'అనుకున్నవన్ని జరగవు కొన్ని'.. ఆసక్తిగా ట్రైలర్! | Anukunnavanni Jaragavu Konni Tollywood Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Anukunnavanni Jaragavu Konni: 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'.. ఆసక్తిగా ట్రైలర్!

Oct 31 2023 6:40 PM | Updated on Oct 31 2023 6:40 PM

Anukunnavanni Jaragavu Konni Tollywood Movie Trailer Released - Sakshi

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 3న ఈ  చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

దర్శకుడు జి.సందీప్‌ మాట్లాడుతూ..'కథ అంతా రెడీ చేసుకుని నిర్మాత కోసం వెతుకుతున్న తరుణంలో నేనే నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు సపోర్ట్‌ చేశారు. అయితే దగ్గరుండి ఈ సినిమా పూర్తి చేయడానికి చాలామంది సహకరించారు. అలా నా చుట్టూ ఉన్న సన్నిహితుల వల్లే ఇక్కడి వరకూ రాగలిగాను. నా టీమ్‌ అంతా చాలా సపోర్ట్ చేశారు. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ మీ అందరికీ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.' అని అన్నారు.

కిరీటి దామరాజు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో నేనూ ఓ పాత్ర  పోషించా. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే ఈ చిత్రంలో చూపించారు. మన జీవితంలో ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. అదే సినిమా కాన్సెప్ట్. దర్శకుడు సందీప్‌ చక్కగా తీశారు.' అని అన్నారు.  

మౌనిక మాట్లాడుతూ.. 'ఏ నటికైనా ఓ సినిమా హిట్ అయ్యాకే అవకాశాలు వస్తాయి. కానీ నా కెరీర్‌ బిగినింగ్‌లో ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినవారే గురువులుగా నిలుస్తారు. నా మొదటి దర్శకుడు రామరాజు.. ఇప్పుడు సందీప్‌ నాకు అవకాశాలిచ్చారు. నా మొదటి సినిమా లాక్‌డౌన్ వల్ల థియేటర్‌లో విడుదల కాలేదు. ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఈ సినిమా ఆకట్టుకుంటుంది.' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement