దామరచర్ల(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో సూర్యాపేట వంటి సంఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యేందుకు 8 మంది పోలీసులతో కూడిన క్విక్ యాక్షన్ టీంను ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ జి.సందీప్ తెలిపారు. మంగళవారం మండలంలోని అడవిదేవులపల్లిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది మందితో కూడిన ఈ బృంద సభ్యులకు ఆధునిక ఆయుధాలు సమకూర్చినట్లు వివరించారు. ఎలాంటి ఘటన జరిగినా తిప్పికొట్టేందుకు వారు సంసిద్ధులై ఉంటారని తెలిపారు.
అలాగే, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా గ్రామ పోలీసు అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో జన మైత్రి సంఘాలతో పాటు పల్లె నిద్ర పథకాలను చేపట్టడం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు.
నల్లగొండ జిల్లాలో ‘క్విక్ యాక్షన్ టీం’ ఏర్పాటు
Published Tue, May 19 2015 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement