయింపులు చేయకపోతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు సాగే పరిస్థితి లేదు. -
‘తూర్పు’నకు నిట్టూర్పే
సాక్షి, రాజమండ్రి :విభజన తర్వాత ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకోగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్ని వర్గాల వారికీ నిరాశే మిగిల్చారు. ప్రాధాన్య రంగాలను వదిలి చేసిన కసరత్తులో జిల్లాకు పెద్దగా ఏమీ దక్కలేదని చెప్పాలి. నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ప్రతిపాదిత కేటాయింపుల్లో కోతలు విధించారు. పుష్కర ఎత్తిపోతలు, పోలవరం ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులే ఇచ్చారు. ఇతర ప్రాజెక్టుల నిర్వహణా నిధుల్లోనూ కోత పెట్టారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం అందుకుతగ్గ కేటాయింపులు జరపలేదు. గతంలో ఆర్థిక మంత్రి ప్రకటించినట్టు రూ.వంద కోట్లకే పరిమితమయ్యారు. ఇక జిల్లాకు మేలనిపించే అంశాల్లో చాలా వరకూ కేంద్రం చేపట్టేవే. కాకినాడలో ఏర్పాటు చేస్తామన్న హోటల్ మేనేజ్మెంటు ఇనిస్టిట్యూట్‌కు మాత్రం రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. జిల్లాకు ప్రకటించినవి ఇవీ.. పర్యాటకాభివృద్ధి పేరుతో కాకినాడలో శిల్పారామం కాకినాడ- విశాఖ మధ్య (విశాఖ శివార్లలో) గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు నిర్మాణం చిత్తూరుతో పాటు కాకినాడలో కూడా ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి ప్రతిపాదన కాకినాడ తీరంలో లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం రాజమండ్రి విమానాశ్రయ విస్తరణకు కేంద్ర ఎయిర్‌పోర్టు అథారిటీకి సహకారం కాకినాడలో రూ.12 కోట్లతో హోటల్ మేనేజ్మెంటు ఇనిస్టిట్యూట్ గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు కేటాయింపు ప్రైవేట్ నిర్వహణలో కాకినాడలో వాణిజ్య పోర్టు ఏర్పాటు పర్యాటకానికి నిరుత్సాహం.. శిల్పారామం, ఎల్ఎన్జీ టెర్మినల్ గత ప్రభుత్వం కూడా ప్రతిపాదించినవే. కొత్తగా ప్రతిపాదించిన వాటిలో కేటాయింపులు జరిగినవి పెద్దగా లేవనే చెప్పాలి. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్లు వస్తున్నా ఆ దిశగా ప్రతిపాదనలు లేవు. కోనసీమ నుంచి రాజమండ్రి వరకూ గోదావరి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పక్కనబెట్టారు. వికలాంగులకు నిస్పృహ వికలాంగుల పింఛనుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించింది. రూ. 1500 పెన్షన్ అందుతుందన్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. 80 శాతం వైకల్యం ఉంటేనే అక్టోబర్ రెండు నుంచి రూ.1500 పింఛను వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో సుమారు 64 వేల మంది వికలాంగ పింఛనుదారులు ఉండగా వీరిలో 80 శాతం వైకల్యం ఉన్నవారు ఐదు వేల మంది కూడా ఉండ రని అంచనా. 60 శాతం ఉన్న వారికి రూ.1500 వర్తింప చేస్తారని ఆశించగా నిరాశ మిగిలింది. ఆ శాఖల బడ్జెట్ లోనే దిక్కు? పుష్కరాలకు రాష్ట్రం మొత్తంమీద గోదావరి తీరంలో చేపట్టాల్సిన పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. ఆయా శాఖలు తమ స్వంత నిధుల నుంచి కూడా పుష్కరాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆర్అండ్బీ శాఖకు ఈ పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. తూర్పు ఆదర్శంగా... రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ ఆధారిత ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ విధానాన్ని 2012లో తొలిసారిగా జిల్లాలో అమలు చేయడం వల్ల 15 శాతం రేషన్ ఆదా అవుతోందని, దీన్ని రాష్ట్రం అంతా అమలు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇరిగేషన్‌కు అంతంత మాత్రమే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల నిర్వహణా వ్యయంలో కోత పెట్టింది. ఈ ఏడాది ఇరిగేషన్ ప్రాజెక్టులకు అంతంత మాత్రం కేటాయింపులు చేసింది. కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు కేటాయించే నిధుల్లో కూడా కోత పెట్టారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు గతం కంటే తగ్గించారు. జిల్లాలోని ఇతర చిన్న, మధ్యతరగతి ప్రాజెక్టుల నిర్వహణ గ్రాంటుల్లో కూడా కోత పెట్టారు. జిల్లాల్లో ఆయా ప్రాజెక్టులకు ప్రణాళికా వ్యయం కింద దక్కిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. -
బీమా పరిశ్రమ డిమాండ్...
49 శాతానికి ఎఫ్‌డీఐ ‘పరిమితి’ దేశంలో ఇంకా సుప్తావస్తలోనే ఉన్న బీమా రంగం మరింత వేళ్లూనుకోవాలంటే... ప్రభుత్వం నుంచి తగిన సహాయసహకారాలు కావాలని పరిశ్రమ కోరుతోంది. ముఖ్యంగా మోడీ నేతృత్వంలోని కొత్తసర్కారు తమ రంగానికి తొలి బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంటోంది. ఎఫ్‌డీఐల పరిమితి పెంపే కీలకం... ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచాలని బీమా కంపెనీలు ఎప్పటినుంచో ముక్తకంఠంతో చెబుతున్నాయి. దీనివల్ల నిధుల లభ్యత పెరిగి వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బీమా రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని 49 శాతానికి పెంచాలనేది పరిశ్రమ డిమాండ్. గత యూపీఏ ప్రభుత్వం దీనికి 2013 జూలైలో ఆమోదం తెలిపింది. అయితే, పార్లమెంట్ ఆమోదానికి లోబడి మాత్రమే ఈ పరిమితి పెంపు ఉంటుందని పేర్కొంది. ఇతర ముఖ్య విజ్ఞప్తులు ఇవీ... 1. బ్యాంకులను అన్నిరకాల ఇన్సూరెన్స్ కంపెనీల బీమా పాలసీలను విక్రయించేందుకు వీలుగా బ్రోకర్‌గా అనుమతించాలి. ప్రస్తుతం కార్పొరేట్ ఏజెంట్‌గా మాత్రమే బ్యాంకులకు అనుమతి ఉంది. అదీకూడా లైఫ్, నాన్-లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లకు చెందిన ఒక్కో కంపెనీకి మాత్రమే ఏజెంట్‌గా వ్యవహరించాలనేది నిబంధన. 2. ఆరోగ్య బీమా పథకాలవైపు ప్రజలను ఆకర్షితులను చేయాలంటే ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపుల పరిమితిని పెంచాలి. ప్రస్తుతం సెక్షన్ 80డీ ప్రకారం రూ.15,000 వరకూ ఆరోగ్యబీమా పాలసీకి పన్ను ఆదాయం నుంచి మినహాయింపు అమల్లో ఉంది. దీన్ని రూ.50 వేలకు పెంచాలని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కోరుతున్నాయి. 3. మరింత మందికి ఆరోగ్యబీమా పథకాలవైపు మొగ్గుచూపేలా చేయడానికి పన్ను మినహాయింపు పరిమితి పెంపు తప్పనిసరి. 4. వైపరీత్యాలను కవర్ చేసే విధంగా అందిస్తున్న పాలసీలపట్ల ప్రజలను ఆకర్షితులు చేయాలంటే ఇలాంటి పాలసీలపై వ్యయానికికూడా పన్ను మినహాయింపులు ఇవ్వాలి.