నైపుణ్యతతోనే ఉన్నత స్థాయి | skill to develop | Sakshi
Sakshi News home page

నైపుణ్యతతోనే ఉన్నత స్థాయి

Published Tue, Jul 19 2016 11:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

skill to develop

ఎచ్చెర్ల: నైపుణ్యాలు ఉన్న విద్యార్థులు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారని మలేషియాకు చెందిన యూఎస్‌ఎం వర్సిటీ ప్రొఫెసర్‌ ఎం.బాలరాజు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో సోషల్‌ వర్కు, రూరల్‌ డెవలప్‌మెంట్, ఎంఎడ్, ఎకనామిక్స్‌ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలపై సోమవారం ఒక్క రోజు వర్కుషాపు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సంపూర్ణ విషయ పరిజ్ఞానంతో ముందుకు సాగాలన్నారు. ఎంటర్‌ ప్రన్యూర్‌ షిప్, సోషల్‌ డెవలప్‌మెంట్, వ్యక్తిత్వ వికాసం ఎంతగానో అవసరమని చెప్పారు. కష్టపడే విద్యార్థులకు భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు యు.కావ్యజ్యోత్స, డాక్టర్‌ జే ఎల్‌ సంధ్యారాణి, డి.వనజ, మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement