సాక్షి, తూర్పు గోదావరి : రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరటి లోడుతో వేగంగా వస్తున్న లారీ రావులపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి సర్వీస్ రోడ్లో నిలబడి ఉన్న భార్యభర్తలపై బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఈ ఘటనలో ఉప్పలపాటి సూర్యకుమారి మృతి చెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా మారడంతో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అదుపుతప్పిన లారీ; ఒకరి మృతి
Published Thu, Oct 24 2019 3:47 PM | Last Updated on Thu, Oct 24 2019 4:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment