బుధవారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ | eetela rajender to present first budget for telangana state | Sakshi
Sakshi News home page

బుధవారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్

Published Mon, Nov 3 2014 5:01 PM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

eetela rajender to present first budget for telangana state

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రవేశపెడతారు. బుధవారం సాయంత్రం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఒకే సమయంలో అసెంబ్లీలో ఈటెల రాజేందర్, శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెడతారు.

దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నం కావడంతో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ముందుగానే వివిధ శాఖాధిపతులతో విస్తృతంగా చర్చించి, ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఏడో తేదీ నుంచి ఉదయం 10 గంటలకే ఈ సమావేశాలను ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement